మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. ప్రజ్ఞానందకు చేరిన ఎలక్ట్రిక్ కారు ఇదే..

చదరంగంలో (చెస్) ప్రపంచ స్థాయికి ఎదిగిన ప్రజ్ఞానందను దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎంతో అభినందించారు. కొడుకు వృద్ధికి కారణమైన అతని తల్లిదండ్రులకు ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్ ఇస్తానని గతంలో ప్రకటించారు. ఎట్టకేలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

భారతదేశంలో అతి చిన్న వయసులోనే గ్రాండ్‌మాస్టర్ అయిన ఆర్ ప్రజ్ఞానంద ఫ్యామిలీ నిన్న (మంగళవారం) మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్‌యూవీ400 ఈవీ (XUV400 EV) డెలివరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రజ్ఞానంద స్వయంగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ఇందులో ఆనంద్ మహీంద్రాకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

R Praggnanandhaa Mahindra XUV400

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో గమనించినట్లయితే.. ప్రజ్ఞానంద, అతని తల్లి నాగ లక్ష్మి, తండ్రి రమేష్ బాబు కూడా ఉన్నారు. ఇందులో షోరూమ్ సిబ్బంది వారికి మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ కారును డెలివరీ చేయడం చూడవచ్చు. ప్రజ్ఞానంద షేర్ చేసిన ఫోటోలు వేలసంఖ్యలో వీక్షకులు వీక్షించారు, కొందరు ప్రజ్ఞానంద ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేస్తున్నారు.

గత ఏడాది ఆగస్టులో వరల్డ్ చెస్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్న ప్రజ్ఞానందకు కారు గిఫ్ట్ ఇవ్వాలని పలువురు ఆనంద్ మహీంద్రాను కోరారు. అయితే ప్రజ్ఞానంద అభిరుచిని గమనించి ఇంతవాన్ని చేసిన ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఎలక్ట్రిక్ కారు గిఫ్ట్ ఇస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆనంద్ మహీంద్రా చెప్పినట్లుగానే వారికి కారు డెలివరీ అయ్యేలా చేశారు.

R Praggnanandhaa Mahindra XUV400

ఆనంద్ మహీంద్రా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచినవారికి కార్లను గిఫ్ట్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా చాలామంది క్రికెటర్లకు, పారాలింపిక్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి కార్లను గిఫ్ట్ ఇచ్చారు. అంతే కాకుండా నీరజ్ చోప్రా కూడా ఓ ప్రత్యేకమైన మహీంద్రా XUV700 కారును గిఫ్ట్ ఇచ్చారు. కాగా ఇప్పుడు మరోసారి చెస్ గ్రాండ్ మాస్టర్ కోసం XUV400 ఈవీ అందించారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ (Mahindra XUV400 EV)

దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణపొందిన మహీంద్రా కంపెనీ యొక్క XUV400 ఈవీ ప్రారంభ ధరలు రూ.15 లక్షల కంటే ఎక్కువ. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ఫ్యాక్స్ కలిగి ఉంటుంది. అవి 34.5 కిలోవాట్ బ్యాటరీ మరియు 39 కిలోవాట్ బ్యాటరీ. ఇవి రెండూ వరుసగా 375 కిమీ రేంజ్ మరియు 456 కిమీ రేంజ్ అందిస్తాయి.

మహీంద్రా XUV400 ఈవీ కేవలం 8.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగవంతమవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్ట వేగం 150 కిమీ/గం. ఇది 3.3 kW ఏసీ ఛార్జర్ ద్వారా కావడానికి 13 గంటల సమయం పడుతుంది. అయితే ఇది ఫాస్ట్ ఛార్జర్ సాయంతో 0 నుంచి 80 శాతం ఛార్జ్ కావడానికి పట్టే సమయం కేవలం 50 నిమిషాలు మాత్రమే.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, March 13, 2024, 10:17 [IST]
English summary
R praggnanandhaa thanks anand mahindra for gifting xuv400 ev to his parents
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+