హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ట్యాంక్ బండ్ దగ్గర్లోని ఆ రైల్వే స్టేషన్లో 'రైల్ కోచ్ రెస్టారెంట్..'
భోజన ప్రియులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించే దిశగా దక్షిణ మధ్య రైల్వే మరో అడుగు ముందుకువేసింది. జంట నగరాల్లోని మరో ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లో ఫుడ్ లవర్స్ కోసం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇంతకీ ఏంటది.. దాని ద్వారా భోజన ప్రియులకు ఏం సంబంధమో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.
సోమవారం(సెప్టెంబర్ 13) సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని నెక్లెస్ రోడ్డు రైల్వేస్టేషన్ ఆవరణలో 'రైల్ కోచ్ రెస్టారెంట్'ను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ ద్వారా ఫుడ్ లవర్స్ కు ప్రత్యేకమైన భోజన వాతావరణం కల్పిస్తూ వారికి వినూత్న అనుభూతిని అందిస్తోంది.

రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించే కార్యక్రమాల్లో భాగంగానే దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన మరో సరికొత్త ప్రయత్నం రైల్ కోచ్ రెస్టారెంట్ అని రైల్వే అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని రైల్వే ప్రయాణికులతో పాటు సాధారణ ప్రజలు కూడా వినియోగించుకోవచ్చు. రొటీన్ రెస్టారెంట్‌లా కాకుండా ఇలా వినూత్నంగా ప్రారంభించింది.
గతంలో కాచిగూడ రైల్వే స్టేషన్‌లో 'రెస్టారెంట్ ఆన్ వీల్స్' పేరుతో రెస్టారెంట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, తెలంగాణలోని రైల్వే స్టేషన్‌లో రెండవ రైల్వే కోచ్ రెస్టారెంట్‌గా రైల్ కోచ్ రెస్టారెంట్ గుర్తింపు పొందింది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్ నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ ఆవరణలో ఆహార ప్రియులకు ప్రత్యేకమైన భోజన వాతావరణం, అనుభూతిని అందించడానికి ఈ రైల్ కోచ్ రెస్టారెట్‌ను ప్రారంభించింది.

నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ జంట నగరాల సబర్బన్ నెట్‌వర్క్‌లో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్‌లలో ఒకటి. ఇది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ప్రదేశంలా ఉండటంతో ఇక్కడికి ప్రతిరోజు అధిక సంఖ్యలో పర్యాటకులు, నగరవాసులు వస్తుంటారు. జంట నగరాల్లోని భోజన ప్రియులకు సరికొత్త అనుభవాన్ని అందించే దిశగా ఈ కోచ్ రెస్టారెంట్ కాన్సెప్ట్‌కు నెక్లెస్ రోడ్డును ఎంచుకున్నారు.
నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్‌ను కోచ్ రెస్టారెంట్ అనే భావన పర్యాటకులకు కలిగేలా రైల్వే శాఖ దీనిని ఇలా రూపొందించిందని అధికారులు తెలిపారు. ఇందు కోసం ఉపయోగంలో లేని ఒక రైలు కోచ్‌ను పూర్తిగా ఆధునికంగా, లోపల సుందరంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్‌కు చెందిన బూమరాంగ్ రెస్టారెంట్‌కు ఐదేళ్ల కాలానికి నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్‌లోని రైల్ కోచ్ రెస్టారెంట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.

ఈ రైల్ కోచ్ రెస్టారెంట్లో కస్టమర్లు వివిధ రకాల వంటకాలను ఆస్వాదించవచ్చు అంతే కాకుండా డైనింగ్ ఇన్ లేదా పార్సిల్ ఇంటికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటైన ఈ రెస్టారెంట్ భోజన ప్రియులకు మరపురాని భోజన అనుభవాన్ని అందిస్తుందని అధికారులు అంటున్నారు.
ఈ రెస్టారెంట్ ఏర్పాటుతో జంట నగరాల్లోని ఆహార ప్రియులకు మరో విలక్షణమైన ఫుడ్ సర్వీస్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని SCR జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. రైల్వే ప్రయాణికులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








