ట్రాక్‌పై రైలు ఆగిపోతే ఏం చేశారో తెలుసా.??.. ఇలాంటి వీడియో ఎప్పుడూ చూసి ఉండరు.!!

ఆగిపోయిన ఇంజిన్ రైలు కోచ్‌ను రైల్వే కార్మికులు తమ చేతులతో నెడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. టెక్నాలజీ పెరుగుతున్న ఈ కాలంలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం నెటిజన్ల(Railway Men Push The Train Coach)ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో సాంకేతిక లోపం కారణంగా రైలు ఇంజిన్ కంపార్ట్‌మెంట్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ సంఘటన మార్చి 21, గురువారం చోటుచేసుకుంది. ఇతర రైళ్లు వెళ్లే ముఖ్యమైన లైన్‌లో రైలు ఆగడంతో రైలు కంపార్ట్‌మెంట్‌లోని అధికారులు, రైల్వే సిబ్బంది ఆందోళనకు దిగారు. దీంతో ఎంత ప్రయత్నించినా రైలు ఇంజిన్ కంపార్ట్‌మెంట్ అక్కడి నుంచి కదలకపోవడంతో ఏం చేయాలో వారికి పాలుపోలేదు.

Technical-Issue-Railway-Men-Push-The-Train-Coach

దీంతో ఆ కంపార్ట్‌మెంట్‌ను తమ చేతులతో తోసి ట్రాక్‌లోని మరో లైన్‌లోకి తీసుకెళ్లి ఆపాలని నిర్ణయించుకున్నారు. కానీ అది సులభమైన విషయం కాదు. బస్సు, కారు, బైక్‌ ఇలా తక్కువ బరువున్న వాహనాన్ని నెట్టడానికే 4,5 గురు కలిసి నెట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడ టన్నుల బరువుండే ఇంజిన్‌ కంపార్ట్‌మెంట్‌ను ముందుకు తోయడం చాలా కష్టమైన పని.

ఇందుకోసం ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌లోని అధికారులు అదనపు సిబ్బందిని పిలిపించారు. పోలీసులు వచ్చిన తర్వాత, లోకోమోటివ్ బాక్స్‌ను నెమ్మదిగా దూరంగా తరలించారు. ఈ ఘటన నిహల్‌గఢ్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే గేట్‌పై నుంచి ఇంజిన్‌ బాక్స్‌ను నెట్టివేయగా.. అక్కడ ఉన్న వాహనదారులు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Technical-Issue-Railway-Men-Push-The-Train-Coach

రైలు లోకోమోటివ్ బాక్స్‌ను తోస్తుండగా.. రైల్వే గేటును కాసేపు మూసేశారు. దీంతో రైల్వే గేటుకు ఇరువైపులా పలువురు వాహనదారులు బారులు తీరిన దృశ్యాలు వీడియోలో చూడవచ్చు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్ నుంచి లక్నోకు లోకోమోటివ్ కోచ్‌ను రవాణా చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగినట్లుగా సమాచారం.

ఈ విషయంపై రైల్వే సెక్యూరిటీ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఆర్‌ఎస్ శర్మ స్పందించారు. రైల్వే అధికారులు తనిఖీకి ఉపయోగిస్తున్న టీపీసీ రైలు గత గురువారం నిహల్‌గఢ్ రైల్వే స్టేషన్ వెలుపల చెడిపోవడంతో రైల్వే సిబ్బంది దానిని స్టేషన్‌కు తోసి ఆపివేసినట్లు చెప్పారు. సమస్యను పరిష్కరించామని.. రైలు దాని మార్గంలోనే వెళ్లిపోయిందని వివరించారు.

కాగా గత ఫిబ్రవరిలో ముంబైలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. నవీ ముంబైలోని వాషి రైల్వే స్టేషన్‌లో పట్టాలు మరియు రైలు మధ్య ఇరుక్కుపోయిన ప్రయాణికుడిని రక్షించడానికి రైల్వే కార్మికులు తమ చేతులతో లోకల్ ఎలక్ట్రిక్ రైలును నెట్టిన సంఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన సమయంలో లోకల్ రైలుకు ఎలాంటి మరమ్మతులు చేయలేదు.. ఎందుకంటే ప్రయాణికుడి భద్రత కోసం వారు అలా చేశారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, March 24, 2024, 15:45 [IST]
English summary
Railway men push the train coach due to technical issue in uttar pradesh viral video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+