‘నా దగ్గర కూడా KTM 390 బైక్‌ ఉంది.. కానీ దాన్ని నడపలేను’- రాహుల్‌ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

సినిమా హీరోహీరోయిన్లు, రాజకీయ నాయకులు, స్పోర్ట్స్‌ సెలబ్రిటీలు తమ గ్యారేజీలో ఖరీదైన లగ్జరీ కార్ల సేకరణను కలిగి ఉండటం కొత్తేమీ కాదు. కానీ రాజకీయ నాయకులు ద్విచక్ర వాహనం కలిగి ఉండటం చాలా అరుదు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి కేటీఎం 390 బైక్ ఉంది. ఆశ్చర్యపోతున్నారా.. పూర్తి వివరాల్లోకి వెళితే..

సెలబ్రిటీల గ్యారేజీలోని కార్లు, బైకుల విశేషాలు తరచూ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తూనే ఉంటాయి. కానీ ఒక రాజకీయ నాయకుడు బైక్ కలిగి ఉండటం అనేది చాలా కొత్త విషయం. ఎందుకంటే వారు ఎప్పుడూ సెక్యూరిటీ కారణాల దృష్ట్యా కార్లలోనే ప్రయాణిస్తారు. కానీ ఇక్కడ తనకు బైక్‌ ఉందని రాహుల్‌ గాంధీ స్వయంగా వెల్లడించారు. అయితే దానిని ఉపయోగించడం లేదని ఆయన తెలిపారు.

Rahul-Gandhi-Owns-KTM-Bike

ఇటీవల రాహుల్ గాంధీ ఢిల్లీలోని కరోల్ బాగ్ మార్కెట్‌లో మెకానిక్‌లతో సంభాషించారు. ఆ వీడియోను తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేశారు. 12 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో రాహుల్‌ గాంధీ అక్కడ మెకానిక్‌ల కష్టాలను వింటూ బైక్‌ను రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ వీడియోలో రాహుల్ గాంధీ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన దగ్గర 'KTM 390' బైక్ ఉందని ఆయన తెలిపారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా తన సెక్యూరిటీ సిబ్బంది దీన్ని నడపనివ్వడం లేదని ఆయన అన్నారు. కాగా ఒక మెకానిక్ సంభాషణలో రాహుల్ గాంధీని పెళ్లి గురించి అడగగా.. దానికి ఆయన 'ఒక రోజు' అని సమాధానం ఇచ్చారు.

KTM-390-Bike

రాహుల్ గాంధీ మెకానిక్‌లతో సమావేశమైన వీడియో గురించి ట్వీట్ చేస్తూ, దేశ పురోగతికి సూపర్ మెకానిక్‌ల కృషి కారణమని అన్నారు. భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమను బలోపేతం చేయడానికి, ఈ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన హిందీలో రాశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అదే విధంగా, వీడియోలో ఉన్న కేటీఎం 390 బైక్ ఏంటనే సమాచారాన్ని రాహుల్ గాంధీ వెల్లడించలేదు. KTM 390 అనేది అడ్వెంచర్ మోటార్‌సైకిల్. 390 సిరీస్ అడ్వెంచర్ X, 390 డ్యూక్ మరియు RC 390 బైక్‌లు భారతదేశంలోని మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. 390 డ్యూక్‌ బైక్‌ వీటిలో సరసమైనది. మార్కెట్‌లో రూ. 2.97 లక్షల ధరతో లభిస్తుంది.

KTM-390-Bike

KTM 390 డ్యూక్ 373.27 cc ఫ్యూయల్ ఇంజెక్టెడ్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో 43.5 PS గరిష్ఠ శక్తిని అందిస్తుంది. 7000 rpm వద్ద 37 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వినియోగదారులకు ఈ బైక్‌ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కూడా అందుబాటులో ఉంది. అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. గంటకు 29 kmpl మైలేజీని అందిస్తుంది.

భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీకి సామాన్య ప్రజలతో పరిచయం, అనుబంధం పెరిగింది. శనివారం రోజు హర్యానాలోని సోనిపట్ జిల్లాలోని ఒక గ్రామం గుండా వెళుతున్నప్పుడు, ఆయన పొలాల్లో రైతులను కలుసుకుని, వారితో మాట్లాడారు. వరి నాట్లు వేస్తూ ట్రాక్టర్ నడుపుతూ కొన్ని గంటల పాటు వారితో గడిపారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 11, 2023, 11:45 [IST]
English summary
Rahul gandhi says he owns a ktm 390 bike but he can not ride here is details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+