ప్రకృతిని ప్రేమించే యువత కోసం 'క్వాడ్' ఎలక్ట్రిక్ వాహనం

By Ravi

మీరు ప్రకృతి ప్రేమికులా.. అయితే, ఈ కథనం మీలాంటి వారి కోసమే..! ఇదిగో ఈ ఫొటోల్లో కనిపిస్తున్న వాహనం పేరు 'క్వాడ్' (Quad). చూడటానికి ఆల్ టెర్రైన్ వెహికల్ (ఏటివి) డిజైన్‌ను పోలి ఉండే ఈ వాహనం పూర్తిగా బ్యాటరీ పవర్‌తో నడుస్తుంది.

ఈ నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనం క్వాడ్‌ను అర్బన్ ట్రాన్స్‌‌పోర్టేషన్, ఆఫ్-రోడ్ అడ్వెంచర్స్ కోసం డిజైన్ చేశారు. ప్రత్యేకించి ఆధునిక యువతను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసిన ఈ క్వాడ్ ఎలక్ట్రిక్ వాహనం పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనది.

క్వాడ్ ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

క్వాడ్ ఎలక్ట్రిక్ వెహికల్

క్వాడ్ ఎలక్ట్రిక్ వాహనం 48వోల్టుల ఎలక్ట్రిక్ మోటార్‌తో నడుస్తుంది. ఈ మోటార్‌కు 750యాంప్ బ్యాటరీల ద్వారా విద్యుత్ అందుతుంది. రెగ్యులర్ కంబస్టియన్ ఇంజన్ ఎఫీషియన్సీ (9 శాతం)తో పోల్చుకుంటే ఈ సిస్టమ్ ఎఫీషియన్సీ 69 శాతంగా ఉంటుంది.

క్వాడ్ ఎలక్ట్రిక్ వెహికల్

క్వాడ్ ఎలక్ట్రిక్ వెహికల్ సేఫ్ చార్జింగ్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇందులో ఎక్స్‌టర్నల్ చార్జర్ ఉంటుంది. గృహ వినియోగానికి ఉపయోగించే విద్యుత్‌తోనే ఈ వాహనంలోని బ్యాటరీలను రీచార్జ్ చేసుకోవచ్చు.

క్వాడ్ ఎలక్ట్రిక్ వెహికల్

ఈ బ్యాటరీలు పూర్తిగా చార్జ్ కావటానికి 220వోల్ట్ పవర్ అవుట్‌లెట్ ద్వారా అయితే సుమారు 6 గంటలు లేదా 110వోల్ట్ పవర్ అవుట్‌లెట్ ద్వారా అయితే 8 గంటల సమయం పడుతుంది.

క్వాడ్ ఎలక్ట్రిక్ వెహికల్

సింగిల్ ఛార్జ్‌పై క్వాడ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని దాదాపు 3 గంటల పాటు నిరంతరాయంగా ఆపరేట్ చేయవచ్చు.

క్వాడ్ ఎలక్ట్రిక్ వెహికల్

క్వాడ్ ఎలక్ట్రిక్ చార్జింగ్ సిస్టమ్‌తో పాటుగా, ఎమర్జెన్సీ రీచార్జ్ సిస్టమ్‌తో కూడా లభిస్తుంది. ఈ సిస్టమ్‌లో సోలార్ ప్యానెళ్లు ఉంటాయి, వీటి ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తు బ్యాటరీలలో నిక్షిప్తం అవుతుంది. దీనిని బ్యాకప్ వవర్ సోర్స్‌గా ఉపయోగించుకోవచ్చు.

క్వాడ్ ఎలక్ట్రిక్ వెహికల్

క్వాడ్ ఎలక్ట్రిక్ వాహనంలోని ఛాస్సిస్ మరియు ఇతర విడిభాగాలను రీసైకిల్ చేసుకునే విధంగా డిజైన్ చేశారు. ఇందులోని ప్లాస్టిక్ పదార్థాలను కూడా రీసైకిల్డ్ మెటీరియల్స్‌తో తయారు చేశారు.

క్వాడ్ ఎలక్ట్రిక్ వెహికల్

ఇంకా ఇందులో చార్జ్ ఇండికేటర్‌తో కూడిన డిజిటల్ డిస్‌ప్లే, వార్నింగ్ లైట్స్, తక్కువ విద్యుత్తును గ్రహించే ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

క్వాడ్ ఎలక్ట్రిక్ వెహికల్

క్వాడ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఫకుండో ఇలియాస్ బెహాన్స్ అనే డిజైనర్ డిజైన్ చేశారు.

More from DriveSpark

Article Published On: Wednesday, October 16, 2013, 13:07 [IST]
English summary
Quad is a four wheeled electric vehicle that is designed for urban transportation as well as off-road voyages. It runs on a chassis-mounted 48v electric motor powered by four 750amp batteries. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+