Rail Coach Restaurants రెస్టారెంట్లుగా పాత రైలు కోచ్‌లు.. వీటి ప్రత్యేకత ఏంటి?

భారతీయ రైల్వేకు చెందిన అనేక పాత కోచ్‌లు కొన్నిచోట్ల నిరూపయోగంగా ఉన్నాయి. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాత కోచ్‌లతో రైల్‌ కోచ్‌ రెస్టారెంట్‌లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటికి బ్యూటిపుల్‌ రెస్టారెంట్స్‌ ఆన్‌ వీల్స్‌ (Beautiful Restaurant on wheels) అనే పేరు పెట్టారు. జమ్మూ, కత్రా రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న రెండు కోచ్‌లను సిద్ధం చేయనున్నారు.

జమ్మూ, కత్రాలో రైల్వే స్టేషన్‌ పరిధిలో రెండు రైల్‌ కోచ్‌ రెస్టారెంట్లను (Rail coach restaurants) ఏర్పాటు చేస్తామని.. జమ్మూ డివిజనల్‌ ట్రాన్స్‌పోర్టు మేనేజర్‌ ప్రతీక్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, రెండు సంస్థలకు వీటిని అప్పగించినట్లు చెప్పారు.

rail coach restaurants

ఈ రెండు రైల్‌ కోచ్‌ రెస్టారెంట్లు 1600 చదరపు అడుగుల విస్తీర్ణలో ఏర్పాటుచేస్తామని, దీని ద్వారా రూ.50 లక్షల వరకు వార్షిక ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా కోచ్‌లను ప్రైవేట్‌ సంస్థలకు అందజేస్తామని, వారి సొంత డిజైన్‌ ఆధారంగా అత్యాధునిక రెస్టారెంట్‌లుగా రూపుదిద్దుకుంటాయని తెలిపారు.

డిసెంబర్‌లో తొలి బ్యూటిపుల్‌ రెస్టారెంట్స్‌ ఆన్‌ వీల్స్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ తొలి దశలో ఏర్పాటుకానున్న కోచ్‌ రెస్టారెంట్లకు అన్నపూర్ణ, మా దుర్గా అనే పేర్లు పెట్టినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా సుమారుగా 10 రైల్వే స్టేషన్‌లలో ఈ కోచ్‌ రెస్టారెంట్‌ కార్యక్రమం ప్రయోగాత్మకంగా అమలుచేయబడుతోందని తెలుస్తోంది. భోపాల్‌, లక్నో, జబల్‌పూర్‌, వారణాసి సహా మరిన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నట్లు ప్రతిక్‌ శ్రీవాస్తవ వెల్లడించారు.

rail coach restaurant on wheels

జమ్మూ, కత్రా రైల్వే స్టేషన్‌లలో ఏర్పాటుకానున్న కోచ్‌ రెస్టారెంట్లు పూర్తిగా ఎయిర్‌ కండిషనింగ్‌ను కలిగి ఉంటాయని పేర్కొన్నారు. వీటిలో మాంసాహారం కూడా లభిస్తుందని తెలిపారు. వినియోగదారులకు ప్రత్యేకమైన అనుభూతి, రుచికరమైన భోజనం అందిస్తామని తెలిపారు. ఒక రైలు కోచ్‌ను పూర్తిగా రెస్టారెంట్‌గా మార్చేందుకు 90 రోజుల సమయం పడుతుందని అన్నపూర్ణ కోచ్‌ రెస్టారెంట్‌ యజమాని ప్రదీప్‌ తెలిపారు.

భారతీయ రైల్వేలోరి వందే భారత్‌ రైళ్లు సహా అత్యాధునిక కోచ్‌లు ప్రవేశిస్తున్నాయి. ఫలితంగా చాలా పాత కోచ్‌లు నిరూపయోగంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇటువంటి రైలు కోచ్ రెస్టారెంట్లతో ప్రయాణికులు సహా ఇతరులు సరికొత్త అనుభూతిని పొందుతారు. ఈ తరహా ఏర్పాట్లతో ఉపాధి కూడా పెరుగుతుంది.

railways converting old rail coaches into restaurants

జమ్మూలో రైలు కోచ్‌ రెస్టారెంట్లపై ఢిల్లీకి చెందిన ప్రయాణికుడు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతానికి కొత్త అందాలను తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యాటకులు, ప్రయాణికులకు కొత్త అనుభూతిని అందిస్తుందని తెలిపారు. డిసెంబర్ నుంచి ఈ ప్రాంతంలో తొలి కోచ్‌ రెస్టారెంట్‌ అందుబాటులోకి రానుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, October 11, 2023, 11:13 [IST]
English summary
Railways converting old rail coaches into restaurants
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+