Train Tickets ఇక చిల్లర కష్టాలకు చెక్‌ పెట్టేయండి.. జనరల్‌ టికెట్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్ద ఆన్‌లైన్‌ పేమెంట్స్‌

రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్‌న్యూస్‌ తీసుకువచ్చింది. జనరల్‌ బోగీ(Unreserved Train Tickets)ల్లో ప్రయాణించేవారు ఇకపై టికెట్‌ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. రిజర్వ్‌డ్‌ కోచ్‌ల మాదిరిగానే ఎంచక్కా ఆన్‌లైన్‌లోనే టికెట్ల కొనుగోలుకు నగదు బదిలీ చేయవచ్చు. యూపీఐ విధానం ద్వారా రైల్వే శాఖ ఈ ఆప్షన్‌ను తీసుకువచ్చింది. పూర్తి సమాచారం ఈ కథనంలో..

దేశంలో 2016లో డీమోనిటైజేషన్ తర్వాత డిజిటల్ మనీ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన ఏర్పడింది. అందుకే ఎక్కువగా డిజిటల్‌ లావాదేవీలపై మొగ్గు చూపుతున్నారు. UPI సదుపాయం ద్వారా సెల్‌ఫోన్‌ ద్వారానే చిన్న మొత్తంలో నగదు నుంచి పెద్ద మొత్తంలో కూడా ట్రాన్సక్షన్స్‌ చేసుకోవచ్చు. దీని ద్వారా కరెన్సీపై ఆధారపడే అవసరం చాలా వరకు తగ్గిపోయింది.

Unreserved-Train-Tickets-Payment-Via-Online

ఈ క్రమంలో అన్ని సంస్థల్లో డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్నప్పటికీ.. కొన్ని చోట్ల మాత్రం వీటిని వినియోగించే పరిస్థితి లేదు. ముఖ్యంగా బస్సులు, రైళ్లలో ఆన్‌లైన్‌ టికెట్లు మినహా.. జనరల్‌గా ప్రయాణించేవారు డిజిటల్ లావాదేవీలు చేయలేరు. నగదు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో రైళ్లలో జనరల్‌ బోగీల్లో ప్రయాణించేవారికి కూడా ఆన్‌లైన్ లావాదేవీల సదుపాయాన్ని తీసుకువచ్చింది రైల్వే శాఖ.

ఏప్రిల్‌ 1 నుంచి భారత్‌లోని అన్ని రైల్వే స్టేషన్ల(Unreserved Coaches UPI Transfers)లో UPI ద్వారా బహుళ లావాదేవీల సౌకర్యాన్ని రైల్వే శాఖ పరిచయం చేయనుంది. దీంతో ఇకపై అన్‌రిజర్వ్‌డ్‌ కోచ్‌లలో ప్రయాణించే వారు టిక్కెట్‌ కోసం నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. యూపీఐ విధానం ద్వారా నగదును డిజిటల్‌గా ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు.

Unreserved-Train-Tickets-Payment-Via-Online

నిత్యం రైళ్లలో జనరల్‌ బోగీల్లో ప్రయాణించే వారు చాలా కాలంగా ఇలాంటి డిజిటల్ లావాదేవీలను కోరుతున్నారని రైల్వే శాఖ దృష్టికి వచ్చింది. ప్రస్తుతం అన్ని రంగాల్లో డిజిటల్ మనీ లావాదేవీలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. అందులో భాగంగానే డిజిటల్ మనీ లావాదేవీల ద్వారా అన్‌రిజర్వ్‌డ్ రైలు టిక్కెట్లను కూడా కొనుగోలు చేయవచ్చని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

భారతీయ రైల్వే.. ఏప్రిల్ 1 నుంచి ఈ క్యూఆర్ లైన్ సిస్టమ్‌ను తీసుకురానుంది. రైల్వే స్టేషన్లలోని అన్‌రిజర్వ్‌డ్ టికెట్ కౌంటర్లలో ఆన్‌లైన్ టిక్కెట్ సౌకర్యాన్ని రైల్వే శాఖ ప్రవేశపెట్టనుంది. కౌంటర్లో టిక్కెట్లు పొందిన ప్రయాణికులు డిజిటల్ లావాదేవీలు చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో రైలు ప్రయాణంలో నేరుగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

కాగా రైళ్లలో అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌ల కోసం టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి భారతీయ రైల్వే ఇప్పటికే UTS అనే యాప్‌ను ప్రవేశపెట్టింది. UTS యాప్ ద్వారా, ఆన్‌లైన్‌లోనే టికెట్‌ కొనుగోలు చేసి నగదు ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు. అయితే ఈ విధానంపై ప్రజల్లో అంతగా అవగాహన లేదు. ఇప్పటికీ లైన్‌లో నిలబడి టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అన్‌రిజర్వ్‌డ్‌ ట్రైన్‌ టికెట్ల చెల్లింపు కోసం రైల్వే శాఖ ఈ కొత్త నిర్ణయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వందలాది రైళ్లు సేవలందిస్తున్నాయి. లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. ముఖ్యంగా అన్‌రిజర్వ్‌డ్‌ కోచ్‌లలో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రధాన రైల్వే స్టేషన్లలో నిత్యం పెద్ద ఎత్తున క్యూ ఏర్పడుతోంది. ఇంకా చిల్లర సమస్య కూడా ఏర్పడుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, March 25, 2024, 14:17 [IST]
English summary
Railway passengers can do payments through upi system at general tickets counter
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+