స్టైలిష్ లుక్‌లో కేటీఎం బైక్‌పై రాహుల్ గాంధీ లాంగ్ రైడ్.. ఎక్కడికి వెళ్లారంటే.??

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. అంతే కాకుండా అనేక విషయాలను పంచుకుంటున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ తన వద్ద కేటీఎం బైక్ ఉన్నట్లు వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే..

ఇటీవల రాహుల్ గాంధీ డ్రైవర్‌తో కలిసి లారీ క్యాబిన్‌లో కూర్చుని అర్ధరాత్రి ప్రయాణించిన సంగతి మీకు తెలిసిందే.. ఇంకా ఓ మెకానిక్ షెడ్డులో మెకానిక్‌లతో మాట్లాడుతూ తన వద్ద కేటీఎం బైక్ ఉన్న సంగతి వెల్లడించారు. కానీ సెక్యూరిటీ దృష్ట్యా తాను ఆ బైక్ నడపడం లేదని వెల్లడించారు. ఇప్పుడు మళ్లీ మనం ఆ బైక్ గురించి మాట్లాడుకునే సందర్భం వచ్చింది.

Rahul-Gandhi-Riding-Bike-In-Ladakh

లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ LAHDC-కార్గిల్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ లడఖ్‌లో పర్యటించారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ పాంగాంగ్ సరస్సు వద్దకు బైక్‌పై వెళ్లారు. రాహుల్ గాంధీ తన బైక్ రైడ్ లడఖ్‌కు సంబంధించిన 10 ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

'పాంగాంగ్ సరస్సుకి వెళ్లే దారి ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ప్రదేశాలలో ఒకటి అని నాన్నగారు చెప్పేవారు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా' అంటూ రాహుల్ గాంధీ లడఖ్ బైక్ రైడ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హీరోలా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్ చేశారు.

Rahul-Gandhi-Riding-Bike-In-Ladakh

రాహుల్ గాంధీ పాంగాంగ్ సరస్సు సమీపంలోని పర్యాటక శిబిరంలో శనివారం రాత్రి బస చేశారు. నేడు (ఆగస్టు 20న) మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. రాహుల్ గాంధీ తన తండ్రి జయంతిని పాంగాంగ్ వద్ద జరుపుకొనే అవకాశం ఉంది. శుక్రవారం లడఖ్‌లో తన మొదటి పర్యటన సందర్భంగా లేహ్‌లో 500 మందికి పైగా యువకులతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించారు.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ లడఖ్ పర్యటనను ఆగస్టు 25 వరకు పొడిగించారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 మరియు 35(A) రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌ను లడఖ్ మరియు J&K రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత రాహుల్ లడఖ్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.

Rahul-Gandhi-Riding-Bike-In-Ladakh

రాహుల్ గాంధీ కార్గిల్ మెమోరియల్‌ను సందర్శించి యువతతో మమేకమవుతారు. ఆగస్టు 25న జరిగే 30 మంది సభ్యుల లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్‌హెచ్‌డిసి)-కార్గిల్ ఎన్నికల సమావేశానికి రాహుల్ గాంధీ కూడా హాజరు కానున్నారు. కార్గిల్ హిల్ కౌన్సిల్ ఎన్నికలు సెప్టెంబర్ 10న జరగనున్నాయి.

ఇక రాహుల్ గాంధీ పాంగాంగ్ సరస్సు వద్దకు వెళ్లిన బైక్ గురించి చెప్పాలంటే, అది KTM 390 అడ్వెంచర్ (KTM 390 ADV) బైక్. ఈ బైక్ 373.2 సిసి, లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 43.5 బీహెచ్‌పీ పవర్ మరియు 37 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ సీక్వెన్షియల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది.

Rahul-Gandhi-Riding-Bike-In-Ladakh

ఇందులో బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్‌తో పాటు స్లిప్పర్/అసిస్ట్ క్లచ్ కూడా అందించారు. ఆస్ట్రియన్ వాహన తయారీ సంస్థ TM 390 అడ్వెంచర్ బైక్‌లో రెండు మోడ్‌ల ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను అందించింది. ఇది స్ట్రీట్ మరియు ఆఫ్ రోడ్ బైక్. ఇది ఆఫ్ రోడ్ హ్యాండ్లిగ్‌ను సులభతరం చేస్తుంది.

Rahul-Gandhi-Riding-Bike-In-Ladakh

కేటీఎం 390 లో ఇంజిన్ షట్‌డౌన్ అయినప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ డిఫాల్ట్ సెట్టింగ్‌కి తిరిగి వెళ్లదు. ఎందుకంటే ఇంజిన్ ఆఫ్ చేయబడినప్పుడు చాలా సిస్టమ్‌లు సాధారణంగా డీఫాల్ట్ సెట్టింగ్‌లకు తిరిగి వస్తాయి. ఇది చాలా సందర్భాల్లో ఇబ్బందిని కలిగిస్తుంది. KTM 390 అడ్వెంచర్ భారతీయ మార్కెట్లో BMW G310 GSతో పోటీ పడుతోంది.

Rahul-Gandhi-Riding-Bike-In-Ladakh

ఈ KTM 390 అడ్వెంచర్ బైక్ సస్పెన్షన్‌లో ముందు వైపున 43 mm USD ఫోర్కులు, వెనుక వైపున WP మోనోషాక్ ఉన్నాయి. 2022 KTM 390 అడ్వెంచర్ బైక్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి చెప్పాలంటే, ఇది ముందు వైపు 320 mm మరియు వెనుక వైపు 230 mm బ్రేక్‌లను కలిగి ఉంది. ఇది అదనపు భద్రత కోసం డ్యూయల్-ఛానల్ ABS ను కూడా కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Sunday, August 20, 2023, 8:01 [IST]
English summary
Rahul gandhi rides on his ktm bike to pangong lake in ladakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+