రైళ్లు ఎదురెదురుగా వచ్చినా ఢీకొట్టకుండా నియంత్రించే 'కవచ్' పనితీరుపై కీలక ట్రయల్స్.. అసలు ఏంటీ టెక్నాలజీ?
భారతీయ రైల్వేలో భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇందులో భాగంగా రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్డాండర్డ్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన యాంటీ ట్రైన్ కొలిజన్ సిస్టమ్ "కవచ్" (Kavach) పనితీరును రైల్వే అధికారులు పరిశీలించారు. 160 కి.మీ వేగంతో వెళ్తున్న సెమీ హైస్పీడ్ ఇంజిన్‌లో కవచ్ బ్రేకింగ్ పనితీరును పరిశీలించేందుకు (Kavach Braking Efficiency Trials) ట్రయల్స్ నిర్వహించినట్లు నార్త్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.
నార్త్ సెంట్రల్ రైల్వే డిప్యూటీ చీఫ్ సిగ్నల్, టెలికమ్యూనికేషన్ ఇంజినీర్ కుష్ గుప్తా ఆధ్వర్యంలో జనవరి 19న పాల్వాల్- మథుర సెక్షన్‌లో 160కి.మీ వేగంతో వెళ్తున్న సెమీ హైస్పీడ్ ఇంజిన్ WAP-5కు కవచ్ అమర్చి ట్రయల్స్ నిర్వహించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రెడ్ సిగ్నల్‌ను గమనించి కవాచ్ ఆటోమేటిక్‌గా స్పందించిందని, సిగ్నల్‌కు 30 మీటర్ల ముందు ఇంజిన్ నిలిచిపోయేలా ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ బ్రేకులు వేసినట్లు అధికారులు తెలిపారు.

ఆగ్రా డివిజన్‌లో సుమారు 80 కి.మీ మేర కవచ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసింది. అంటే రైల్వే ట్రాక్‌లపై RFID ట్యాగ్‌లను ఉంచడం, కవాచ్ యూనిట్‌లను ఇన్‌స్టాల్ చేయడం, ట్రాక్‌ల వెంట టవర్లు, యాంటెన్నాలను ఏర్పాటు చేస్తారు. రైల్వేల ప్రకారం దక్షిణ మధ్య రైల్వేలో 130 లోకోమోటివ్‌లలో అమర్చారు.
రైల్వేలో భద్రతను మరింతను మెరుగుపరచడంలో భాగంగా భారతీయ రైల్వే ఆటోమేటిక్ ట్రైయిన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ATP) 'కవచ్' పై ప్రకటన చేసింది. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్డాండర్డ్ ఆర్గనైజేషన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతికూల పరిస్థితులు, దట్టమైన మంచు కురుస్తున్న సమయాల్లో రైల్వే లోకోపైలెట్‌కు సాయం చేసేందుకు కవచ్‌ను రూపొందించారు.

కవచ్ ఎలా పనిచేస్తుంది : రైల్వోలో ప్రమాదాలను నియంత్రించేందుకు ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. కవచ్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. అయితే ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే.. ఏదైనా సాంకేతిక లోపంతో ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా లేదా వెనుక నుంచి వచ్చి ఢీకొనకుండా కవచ్ వ్యవస్థ పనిచేస్తుంది. రైళ్లు నిలిచిపోయేలా ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ బ్రేకులు వేస్తుంది.
రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా లోకోపైలెట్ రైలును నడిపిస్తున్నప్పుడు కవచ్ వ్యవస్థ అప్రమత్తం అవుతుంది. ఆటోమెటిక్‌గా బ్రేకులు విధిస్తుంది. దీంతోపాటు పట్టాలు సరిగా లేనప్పుడు, ఇతర టెక్నికల్ సమస్యలు వచ్చినప్పుడు కవచ్ వ్యవస్థ లోకోపైలెట్‌ను అప్రమత్తం చేస్తుంది. మరియు బ్రిడ్జ్, మలుపులు వద్ద రైలు పరిమితికి మించిన వేగంతో వెళ్తుంటే.. కవచ్ వ్యవస్థ రైలు వేగాన్ని 30km/h ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది.

కవచ్ వ్యవస్థతో రైలు ఇంజిన్‌లోని స్క్రీన్‌పై కనిపిస్తుంది. రైలు స్పీడ్ సహా ఇతర సమాచారం అందులో కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో పరిమితికి మించి రైలు ప్రయాణం చేస్తుంటే.. కవచ్ వ్యవస్థ వేగాన్ని తగ్గిస్తుంది. అధిక వేగం, పొగమంచు కురుస్తున్న సమయాల్లో స్పష్టమైన విజిబిలిటీ కోసం క్యాబిన్‌లో లైన్ సైడ్ సిగ్నల్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది.
మరియు లెవల్ క్రాసింగ్ వద్ద ఆటోమేటిక్ విజిల్ వేయడం, లోకో టూ లోకో కమ్యూనికేషన్ ద్వారా ప్రమాదాలను నివారిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో SOS ఫీచర్ ద్వారా రైళ్లను నియంత్రిస్తుంది. దక్షిణ మధ్య రైల్వేలోని లింగంపల్లి- వికారాబాద్- వాడి, వికారాబాద్- బీదర్ మార్గాల్లో సుమారు 250 కిలోమీటర్ల మేర గతంలో కవచ్ ట్రయల్ నిర్వహించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








