భారత ప్రీమియర్ రైళ్లలో డిస్పోజబల్ లైనెన్, ఆటోమేటిక్ డోర్స్!
కేంద్రంలో కొత్తగా ఏర్పడిన బిజెపి సర్కారు రేపు (జులై 8, 2014)వ తేదీన ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. రాజధాని రైళ్లలో డిస్పోజబల్ లైనెన్ (వాడి పారేసే దుప్పట్లు), శతాబ్ధి రైళ్లలో ఆటోమేటిక్‌గా మూసుకుపోయే డోర్లు మరియు ప్యాసింజర్ రైళ్లలో అగ్ని మాపక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
కాగా.. రైల్వే బడ్జెట్ 2014-15లో ఈ ప్రతిపాదనలు అధికారికంగా ప్రకటించ వచ్చని అంచనా. తయారీ రంగం (మ్యానుఫాక్చరింగ్ సెక్టార్) నుంచి వస్తున్న డిమాండ్ మేరకు మరింత స్టీల్ కాయిల్స్‌ను రవాణా చేసేందుకు అధిక సామర్థ్యం కలిగిన వ్యాగన్లు అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనను కూడా ఇందులో జోడించనున్నారు.

ఈ ప్రతిపాదన ప్రకారం, ప్రభుత్వ రంగ రవాణా సంస్థ దాదాపు 3944 టన్నుల స్టీల్ కాయిల్స్‌ను రవాణా చేయగలిగే సామర్థ్యం కలిగిన వ్యాగన్లను తయారు చేయనుంది. ప్రస్తుత వ్యాగన్ల సామర్థ్యం కేవలం 2346 టన్నులు మాత్రమే. పార్శిల్ విభాగం నుంచి రైల్వేకు ఎక్కువ ఆదాయం వస్తున్న నేపథ్యంలో, అధిక సామర్థ్యం కలిగిన పార్శిల్ వ్యాన్లను అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనను కూడా ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టనున్నారు.
రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సదానంద గౌడ రైల్వే బడ్జెట్‌లో ప్రధానంగా, ఉత్తమ ప్రయాణీకుల సౌకర్యాలు మరియు రైళ్లలో సేఫ్టీ, సెక్యూరిటీలకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రైళ్లలో పరిశుభ్ర వాతావరణం, మంచి సౌకర్యాలను అందించాలనే ఉద్దేశ్యంతో తొలుతగా బెంగుళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో డిస్పోజబల్ బెడ్‌రోల్స్‌ను అందజేయాలనే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని రైల్వే నిర్ణయించింది.

ఈ రైలులో అందిస్తున్న లైనెన్ నాణ్యతకు సంబంధించి ప్రయాణీకుల నుంచి ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. మరోవైపు శతాబ్ధి రైలు కోచ్‌లలో డోర్లు ఆటోమేటిక్‌గా క్లోజ్ అయ్యే సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ ఆటోమేటిక్ డోర్ సిస్టమ్‌ను సబర్బన్ సర్వీసులైన ఈఎమ్‌యూ రైళ్లలో కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది.
అలాగే, డైరీ ఉత్పత్తులు మరియు పాల రవాణా కోసం కూడా అధి సామర్థ్యం కలిగిన మిల్క్ వాన్లను అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనను ఈ బడ్జెట్‌లో జోడించారు. ప్రస్తుత పాల రవాణా సామర్థ్యం 40,000 లీటర్లుగా ఉంటే, దానిని 44,600 లీటర్లకు పెంచాలని యోచిస్తున్నారు. మరి ప్రతిపాదలన్నీ కేవలం పేపరుకు మాత్రమే పరిమితం అవుతాయో లేక కార్యరూపం దాల్చుతాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








