వందేభారత్ రైళ్లలో 1 లీటర్‌ వాటర్‌ బాటిల్‌ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

వందేభారత్ రైళ్ల(Vande Bharat Trains)లో అందించే వాటర్ బాటిళ్ల పరిమాణాన్ని తగ్గించాలని భారతీయ రైల్వే శాఖ నిర్ణయించింది. ఇది దేశవ్యాప్తంగా నడిచే వందేభారత్‌ రైళ్లకు కూడా వర్తించనుంది. ఈ మేరకు ప్రయాణికులకు కేవలం 500 ml నీటిని మాత్రమే అందజేయనున్నారు. పూర్తి సమాచారం ఈ కథనంలో..

దేశవ్యాప్తంగా వందే భారత్‌ రైళ్లు అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. వేగవంతంగా గమ్యస్థానానికి చేర్చడంతో ప్రజలు ఎక్కువగా వందే భారత్‌ రైళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రధాన నగరాలను కలుపుతూ ఈ సెమీ హై స్పీడ్‌ రైళ్లు సేవలందిస్తున్నాయి. అయితే వందే భారత్ రైలు కొన్ని నిర్దిష్ట స్టేషన్లలో మాత్రమే ఆగడం వల్ల ప్రయాణికులు బయటి నుంచి ఆహారాన్ని కొనుగోలు చేయడం కుదరడం లేదు.

Rail-Neer-Vande-Bharat-Trians

ఈ క్రమంలో వందే భారత్ రైలు టిక్కెట్ల(Water Supply In Vande Bharat Trains)ను బుక్ చేసుకునేటప్పుడే.. ప్రయాణికులు ఫుడ్‌ కూడా ఆర్డర్‌ పెట్టుకోవచ్చు. దీని ద్వారా మీరు కూర్చున్న చోటుకే భోజనం సరఫరా అవుతుంది. అయితే భోజనంతో పాటు ప్రయాణీకుడికి ఒక లీటర్ వాటర్ బాటిల్ కూడా రైల్వే శాఖ అందిస్తోంది. ఇప్పుడు లీటర్‌ వాటర్‌ బాటిల్‌ అందించే విధానాన్ని మార్చనున్నారు.

వందే భారత్ రైళ్లలో ప్రయాణించే చాలా మంది ప్రయాణికులు తమ ప్రయాణ సమయంలో ఈ ఒక లీటర్ వాటర్ బాటిల్‌ను పూర్తిగా ఉపయోగించుకోలేరు. సగం తాగిన తర్వాత మిగిలిన సగం వాటర్‌తో ఉన్న బాటిల్‌ను పడేస్తున్నారు. దీంతో తాగునీరు వృథా అయిపోతుంది. దీనికి రైల్వే అధికారులు పరిష్కారం కనుగొంటూ కొత్త నిర్ణయం తీసుకున్నారు.

Rail-Neer-Vande-Bharat-Trians

ఈ నిర్ణయం ప్రకారం, ఇక నుంచి వందేభారత్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులందరికీ ఆహారంతో పాటు 500 ml వాటర్ బాటిల్ మాత్రమే అందించనున్నారు. ఈ వాటర్ బాటిల్ అయిపోతే, ప్రయాణికులు అడిగితే మరో 500 ml వాటర్ బాటిల్ ఇచ్చేలా ఏర్పాటు చేశారు. కాగా రెండవ 500 ml వాటర్ బాటిల్ కోసం ప్రయాణికులు ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

ఈ విధానం ప్రకారం ప్రస్తుతం, అన్ని వాటర్ బాటిళ్లను ప్రయాణికుడికి ఒక లీటర్ వాటర్ బాటిల్‌గా కేటాయిస్తారు. అయితే తొలుత 500 ml వాటర్ బాటిళ్లను అందించిన తర్వాత.. అవి సరిపోతే వారు రెండో వాటర్ బాటిల్ కొనాల్సిన పనిలేదు. కొందరికి 500 ml కంటే ఎక్కువ నీరు అవసరమైతే అడిగి తీసుకోవచ్చని రైల్వే యంత్రాంగం పేర్కొంది.

Rail-Neer-Vande-Bharat-Trians

ఈ కొత్త నిర్ణయం ద్వారా రైల్వే శాఖలో నీటి వృథా తగ్గడంతో పాటు ప్రయాణికుల డబ్బు కూడా ఆదా అవుతుంది. ఈ విధంగా నీటి వృథా తగ్గితే రైల్వే పరిపాలనకు కూడా డబ్బు ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే వందే భారత్ రైలు ఎక్కే మరియు దిగే ప్రదేశాన్ని బట్టి ఈ నీటి అవసరం మారుతుంటుంది.

కాగా దూర ప్రయాణాలు చూసుకుంటే వందే భారత్‌ రైళ్లలో ప్రయాణాలు దాదాపు 8 గంటల పడుతుంది. ఈ జర్నీలో ప్రయాణికుడికి లీటరు వాటర్‌ తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. అదే సమయంలో, 2-3 గంటలు మాత్రమే ప్రయాణించే వారికి ఒక లీటర్ వాటర్ బాటిల్ సరిపోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం వందే భారత్ రైలు ప్రయాణం పగటిపూట అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రయాణీకులకు ఎక్కువ నీరు అవసరం ఉంటుంది. తక్కువ దూరం ప్రయాణాలకు 500ml నీరు సరిపోతుంది. కానీ 8 గంటల వరకు ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఎక్కువ నీరు అవసరముంటుంది. కాబట్టి ప్రయాణ సమయాన్ని లెక్కించి దాని ప్రకారం వాటర్ బాటిల్ సైజును నిర్ణయించుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, April 25, 2024, 14:07 [IST]
English summary
Indian railway to supply 500 ml water rail neer bottle for vande bharat passengers to prevent wastag
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+