కరోనా రోగుల కోసం కార్లనే మొబైల్ హాస్పిటల్స్‌గా మార్చిన యువకులు

భారతదేశంలో అధికంగా వ్యాపిస్తున్న కరోనా సెకండ్ వేవ్ చాలామంది జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో అనుకోని నష్టం వాటిల్లింది. ఇప్పటికి కూడా ఎంతోమంది ప్రజలు కనీస మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

కరోనా రోగుల కోసం కార్లనే మొబైల్ హాస్పిటల్స్‌గా మార్చిన యువకులు

కరోనా సోకిన ప్రజల సంఖ్య ఎక్కువవుతున్న తరుణంలో హాస్పిటల్స్ లో బెడ్ల కొరతతోపాటు ఆక్సిజన్ కొరత కూడా ఎక్కువగా ఉంది. ఈ ఆక్సిజన్ కొరత కారణంగా ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలో చాలా వెలుగులోకి వచ్చాయి. ఆక్సిజన్ కొరత ఏ స్థాయిలో ఉందొ దాదాపు అందరికీ తెలుసు.

కరోనా రోగుల కోసం కార్లనే మొబైల్ హాస్పిటల్స్‌గా మార్చిన యువకులు

కరోనా రోగులకు కనీస సదుపాయాలు కూడా లేని సమయంలో చాలామంది ఉదారంగా సేవలందించడానికి ముందుకు వస్తున్నారు. ఇటీవల కాలంలో రాజస్థాన్‌కు చెందిన ఆరుగురు స్నేహితులు తమ 4 కార్లను మొబైల్ హాస్పిటల్స్ గా మార్చారు. హాస్పిటల్స్ లో బెడ్ దొరకడానికి ఇబ్బంది పడుతున్న కరోనా పేషంట్లకు సహాయం చేస్తున్నారు.

MOST READ:కరోనా ఎఫెక్ట్; అంబులన్సులుగా మారిన పోలీస్ వాహనాలు

కరోనా రోగుల కోసం కార్లనే మొబైల్ హాస్పిటల్స్‌గా మార్చిన యువకులు

ఈ యువకులు తమ కార్లను ప్రజలకు ఉచితంగా సర్వీస్ చేయడానికి తమ కార్లను హాస్పిటల్ వెలుపల పార్క్ చేసి మొబైల్ హాస్పిటల్స్ గా మార్చారు. హాస్పిటల్ లో అత్యవసర సమయంలో బెడ్ దొరకని రోగులు వీటిని ఉపయోగించుకోవచ్చు. ఈ కార్లలో రోగికి కావలసిన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

కరోనా రోగుల కోసం కార్లనే మొబైల్ హాస్పిటల్స్‌గా మార్చిన యువకులు

ఈ కార్లలో ఆక్సిజన్ సరఫరా ఉంది, అంతే కాకుండా ఇందులో ఎసి వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. మొబైల్ హాస్పిటల్స్ గా మార్చిన ఈ నాలుగు కార్లలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు వోక్స్‌వ్యాగన్ పోలో ఉన్నాయి. అయితే మిగిలిన కార్ బ్రాండ్ల గురించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు.

MOST READ:ట్రక్కు ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ప్రధాన కారణం ఇదే.. మీకు తెలుసా?

కరోనా రోగుల కోసం కార్లనే మొబైల్ హాస్పిటల్స్‌గా మార్చిన యువకులు

ఈ యువకులు గత కొన్ని వారాలుగా కరోనా వైరస్ సంక్రమణకు గురైన ప్రజలకు నిరాడంబరంగా సర్వీస్ చేస్తున్నారు. ఈ యువకులు ప్రతి రోజూ కనీసం 5 నుండి 6 మందికి సహాయం చేస్తున్నారు. వీరు రాజస్థాన్‌లోని కోటా ప్రాంతంలో సర్వీస్ చేస్తున్నారు. వారు కోటాలోని వివిధ ప్రాంతాల నుండి ఆక్సిజన్ పొందుతున్నారు.

కరోనా రోగుల కోసం కార్లనే మొబైల్ హాస్పిటల్స్‌గా మార్చిన యువకులు

ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉన్న కారణంగా ఆ యువకులు ఆక్సిజన్ పొందడానికి చాలా కాలం వేచి ఉండవలసి వచ్చిందని తెలిపారు. కరోనా సోకినవారికి సహాయం చేయడానికి ఈ యువకులు తమ సొంత డబ్బును ఉపయోగిస్తున్నారు. వారు ఇతరుల నుంచి ఎటువంటి సహాయం పొందలేదు. రాబోయే రోజుల్లో అంబులెన్స్ కొనాలని కూడా ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

MOST READ:ఫ్రీ వ్యాక్సిన్ సర్వీస్ ప్రారంభించిన ఎంజి మోటార్.. కేవలం వారికీ మాత్రమే

ఈ యువకులు ఇంకా చాలా ఎక్కువమందికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. భారతదేశంలో ప్రతిరోజూ 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆక్సిజన్ కొరతను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి.

కరోనా రోగుల కోసం కార్లనే మొబైల్ హాస్పిటల్స్‌గా మార్చిన యువకులు

కోవిడ్ 19 సమస్య నుండి ప్రపంచం త్వరలో కోలుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. ఈ సమయంలోనే మనసున్న నిజమైన హీరోలు ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. రాజస్థాన్ లోని కోటాలో కరోనా వైరస్ సోకిన ప్రజలకు సహాయం చేయడం ద్వారా ఈ ఆరుగురు యువకులు నిజమైన హీరోలుగా ప్రశంసించబడుతున్నారు. ఏది ఏమైనా ఇంత నిరాడంబరంగా సర్వీస్ చేస్తున్న యువకులు నిజంగా అభినందనీయులు.

MOST READ:రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన హెల్మెట్.. ఎలా అనుకుంటున్నారా?

Image Courtesy: Hindustan Times

Most Read Articles

English summary
Rajasthan Youths Converts Four Cars Into Mobile Hospitals. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X