రఫ్పాడించే కారులో హీరో రామ్‌ చరణ్‌.. దీని ధర ఎంతో తెలుసా?

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో నటిస్తున్నారు. RRR సినిమాతో ప్రపంచస్థాయిలో రామ్‌చరణ్‌ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఆయన మంచి ఫ్యాన్‌బేస్‌ని సంపాదించారు. మంచి విజయాలు, సామాజిక కార్యక్రమాలతో తండ్రి తగిన తనయుడిగా ఆయన గుర్తింపు పొందారు. ప్రస్తుతం సినిమాలు, ఇతర బ్రాండింగ్‌ పనుల్లో ఆయన బజీగా ఉన్నారు.

తాజాగా హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో సరికొత్త లగ్జరీ రోల్స్‌ రాయిస్‌ స్పెక్ట్రె (Rolls Royce Spectre) కారులో ఆయన కనిపించారు. తన భార్య ఉపాసన కూతురితో కలిసి ఎయిర్‌పోర్ట్‌కి ఖరీదైన కారులో వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. కొత్తగా కొనుగోలు ఆయన కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ స్పెక్ట్రె బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రూపొందించిన తొలి ఎలక్ట్రిక్ కారుగా ఉంది.

Ram-Charan-Rolls-Royce-Spectre

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూపే, రాయిస్‌ వ్రైత్ తర్వాత వచ్చిన కారుగా ఇది ఉంది. దీని ధర భారత్‌లో రూ.7.50 కోట్ల ధర (ఎక్స్‌-షోరూమ్‌) వద్ద భారత్‌లో లాంచ్ అయింది. టాక్స్‌లు, ఇన్సూరెన్స్ కలిపి ఈ వాహనం ఆన్ రోడ్ ధర సుమారు రూ.7.87 కోట్లుగా ఉంది. ఈ ఫ్యామిలీకి ఇది రెండో రోల్స్ రాయిస్ కావడం గమనార్హం.

రాయల్స్‌ ఫాంటమ్‌ కారుని తండ్రి చిరంజీవికి రామ్‌ చరణ్‌ గతంలో గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ కారు ముందు భాగంలో ఫ్రంట్ గ్రిల్ ప్రధాన ఆకర్షణ. అలాగే ఏరోడైనమిక్స్ స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ తాజా లోగోను కూడా పొందుతుంది. ఈ ఈవీ కూపేలో 23 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇంత పెద్ద సైజులో చక్రాలను కలిగి ఉన్న మొదటి రోల్స్ రాయిస్ కారు ఇదే కావడం గమనార్హం.

Ram-Charan-Rolls-Royce-Spectre

వెనుకవైపు రూఫ్ స్టైల్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు లగ్జరీ కారును వెనుక నుంచి స్టైలిష్‌ లుక్‌ని అందిస్తాయి. ఇతర రోల్స్ రాయిస్ కారు మాదిరిగానే, స్పెక్ట్రె ఈవీ కూడా అందమైన మరియు విలాసవంతమైన ఇంటీరియర్‌ని కలిగి ఉంది. ఇందులో భారీ టచ్‌స్క్రీన్‌, మెటల్ యాక్సెసరీస్‌తో కూడిన హై క్వాలిటీ లెదర్ అండ్ వుడ్ ఇన్లేస్ కారును అబ్బురపరుస్తాయి.

డోర్ ప్యానెల్స్ దాని సిగ్నేచర్ స్టార్ లైట్లపై స్టార్ లైట్ LED లైట్లను అందించిన మొదటి రోల్స్ రాయిస్ మోడల్ ఇదే కావడం విశేషం. ఈవీ కూపేలో 102 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 530 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. స్పెక్టర్ కారు ముందు మరియు వెనుక యాక్సిల్స్‌తో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్లతో వస్తుంది.

Rolls-Royce-Spectre

ఈ కారు గరిష్టంగా 575bhp పవర్ వద్ద 900 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో యాక్టివ్ సస్పెన్షన్, ఫోర్ వీల్ స్టీరింగ్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ మోటార్లు, బ్యాటరీలు, ప్రీమియం మెటీరియల్స్ నుంచి అదనపు బరువు కలిగి ఉన్నప్పటికీ స్పెక్టర్ ఈవీ కేవలం 4.5 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదదు.

ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో రజినీకాంత్, ప్రభాస్, విజయ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ సరసన రామ్ చరణ్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన రెమ్యునరేషన్ రూ.95 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రతీ సినిమాకు రూ.125 నుంచి రూ.130 కోట్ల వరకు తీసుకుంటున్నారని సమాచారం.

రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీని ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో చేయనున్నాడు. నిత్యం ఫ్యామిలీతో గడిపేందుకు రామ్‌ చరణ్‌ ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. తాజాగా సరికొత్త లగ్జరీ కారులో అభిమాన హీరోను చూసి అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, July 12, 2024, 10:02 [IST]
English summary
Ram charan buys rolls royce spectre ev and arrived begumpet airport with luxurious car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+