రాఖీ సావంత్‌కి గిఫ్ట్ ఇచ్చిన ఫ్యాన్.. ఆవేశంతో అభిమానిని నెట్టివేసిన నటి, వీడియో వైరల్..
రాఖీ సావంత్ తన అభిమానిపై చెయ్యి చేసుకుంది. తాజాగా రాఖీకి ఓ అభిమాని కారుని గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆ సమయంలో రాఖీకి దగ్గరగా వచ్చిన మహిళపై ఈ నటి దురుసుగా ప్రవర్తించి నెట్టివేసింది. దీంతో అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.
సెల్ఫీ కోసం వచ్చిన ఆ మహిళపై రాఖీ ప్రవర్తించిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. అసలేం జరిగిందంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో డెస్టింగ్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అకౌంట్ పోస్ట్ చేసిన వీడియో ప్రకారం ఓ అభిమాని ఆడి కారుని గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ సందర్భంగా మీడియా వారికి ఈ విషయాన్ని రాఖీ స్వయంగా పంచుకున్నారు. దీంతో కారుని అప్పగించే వేదిక వద్ద హడావిడి ఏర్పడింది.

గత కొన్ని రోజులుగా రాఖీ దుబాయ్‌లో ఉంటున్నారు. ఏప్రిల్ 25వ తేదీన ఆమె ఇండియాకు వచ్చారు. ప్రస్తుతం ముంబయిలో ఆమె ఉంటున్నారు. తాజాగా అభిమాని అందించిన గిఫ్ట్‌ని రిసీవ్ చేసుకునేందుకు ఆమె ఒప్పుకున్నారు. ఈ కార్యక్రమం కోసం ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు అందంగా తయారయ్యారు. ఆమె భారీ మేకప్, భారీ జ్యువెలరీని ధరించారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తాజాగా విడుదలైన 'హీరామండి లుక్'లో ఆమె మెరిశారు.
తన ఫ్యాన్ గిఫ్ట్‌గా ఇచ్చిన కారుని స్వీకరించే క్రమంలో స్వయంగా డాన్సర్ అయిన రాఖీ పాట పాడుతూ కాసేపు స్టెప్పులేసింది. తెల్లని ఆడి కారును తన అభిమాని బహుమతిగా ఇస్తున్నాడని.. దానిని కెమెరాకు చూపిస్తూ తనదైన స్టైల్లో కాసేపు హల్‌చల్ చేసింది. అందరూ సంతోషంగా ఉన్న సందర్భంలో రాఖీ సావంత్ కోపంతో ఊగిపోయారు. దీంతో అక్కడి వారంతా అవక్కయ్యారు. వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఆ ఈవెంట్‌లో సెల్ఫీ కోసం తన దగ్గరకు వచ్చిన మరో మహిళా అభిమానిని రాఖీ నెట్టివేసింది. తాను కారుని డ్రైవ్ చేయబోయే క్రమంలో ఆ మహిళా దగ్గరకు వచ్చి మీద పడటంతో ఆమె ఆవేశంతో ఊగిపోయింది. దీంతో మహిళా కూడా రాఖీ సావంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు అలా నెట్టివేయకూడదని వాదించింది. దీనికి ప్రతీగా రాఖీ కూడా మీరు అలా మీద పడకూడదు అని రాఖీ సూచించింది.
ఆ వెంటనే పరిస్థితి చక్కపడటంతో వెంటనే మళ్లీ ఆ మహిళను పిలిచి సెల్ఫీ తీసుకుంది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఎప్పుడూ ఫ్యాన్స్‌తో జాలీగా ఉండే రాఖీ అలా చేయడం ఏంటని ఆశ్చర్యపోయారు. దీనిపై నెటిజన్లు కూడా వినూత్న రీతిలో విరుచుకుపడ్డారు. తన మేకప్‌కి చెదిరిపోకుండా చూసుకునేందుకు రాఖీ ఎక్కువ ఇంపార్టన్స్ ఇచ్చారనీ కామెంట్స్ చేశారు. అభిమానులు ప్రేమించాలని వారు సూచించారు.

తన మాజీ భర్త ఆదిల్ ఖాన్ దురానీకి సంబంధించిన అశ్లీల వీడియో కేసులో ఆమె నాలుగు వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఆమె బూర్ఖా ధరించి ఇండియాలో ప్రవేశించింది. ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఆమె బూర్ఖా ధరించడం ఏంటని కొందరు బహిరంగగానే ఆమెపై విమర్శలు చేశారు. అతి కొద్ది రోజుల్లోనే అభిమానిపై చేయి చేసుకుని మరోసారి వార్తల్లో నిలిచారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








