రైలులో కుక్కలు, పిల్లులు కూడా తీసుకెళ్లవచ్చు.. ! టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే?
దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నప్పుడు తమతో పెంపుడు జంతువులను తీసుకెళ్లాలని రైల్వే ప్రయాణికులు ప్లాన్ చేస్తుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న నిబంధనలతో అది చాలా ఖర్చుతో కూడుకున్నది మరియు ఎంతో శ్రమపడాల్సి వస్తోంది. అందువల్ల తమతో తీసుకెళ్లలేక, ఇంట్లో విడిచిపెట్టలేక చాలా మంది అవస్థలు పడుతుంటారు. ఇలాంటి వారికి తాజాగా రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.
రైళ్లలో పెంపుడు కుక్కలు, పిల్లులు సహా ఇతర జంతువులను తీసుకెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకొనే ప్రతిపాదనను రైల్వే తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనతో రైల్వే ప్రయాణికులు తమ పెంపుడు జంతువులను కూడా తమతో తీసుకెళ్లవచ్చు. రైల్వే మంత్రిత్వ శాఖ సైతం TTEలకు పెంపుడు జంతువులకు టిక్కెట్లు ఇచ్చే అధికారాన్ని పరిశీలిస్తోంది.

ఇప్పటి వరకు పెంపుడు జంతువులు కలిగిన ప్రయాణికులు ఫస్ట్ క్లాస్ AC టిక్కెట్లు బుక్ చేయాల్సి ఉండేది. ప్రయాణం రోజున ప్లాట్‌ఫాం మీదున్న పార్సల్ కౌంటర్‌కు వెళ్లి బుక్ చేసుకోవాల్సి ఉండేది. అప్పుడు సెకెండ్ క్లాస్ లగేజీ లేదా బ్రేక్ వ్యాన్‌లో తీసుకెళ్లందుకు అనుమతించేవారు. దీని వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న రైల్వే మంత్రిత్వ శాఖ పెంపుడు జంతువుల కోసం ఆన్‌లైన్ టికెట్లు బుక్ చేసుకొనే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఇందుకోసం IRCTC సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తోంది.
ఏనుగులు నుంచి గుర్రాల వరకు మరియు కుక్కల నుంచి పక్షుల వరకు నిబంధనలను వెల్లడించింది. అయితే కుక్కలు, పిల్లులను వారి యాజమానులతో సహా తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. మీరు రైల్వేలో పెంపుడు జంతువులతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారా అయితే ఈ నియమాలను తప్పక పాటించాల్సి ఉంటుంది.

మీరు పెంపుడు కుక్కల కోసం రైలు టికెట్ బుక్ చేసినట్లయితే, ఆ టికెట్‌ను ఫోటోకాఫీ చేయాల్సి ఉంటుంది. మరియు పెంపుడు జంతువుకు అవసరమైన అన్ని వ్యాక్సిన్లు వేయించాలి. 24 నుంచి 48 గంటల మధ్య తీసుకున్న ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మరియు సంబంధిత గుర్తింపు కార్డులు, సర్టిఫికేట్లు దగ్గర ఉంచుకోవాలి. నీరు, ఆహారం, ఇతర అవసరమైన వస్తువులను తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఇంతకు ముందు, రైళ్లలో పెంపుడు జంతువులను తీసుకువెళ్లాలంటే ఫస్ట్ క్లాస్ ACలో రెండు లేదా నాలుగు బెర్త్‌లు ఉన్న కూపేలను బుక్ చేసుకోవాల్సి ఉండేది. మరియు అందుకు భారీగా ఛార్జీలు వసూలు చేసేవారు. ఒకవేళ పెంపుడు కుక్కలను పెట్టెల్లో తీసుకువెళితే, ఒక కుక్కకు 30 KGల చొప్పున రైల్వే లగేజీ ఛార్జీలకు అనుగుణంగా వసూలు చేసేవారు.
అయితే ఫస్ట్ ACలో మినహా AC 2 టైర్, AC 3 టైర్, AC ఛైర్ కార్, స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్‌లో పెంపుడు జంతువుల ప్రయాణానికి అనుమతి ఇచ్చేవారు కాదు. ఒకవేళ ఎవరైనా ప్రయాణికులు తమ పెంపుడు జంతువులకు టికెట్ బుక్ చేయకుంటే భారీగా జరిమానా విధించేవారు. టికెట్ ఛార్జీకి 6 రెట్లు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అధికారం TTEకి ఉంది.
ప్రస్తుతం రైల్వే తీసుకొచ్చిన ప్రతిపాదన అమల్లోకి వస్తే.. పెంపుడు జంతువులున్న చాలా మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా రైలులో తమతో తీసుకెళ్లవచ్చు. అయితే ప్రస్తుతం ఇది ప్రతిపాదన స్థాయిలోనే ఉంది. పూర్తిగా ఎప్పటిలోగా అమల్లోకి వస్తోందో త్వరలో తెలిసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








