రాఫెల్ నాదల్ గ్యారాజ్‌లో కొత్తగా వచ్చి చేరిన Kia EV6 GT ఎలక్ట్రిక్ కార్..

ప్రఖ్యాత టెన్నిస్ ఆటగాడు రాఫెల్ నాదల్ తన కార్ గ్యారాజ్ లో కొత్తగా ఓ ఎలక్ట్రిక్ కారను చేర్చుకున్నాడు. ప్రముఖ కొరియన్ కార్ బ్రాండ్ కియా ఈ ఏడాది ఆరంభంలో ప్రపంచ మార్కెట్లకు పరిచయం చేసిన అధునాతన ఎలక్ట్రిక్ కారు కియా ఈవీ6 (Kia EV6) రాఫెల్ నాదల్ చెంతకు చేరింది. ఈ విధంగా అతను ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాడు.

రాఫెల్ నాదల్ గ్యారాజ్‌లో కొత్తగా వచ్చి చేరిన Kia EV6 GT ఎలక్ట్రిక్ కార్..

రాఫెల్ నాదల్ కి అందజేసిన కారు కియా ఈవీ6 జిటి (Kia EV6 GT). ఈ ఆటగాడి కోసం ఈ కారును ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు. ఈ కారు తన నగరంలోని రాఫెల్ నాదల్‌కు అప్పగించారు. ఆ తర్వాత అతను కూడా ఈ కారును నడుపుతూ కనిపించాడు. ఈ సందర్భంగా రాఫెల్ నాదల్ మాట్లాడుతూ "నా పనిలో చాలా ప్రయాణం ఉంటుంది మరియు నా జీవనశైలి పూర్తిగా నిలకడగా ఉండదు. కానీ మార్పులకు నేను పూర్తిగా కట్టుబడి ఉంటాను" అని అన్నారు.

రాఫెల్ నాదల్ గ్యారాజ్‌లో కొత్తగా వచ్చి చేరిన Kia EV6 GT ఎలక్ట్రిక్ కార్..

అతను తన నగరంలో మరియు వెలుపల ప్రయాణించడానికి ఈ ఎలక్ట్రిక్ కారును ఉపయోగిస్తానని నాదల్ చెప్పాడు. ఈ కారును అందజేసినందకు గాను ఆయన కియా సంస్థకు కృతజ్ఞతలు తెలిపాడు మరియు కియా మద్దతు లభించినందుకు సంతోషంగా ఉందని అన్నాడు. పర్యావరణ సాన్నిహిత్యమైన ఇలాంటి వాహనాలను నడపడానికి తాను మరింత మందిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నానని అన్నారు.

రాఫెల్ నాదల్ గ్యారాజ్‌లో కొత్తగా వచ్చి చేరిన Kia EV6 GT ఎలక్ట్రిక్ కార్..

రాఫెల్ నాదల్ 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ వంటి టెన్నిస్ టోర్నమెంట్లలో ఈ వాహనాన్ని ఉపయోగించబోతున్నాడని కియా తెలిపింది. అదనంగా, వారు 2022 నాటికి రఫెల్ నాదల్ అకాడమీ మరియు రఫెల్ నాదల్ ఫౌండేషన్‌ లో వినియోగిస్తున్న వాహనాలన్నింటినీ పూర్తిగా బ్యాటరీతో నడిచే వాహనాలుగా మార్చాలని యోచిస్తున్నట్లు తెలిపారు.

రాఫెల్ నాదల్ గ్యారాజ్‌లో కొత్తగా వచ్చి చేరిన Kia EV6 GT ఎలక్ట్రిక్ కార్..

రాఫెల్ నాదల్ కియా బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి, కంపెనీ అతడికి ఈ వాహనాన్ని అందించినట్లు తెలుస్తోంది. కియా మరియు దాని అనుబంధ సంస్థ హ్యుందాయ్ లు కలిసి ప్రపంచ మార్కెట్ల కోసం త్వరలో అనేక ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురాబోతున్నాయి. ఈ నేపథ్యంలో, కియా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆటగాడిని బ్రాండ్ అంబాసిడర్ గా కలిగి ఉండటం కియాకు ఎంతగానో సహాయపడుతుంది.

రాఫెల్ నాదల్ గ్యారాజ్‌లో కొత్తగా వచ్చి చేరిన Kia EV6 GT ఎలక్ట్రిక్ కార్..

