నడిరోడ్డుపై రాఖీ సావంత్ హల్చల్.. సన్‌రూఫ్ నుంచి ఫొటోలకు పోజులు.. పోలీసులు ఏం చేశారంటే..
సినీ సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల్లో ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటూ అభిమానులు అలరిస్తుంటారు. దీనికి బాలీవుడ్ నటీనటులు ఏ మాత్రం తీసిపోరు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ నటి రాఖీ సావంత్(Rakhi Sawant) ఇటీవల ముంబై నగర రోడ్లపై చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ముంబయి లాంటి మహా నగరంలో ఎల్లప్పుడూ రోడ్లు ట్రాఫిక్‌తో రద్దీగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో నడిరోడ్డుపై తన కారులో ప్రయాణిస్తూ ఫొటోగ్రాఫర్ల క్లిక్‌లకు పోజులిచ్చింది ఈ బ్యూటీ. రాఖీ సావంత్ తన BMW 5-సిరీస్ కారులో వెళ్తున్న ఈ వీడియో వైరల్‌గా మారింది. కేవలం ఫొటోగ్రాఫర్లే కాకుండా చుట్టూ ఉన్న వారు సైతం ఆమెను ఫొటోలు, వీడియోలు తీశారు.

రాఖీ సావంత్(Rakhi Sawant) అకస్మాత్తుగా పబ్లిక్ రోడ్‌పై ఇలా కనిపించడంతో, చాలా మంది షాక్ అయ్యారు. తన బీఎండబ్ల్యూ కారులో ప్రయాణిస్తూ సన్‌రూఫ్ ద్వారా బయటకు వచ్చి హల్‌చల్ చేశారు. ఈ విషయం స్థానిక పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. సంఘటనాస్థలికి పోలీసులు చేరుకోవడంతో రాఖీ సావంత్ వారి వద్దకు వెళ్లింది.
నడిరోడ్డుపై ఏం చేస్తున్నారని రాఖీ సావంత్‌ను పోలీసులు అడగ్గా.. ఫ్యాన్స్ కోసం ఫొటోలకు పోజులిస్తున్నానని సమాధానమిచ్చారు. అభిమానులంతా తన కుటుంబమని ఆమె వెల్లడించింది. దీంతో కాసేపు విచారించిన అనంతరం పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ వెంటనే ఆమె మళ్లీ ఫొటోలకు పోజులిచ్చే పనిలో నిమగ్నమైంది.

రాఖీ సావంత్ మధ్యమధ్యలో రోడ్డుపై పరుగెడుతూ అందరితో మాట్లాడుతూ కాసేపు హంగామా సృష్టించింది. సన్‌రూఫ్ ద్వారా బయటకు వచ్చి అభిమానులను పలకరించింది. ఆ దృశ్యాలను ఫొటోగ్రాఫర్లే కాకుండా అక్కడున్న వారు సైతం తమ కెమెరాల్లో బంధించారు. ఇటీవల కాలంలో ఇలా సన్‌రూఫ్ ద్వారా బయటకు రావడం సాధారణమైపోయింది.
అయితే కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఇలా సన్‌రూఫ్ ద్వారా బయటకు వచ్చి చూడటం ప్రమాదకరమని గ్రహించాలి. అనివార్య పరిస్థితుల్లో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేసినా లేదా టర్నింగులు తీసుకున్నా గాయాలపాలయ్యే అవకాశం ఉంది. కానీ చాలా మంది ఈ విషయాన్ని గమనించకుండా ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. సెలబ్రిటీలు ఏం చేసినా వైరల్‌గా మారి వారిని సాధారణ ప్రజలు అనుసరించే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ప్రముఖులందరూ తమ బాధ్యతను గ్రహించి వ్యవహరించాలి.

కార్లలో సన్‌రూఫ్‌ల సౌకర్యం ప్రయాణికులకు చాలా థ్రిల్లింగ్ అనుభవాన్ని అందిస్తాయి. అందుకే ఇప్పుడు ఎక్కువగా సన్‌రూఫ్ సదుపాయం ఉన్న కార్ల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. అందుకణుగుణంగా కార్ల తయారీదారులు సైతం ఇప్పుడు భారత్‌లో విక్రయించే చాలా కార్లలో సన్‌రూఫ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. భారత మార్కెట్లో నంబర్-1 కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి సైతం ఇప్పుడు తన కార్లలో సన్‌రూఫ్‌లను అందించడం ప్రారంభించింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








