రచ్చలో కార్ స్టంట్‌తో ప్రేక్షకుల చేత కేకలు పెట్టించిన రామ్

Ram Charan Teja
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, తమన్నాలు జంటగా, సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన 'రచ్చ' సినిమా గురువారం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. మగధీర సినిమాలో ఒకే ఒక్క బైక్ స్టంట్‌ ఎంట్రీతో కుర్రకారు చేత చప్పట్లు కొట్టించి, ఈలలు వేయించిన ఈ కుర్ర హీరో రచ్చ సినిమాలోనూ కొంచెం కొత్తగా ట్రైచేసి మరోసారి శభాష్ అనిపించుకున్నాడు.

రచ్చ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ కార్ స్టంట్‌తో మొదలవుతుంది. వేగంగా వస్తున్న ట్రైన్‌కు ఎదురు వెళ్తూ రెండు కార్లతో సాగే ఈ స్టంట్ చాలా ఉద్విగ్నభరితంగా ఉంటుంది. ఈ స్టంట్ కోసం ఓ మోడిఫైడ్ మెర్సిడెస్ బెంజ్ కారును రామ్ చరణ్ ఉపయోగించినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కెటిఎమ్‌ డ్యూక్‌ను (బహుశా 350సీసీ వేరియంట్ కావచ్చు) కూడా ఉపయోగించారు.

అయితే, దీనితో పెద్దగా చెప్పుకోదగిన స్టంట్ ఏమీ చేయలేదనే చెప్పొచ్చు. అలాగే, ఓ పాటలో హీరో మోటోకార్ప్ అందిస్తున్న 'కరిజ్మా జెడ్ఎమ్ఆర్' స్పోర్ట్స్ బైక్‌ను కూడా రామ్ చరణ్ ఉపయోగించటం జరిగింది. ఇకపోతే అన్ని పెద్ద తెలుగు సినిమాల మాదిరిగానే ఇందులో కూడా కార్ చేజింగ్‌లను చూడొచ్చు. ఈ సినిమాలో ఎక్కువగా ఆడి లగ్జరీ కార్ బ్రాండ్‌ను ఫోకస్ చేయటం జరిగింది.

అంతేకాకుండా, కొన్ని చోట్ల భీకరంగా కనిపించే టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని కూడా ఉపయోగించారు. కార్ చేజింగ్ సన్నివేశాల్లో మహీంద్రా స్కార్పియో, మారుతి ఈకో/ఓమ్నీ వంటి కార్లను ఉపయోగించారు. మొత్తమ్మీద ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ ఓ కొత్త కోణంలో కనిపించి, ఎప్పటి లాగే యాక్షన్ సన్నివేశాల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.

More from DriveSpark

Article Published On: Friday, April 6, 2012, 16:45 [IST]
English summary
Ram Charan Teja in his recently released film Rachcha has been seen in several top cars and bikes. His introduction scene begins with him driving a modified Mercedes car. He is also seen riding a Hero Karizma ZMR in a song.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+