స్టూడెంట్స్ తయారుచేసిన హైబ్రిడ్ బైక్; పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్

భారతదేశంలో ఇంధన ధరలు రోజు రోజుకి ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిపోతున్న ఈ ఇంధన ధరలు సామాన్య ప్రజలకు చాలా పెద్ద పెనుభారంగా మారింది. ఈ తరుణంలో చాలామంది వాహనదారులు పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలకు ప్రత్యామ్యాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

స్టూడెంట్స్ తయారుచేసిన హైబ్రిడ్ బైక్; పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్

కస్టమర్లు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపడం వల్ల చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. కానీ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు తగినన్ని లేదు. ఇది ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి ఒక ఆటంకంగా మారింది.

స్టూడెంట్స్ తయారుచేసిన హైబ్రిడ్ బైక్; పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్

ఇదిలా ఉండగా కొంతమంది వారిలో ఉండే సృజనాత్మకతను ఉపయోగించి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌ వివిపి ఇంజనీరింగ్ కాలేజ్ కి చెందిన కొంతమంది స్టూడెంట్స్ కలిసి ఒక బైక్ తయారు చేసారు.

స్టూడెంట్స్ తయారుచేసిన హైబ్రిడ్ బైక్; పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్

స్టూడెంట్స్ తయారు చేసిన ఈ బైక్ పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ రెండింటిలోనూ ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ హైబ్రిడ్ బైక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాలేజ్ మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ మన్నియర్ తమ విద్యార్థులు చేసిన ఈ అద్భుతమైన బైక్ కి ఎంతగానో సంతోషిస్తున్నాడు.

స్టూడెంట్స్ తయారుచేసిన హైబ్రిడ్ బైక్; పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్

దీని గురించి డాక్టర్ మన్నియర్ మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అదే సమయంలో, ఎలక్ట్రిక్ వాహనాలు ఖరీదైనవిగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ రెండింటిలోనూ నడిచే బైక్‌ను డిజైన్ చేయాలనుకుంటున్నాము. మా విద్యార్థులు పెట్రోల్‌తో నడిచే బైక్‌ను ఎలక్ట్రిక్ ద్వారా నడిచేదిగా అభివృద్ధి చేశారని తెలిపారు.

స్టూడెంట్స్ తయారుచేసిన హైబ్రిడ్ బైక్; పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్

ఈ బైక్‌కి విద్యార్థులు నాలుగు బ్యాటరీలను ఏర్పాటు చేశారు. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 6 గంటల సమయం పడుతుంది. ఈ బ్యాటరీలు పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత గంటకు 40 కి.మీ వేగంతో నడుస్తాయి. ఈ బైక్ నడపడానికి కిలోమీటరుకు కేవలం 17 పైసలు ఖర్చవుతుంది.

స్టూడెంట్స్ తయారుచేసిన హైబ్రిడ్ బైక్; పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్

ఈ బైక్ పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ రెండింటినీ కలిగి ఉంది. కావున దీనికి అనుకూలంగా దీనికి 2 స్విచ్‌లు ఉన్నాయి. ప్రయాణించేటప్పుడు ఛార్జ్ అయిపోయినట్లయితే, పెట్రోల్‌తో బైక్‌ను నడపవచ్చు. ఈ రకమైన హైబ్రిడ్ బైక్‌ను భారతదేశంలో అభివృద్ధి చేయడం ఇదే మొదటిసారి కాదు.

స్టూడెంట్స్ తయారుచేసిన హైబ్రిడ్ బైక్; పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్

ఇప్పటికే చాలామంది పెట్రోల్ బైక్‌లను ఎలక్ట్రిక్ బైక్‌లుగా మార్చారు. హైబ్రిడ్ బైక్ డ్రైవింగ్ ఖర్చు చాలా తక్కువగా కూడా ఉటుంది. అందువల్ల ఎక్కువమంది ఈ బైకులపై ద్రుష్టి సారిస్తున్నారు. హైబ్రిడ్ బైకుల యొక్క పరిధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మంచి మైలేజ్ కూడా అందిస్తాయి.

స్టూడెంట్స్ తయారుచేసిన హైబ్రిడ్ బైక్; పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్

ఇప్పుడు స్టూడెంట్స్ తయారుచేసిన ఈ బైక్ కి ఛార్జింగ్ అయిపోయినట్లైతే, అది పెట్రోల్ ద్వారా ముందుకు కదులుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు అధిక ధరల కారణంగా భారతదేశంలో ఎక్కువమంది కొనుగోలు చేయలేకపోతున్నారు. అంతే కాకుండా ఎలక్ట్రిక్ బైకులకు మనదేశంలో మౌలిక సదుపాయాలు కూడా చాలా తక్కువగా ఉండటం కూడా ఒక కారణమే. ఇప్పుడిప్పుడే కొన్ని సంస్థలు ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు.

NOTE: ఇక్కడ కొన్ని చిత్రాలు రిఫరెన్స్ కోసం మాత్రమే.

Most Read Articles

English summary
Gujarat Student Develop Motorbike Run On Petrol Electricity. Read in Telugu.
Story first published: Tuesday, July 20, 2021, 9:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X