Kia EV6 ఎలక్రిక్ కారు విషయానికి వస్తే, కంపెనీ దీనిని డెడికేటెడ్ e-GMP (ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులప్ ప్లాట్‌ఫామ్) ప్లాట్‌ఫామ్‌పై నిర్మించింది. 'ఆపోసిట్స్‌ యునైటెడ్‌' అనే కొత్త డిజైన్‌ ఫిలాసఫీ ఆధారంగా కియా ఈ కారును రూపొందించింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై కంపెనీ భవిష్యత్తులో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను డిజైన్ చేయనుంది.

రాఫెల్ నాదల్ గ్యారాజ్‌లో కొత్తగా వచ్చి చేరిన Kia EV6 GT ఎలక్ట్రిక్ కార్..

హ్యుందాయ్ నుండి కియా ఈ ప్లాట్‌ఫామ్‌ను తీసుకుంది. ఈ ప్లాట్‌ఫామ్ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా తక్కువ బ్యాటరీ సామర్థ్యంలో కూడా ఎక్కువ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. హ్యుందాయ్ ఆవిష్కరించిన అయానిక్ 5 కూడా ఇంచు మించు ఇదే డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కియా ఈవీ6 యొక్క ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ కూడా హ్యుందాయ్ అయానిక్ 5 కి చాలా దగ్గరగా పోలి ఉంటుంది.

రాఫెల్ నాదల్ గ్యారాజ్‌లో కొత్తగా వచ్చి చేరిన Kia EV6 GT ఎలక్ట్రిక్ కార్..

కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారులో 72.6 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ కారు యొక్క నాలుగు చక్రాలలో ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చబడి ఉంటాయి, ఈ కారు ఆల్-వీల్ డ్రైవ్ ఫంక్షన్‌తో వస్తుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 410 కి.మీల రేంజ్ అందిస్తుందని మరియు కేవలం 5.2 సెకన్లలోనే గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకుంటుందని కంపెనీ పేర్కొంది.

రాఫెల్ నాదల్ గ్యారాజ్‌లో కొత్తగా వచ్చి చేరిన Kia EV6 GT ఎలక్ట్రిక్ కార్..

ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఈవీ6 ఎలక్ట్రిక్ కారును కియా యొక్క 'ఆపోజిట్ యునైటెడ్' డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా రూపొందించబడింది. ఈ కారు యొక్క బాహ్య మరియు ఇంటీరియర్ డిజైన్ ఈ డిజైన్ లాంగ్వేజ్ కింద మౌల్డ్ చేయబడి ఉంటుంది. ఈ కారులో కంపెనీ యొక్క కొత్త లోగో, ఫ్రంట్ గ్రిల్ డిజైన్, హెడ్‌లైట్ డిజైన్ మొదలైన వాటిని చూడొచ్చు.

రాఫెల్ నాదల్ గ్యారాజ్‌లో కొత్తగా వచ్చి చేరిన Kia EV6 GT ఎలక్ట్రిక్ కార్..

కియా ఈవీ6 క్రాస్ఓవర్ లాంటి డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీని డిజైన్ కూడా చాలా సింపుల్‌గా మరియు అంతే స్టైలిష్‌గా కనిపిస్తుంది. ముందు వైపు సన్నటి గ్రిల్ మరియు ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్స్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్, బోనెట్‌పై మజిక్యులర్ బాడీ లైన్స్, ఆల్ బ్లాక్ పిల్లర్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన బ్లాక్ కలర్ సైడ్ మిర్రర్స్, కారు, చుట్టూ సన్నటి బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, పాప్ అప్ డోర్ హ్యండిల్స్, హుడ్‌పై కొత్త కియా బ్యాడ్జ్ వంటి డిజైన్ ఫీచర్లను ఇందులో చూడొచ్చు.

రాఫెల్ నాదల్ గ్యారాజ్‌లో కొత్తగా వచ్చి చేరిన Kia EV6 GT ఎలక్ట్రిక్ కార్..

ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో డ్యూయెల్ టోన్ ఇంటీరియర్ థీమ్, రెండు పెద్ద డిజిటల్ డిస్‌ప్లే స్క్రీన్‌లు (ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం మరొకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం), పూర్తి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇంజన్ పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్, ఎలక్ట్రిల్లీ అడ్జస్టబల్ ఫ్రంట్ సీట్స్, గుండ్రటి డయల్‌తో కూడిన గేర్ సెలక్టర్, ప్రీమియం ఆడియో సిస్టమ్ మరియు విశాలమైన లగేజ్ రూమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Rafael nadal adds kia ev6 gt electric car to his garage details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X