RTO ఆఫీస్‌లో రామ్ చరణ్‌ సడన్ ఎంట్రీ.. మతి పోగొడుతున్న ఖరీదైన రోల్స్ రాయిస్‌.. వామ్మో ఇంత రేటా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆయన వద్ద టాప్ బ్రాండ్‌లకు చెందిన లగ్జరీ కార్లు ఉండగా, ఇటీవల ప్రపంచ ప్రఖ్యాత సంస్ధ రోల్స్ రాయిస్‌ కారును కొనుగోలు చేశారు. తాజాగా దీనిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు హైదరాబాద్​లోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చారు. కొత్త కారు TG 09 2727 రోల్స్ రాయిస్‌ కారు రిజిస్ట్రేషన్ కోసం ఫోటో దిగి, అవసరమైన అన్ని పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి అక్కడి అధికారులు ఆయనకు సహాయం చేశారు. రామ్ చరణ్‌ రాకతో ఆర్‌టీఓ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. తమ అభిమాన నటుడు కనిపించడంతో భారీ సంఖ్యలో అక్కడికి అభిమానులు తరలి వచ్చి ఆయనతో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఆర్టీఓ కార్యాలయ అధికారులు ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌ అయ్యాయి. రామ్ చరణ్‌ గతంలో ఫాంటమ్ VIIని కొనుగోలు చేసి తన తండ్రి చిరంజీవికి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇప్పుడు రోల్స్ రాయిస్ స్పెక్టర్‌ను కొన్నారు. దీని ధర రూ.7.5 కోట్లు.

Ram Charan Rolls Royce Spectre Ev

కొన్ని కోట్ల సంపద ఉన్న కూడా రోల్స్ రాయిస్ అడిగిన వాళ్లందరికీ తమ కార్లను ఇవ్వదు. సమాజంలో పేరు, ప్రఖ్యాతలు, స్థాయి మొదలగు బ్యాక్‌గ్రౌండ్‌ను చూసిన తరువాతే కార్లను అందిస్తుంది. అందుకే ఈ కంపెనీకి చెందిన కార్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. రామ్ చరణ్‌ తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో మంచి పేరు ఉన్న నటుడు అందుకే ఆయనకు రోల్స్ రాయిస్ స్పెక్టర్‌ను సంస్థ అందించింది.

భారీ మొత్తాన్ని చెల్లించి ఈ కారును కొనుగోలు చేశారంటే దీనిలో చాలా స్పెషల్ ఫీచర్లు ఉన్నాయని తెలుస్తుంది. దీనిలో ప్రయాణిస్తుంటే భూతల స్వర్గంగా ఉంటుంది. ఈ కారు ఎలక్ట్రిక్ వేరియంట్. ఇది ఫుల్ ఛార్జింగ్ తో 530 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. దీని కోసం 102 kWh సామర్థ్యంతో చాలా పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను అందించారు.

Ram Charan Spotted Khairatabad Rto For Rolls Royce Spectre

కారులో మరింత శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారును ప్రత్యేకంగా అమర్చారు. ఇది కేవలం 4.5 సెకన్లలో 0 నుండి 100 kmph వరకు వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కి.మీగా ఉంది. పేరుకు, ధరకు తగ్గట్టుగానే రోల్స్ రాయిస్ స్పెక్టర్‌‌లో అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి. క్యాబిన్ లోపల అత్యంత నాణ్యత కలిగిన కార్బన్ ఫైబర్, నాణ్యమైన లెదర్ తోలుతో కూడిన సీట్లు ఉన్నాయి.

అల్ట్రా-సంపన్నులు ఇష్టపడే లగ్జరీ సౌకర్యాలు అన్నింటిని కూడా ఈ కారులో అందించారు. ఇంటీరియర్ రూఫ్ పై ఆకాశాన్ని ప్రతిబింబించేలా నక్షత్రాకారంలో ఉండే చిన్న చిన్న లైట్లు ఉన్నాయి. ఈ కారులో రెండు డోర్లు, నలుగురు కూర్చునే సామర్థ్యం ఉంది. ముఖ్యంగా ప్రయాణికుల భద్రత పరంగా అత్యంత అధునాతన ఫీచర్లు కారులో ఉన్నాయి. ఇండియాలో మొదటగా చెన్నై వ్యాపారవేత్త కారును కొనుగోలు చేయగా, తరువాత రామ్‌ చరణ్ సొంతం చేసుకున్నారు.

Ram Charan Khairatabad Rto For Rolls Royce Registration

రామ్ చరణ్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆయన వద్ద కోట్ల విలువ చేసే పలు కార్లు ఉన్నాయి. ఆయన కార్ల కలెక్షన్‌ను చూసినట్లయితే, మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 మోడల్ కూడా ఉంది. దీని ధర రూ.4 కోట్లు. అలాగే, ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 ధర రూ. 3.2 కోట్లు.

రూ. 3.5 కోట్ల విలువైన ఫెరారీ పోర్టోఫినో, రూ. 2.75 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, రూ. 1.75 కోట్ల BMW 7 సిరీస్, రూ. 1 కోటి విలువైన మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌ఈ 450 ఏఎమ్‌జీ కూపే ఇంకా ఇతర కార్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, October 24, 2024, 16:37 [IST]
English summary
Ram charan spotted khairatabad rto for register his rs 7 5 cr rolls royce spectre ev
Read more on: #rolls royce #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+