మేడే సందర్భంగా రైతులకు లారెన్స్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్.. ఉచితంగా 10 మహీంద్రా ట్రాక్టర్లు అందజేత

ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌(Raghava Lawrence) మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం దివ్యాంగులకు స్కూటర్లు పంపిణీ చేసిన లారెన్స్‌.. ఈ సారి రైతుల పట్ల తన ఉదారతను చాటుకున్నారు. మొన్న(మే 1) మేడే సందర్భంగా కర్షకులకు వారికి ఉపయోగపడేలా అద్భుతమైన బహుమతిని అందజేశారు. పూర్తి సమాచారం ఈ కథనంలో..

రాఘవ లారెన్స్‌కి దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ప్రధానంగా సౌత్‌ ఇండియాలో లారెన్స్‌కు ఉన్న క్రేజ్‌ వేరు. డ్యాన్స్‌ పరంగానే కాకుండా నటనలో కూడా తనలోని ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా కామెడీ ప్రధానంగా సాగే హారర్‌ మూవీస్‌లో లారెన్స్‌ నటనకు క్లాప్స్‌ పడాల్సిందే. అలా తెరపై అలరించే రాఘవ లారెన్స్‌.. నిజ జీవితంలో ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా ఉన్నారు.

Raghava-Lawrence-Gifts-10-Mahindra-Tractors-To-Poor-Farmers

2015లో భారత మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం మరణించిన తర్వాత, నటుడు రాఘవ లారెన్స్.. ఆయన గౌరవార్థం ఒక ఛారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించి దానికి రూ.1 కోటి విరాళం అందించడం అప్పట్లో చాలా మందిని కదిలించింది. అప్పటి నుంచి లారెన్స్‌ సేవా కార్యక్రమాల్లో నిత్యం పాల్గొంటూ అభాగ్యుల పాలిట దైవంలా మారారు.

ఈ క్రమంలో మేడే సందర్భంగా రాఘవ లారెన్స్‌.. దేశానికి అన్నం పెడుతున్న రైతుల కష్టాన్ని గుర్తించి వారికి ఏదైనా చేయాలని భావించారు. ఈ నేపథ్యంలో ఊళ్లలో జీవనం గడవక బతుకుదెరువు కోసం వలస వెళ్లిపోతున్న రైతు కూలీలను గుర్తించి వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. మొన్న(బుధవారం) 10 మహీంద్రా ట్రాక్టర్లను పేద రైతులకు అందజేశారు.

Raghava-Lawrence-Gifts-10-Mahindra-Tractors-To-Poor-Farmers

ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా రాఘవ లారెన్స్(Raghava Lawrence gifts Tractors To Farmers) తన X ఖాతాలో పోస్ట్ చేశారు. 'కార్మిక దినోత్సవం సందర్భంగా మా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా.. దేశానికి వెన్నెముకగా నిలిచే రైతులకు నా సొంత డబ్బుతో 10 ట్రాక్టర్లు అందజేశాం. చాలా మంది నిస్వార్థ యాత్రలో చేరి నిరుపేదలకు సేవ చేస్తున్నారు' అని క్యాప్షన్‌తో పోస్ట్‌ చేశారు.

నటుడు రాఘవ లారెన్స్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్ల నుంచి ప్రశంసల జల్లు కురిసింది. ఈ వీడియోను ఇప్పటివరకూ 80 వేల వరకూ వీక్షించారు. వేలల్లో లైక్‌లను సంపాదించగా.. లారెన్స్‌ సేవా దృక్పథాన్ని అభినందిస్తూ నెటిజన్లు ట్వీట్లు చేశారు.

Raghava-Lawrence-Gifts-10-Mahindra-Tractors-To-Poor-Farmers

గత నెలలో రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు 13 స్కూటర్లను బహుమతిగా ఇచ్చిన సంఘటన చోటుచేసుకుంది. దీనిపై లారెన్స్‌ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. విశేష ప్రతిభ కలిగిన వారి మానసిక ధైర్యం, సంకల్పం, కృషిని చూసి గర్విస్తున్నట్లు సోషళ్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వారికి అభినందనలు తెలియజేశారు.

కాగా రాఘవ లారెన్స్ బహుమతిగా ఇచ్చిన ట్రాక్టర్‌ విషయానికొస్తే.. ఇది మహీంద్రా 575 DI ట్రాక్టర్. దీని ధర రూ.6.80 లక్షల నుంచి రూ.7.10 లక్షల వరకూ ఉంటుంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. ఇది 45 HP - 2730 cc డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 8S+ 2R గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉంది. ఇది డ్రై డిస్క్ బ్రేక్‌తో వస్తుంది.

Raghava-Lawrence-Gifts-10-Mahindra-Tractors-To-Poor-Farmers

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, May 3, 2024, 8:56 [IST]
English summary
Raghava lawrence gifts 10 mahindra tractors to poor farmers on mayday video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+