స్విఫ్ట్‌ నుండి ల్యాంబోర్గినితో పాటు విమానాలకు వ్యాపించిన కబాలి హవా

By Anil

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి చిత్రం కబాలి విడుదల కాకముందే అంచనాలకు మించిన ప్రమోషన్లకు గురవుతోంది. ఇందుకు అన్ని మాధ్యమాలను దారులుగా ఎంచుకుంటున్నారు కబాలి టీం సభ్యులు. అత్యంత ప్రభావవంతమైన ఆటోమొబైల్స్‌ను కూడా ఇందుకు విరివిగా వినియోగించుకుంటోంది. కబాలి చిత్రానికి లభిస్తున్న ఆదరణ దృష్ట్యా కొన్ని భారీ సంస్థలు కూడా ప్రమోషన్లకు సిద్దం అవుతున్నాయి..

కబాలిని ఈ నెల 22 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి చేసిన ప్రమోషన్లలో భాగంగా స్విఫ్ట్ నుండి ల్యాంబోర్గిని వరకు మరియు విమానాల మీద కూడా కబాలి ప్రమోషన్లు జరిగాయి. కబాలి గురించి పూర్తి వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

జగమంతా కబాలి మయం

కబాలి చిత్రంలో రజనీకాంత్ సరసన కథానాయికగా రాధిక ఆప్టే నటిస్తున్నారు. కబాలి చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు మరియు కలైపులి ఎస్ థను గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

జగమంతా కబాలి మయం

అమెరికాలో సుమారుగా 400 తెరల్లో ఈ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తే, రిలీజ్ రోజు టికెట్లు మొత్తం కేవలం 2 గంటల్లోనే అమ్ముడుపోయాయి. బాహుబలి చిత్రాన్ని కూడా దాటే అంచనాలు భారీగా ఉన్నాయి.

జగమంతా కబాలి మయం

కబాలి చిత్రానికి సంభందించి అంచానాలు పెరుగుతున్న నేపఖథ్యంలో వీలైనంత వరకు ప్రేక్షలను పెంచుకునేందుకు కబాలి బృందం ఈ చిత్రానికి సంభందించి వివిధ మార్గాలలో ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. అందులో ఎయిర్ ఏషియా వంటి విమానాయాన సంస్థతో కూడా చేతులు కలిపారు.

జగమంతా కబాలి మయం

ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున కబాలి రిలీజ్ అని తెలియజేయడానికి అన్నట్లు పొరుగు దేశమైన మలేషియాలోని కౌలాలంపూర్‌లో సూపర్ కార్ల మీద కబాలి పోస్టర్లు ప్రమోషన్ల రూపంలో దర్శనమిచ్చాయి.

జగమంతా కబాలి మయం

సూపర్ కార్లకు పేరుగాంచిన సంస్థ ల్యాంబోర్గినికి చెందిన అత్యంత ఖరీదైన గల్లార్డో మీద సూపర్ స్టార్ అభిమాని ఒకరు ఇలా పోస్టర్లతో అలంకరించేశాడు.

జగమంతా కబాలి మయం

ఇండియాలోనే కాదు విదేశీయాల్లో కూడా తలైవార్ యొక్క అభిమానులు కబాలి రిలీజ్‌ను పెద్ద పండుగులా నిర్వహిస్తున్నారు. అందుకు నిదర్శనం ఈ చిత్రం.

జగమంతా కబాలి మయం

ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం మలేషియాలోని అన్ని ప్రధాన నగరాలతో పాటు కౌలాలంపూర్‌లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది.

మారుతి స్విఫ్ట్ కబాలి ఎడిషన్

మారుతి స్విఫ్ట్ కబాలి ఎడిషన్

ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందుతున్న కబాలి, మన వద్ద ఎందుకు సక్సెస్ కాదు అనుకున్నాడో ఏమో ? తమిళనాడు రాష్ట్రంలోని హోసూర్‌లోని మారుతి సుజుకి డీలర్. అమ్మకాలను పెంచుకునేందుకు కబాలిని అస్త్రంగా చేసుకుని కబాలి పేరు మీద స్పెషన్ ఎడిషన్ స్విఫ్ట్‌లను రూపొందించాడు.

జగమంతా కబాలి మయం

కబాలిని ప్రేక్షకులకు చేరువ చేసేందుకు కబాలి బృందం అన్ని విధాలు ప్రయత్నం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ప్రమోషన్లతో పాటు అమ్మకాలను కూడా పెంచుకోవచ్చు అనుకున్నాడు హోసూరులోని మారుతి డీలర్. అందుకోసం హోసూరులోని అమ్మాన్ కార్స్ డీలర్ స్విఫ్ట్‌ను కబాలి స్పెషల్ ఎడిషన్‌ను రూపొందించాడు.

జగమంతా కబాలి మయం

ఇందులో మారుతి సుజుకి వారి ప్రమేయం ఏ మాత్రం లేదు. కేవలం ఈ డీలర్ మాత్రమే దీనికి ఆజ్యం పోశాడు. మరియు ఇవి ఈ షోరూమ్‌లో తప్ప దేశవ్యాప్తంగా ఉన్న మరే ఇతర షోరూమ్‌లలో కూడా అందుబాటులో ఉండవు.

జగమంతా కబాలి మయం

నూతన స్వఫ్ట్‌లకు కబాలి ప్రత్యేక ఎడిషన్ పోస్టర్లు మరియు ప్రమోషన్ల జోడింపు తప్ప మరే ఇతర మార్పులు జరగలేదు. ఇందులో ఉన్న 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ మరియు 1.3 లీటర్ డిడిఐఎస్ డీజల్ ఇంజన్‌లలోనే లభ్యం అవుతోంది.

జగమంతా కబాలి మయం

కబాలి ప్రభావం కేవలం కార్లను మాత్రమే కాదు విమానాలను కూడా తాకింది. రజనీకాంత్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి అఫీషియల్ పార్టనర్‌గా ఎయిర్ ఏషియాన విమానయాన సంస్థ చేతులు కలిపింది.

జగమంతా కబాలి మయం

ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న కబాలి చిత్రానికి సంభందించిన పోస్టర్లతో ఎయిర్ క్రాఫ్ట్‌ను కొత్తగా డిజైన్ చేసింది.

జగమంతా కబాలి మయం

విమానం అన్ని వైపులా కబాలి చిత్రానికి సంభందించిన ప్రమోషన్లతో నిండిపోయింది.

జగమంతా కబాలి మయం

ఏయిర్ ఏషియా ఓ ప్రకటనలో, భారతీయ సినిమా పరిశ్రమకు రజనీకాంత్ గారు చేసిన సేవలకు గౌరవార్థం గుర్తుగా ఈ ఎయిర్ క్రాఫ్ట్‌ను కబాలి ఎడిషన్‌గా రూపొందించామని తెలిపారు.

జగమంతా కబాలి మయం

సూపర్ స్టార్ రజనీకాంత్: స్టైల్ గురూ కార్ కలెక్షన్

More from DriveSpark

Article Published On: Tuesday, July 19, 2016, 12:52 [IST]
English summary
Rajinikanth's Kabali Is One Movie That Is Transforming Even Supercars
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+