'రచ్చ' సినిమాలో బైక్‌లతో రచ్చ చేయనున్న రామ్ చరణ్

Ram Charan - Rachcha
రామ్ చరణ్ తేజ, తమన్నాలు జంటగా, సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ' అనే పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. మగధీరలో గుర్రపు స్వారీ చేసి తెలుగు సినీ ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్న చరణ్, ఇప్పుడు తాజాగా రచ్చ సినిమాలో బైక్ సవారీలతో ప్రేక్షకులను అలరించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కెటిఎమ్ డ్యూక్‌పై కనిపించనున్నాడు.

అంతేకాకుండా... అందరకిన్నా ఎత్తులో (ఎబౌ ఆల్) అనే క్యాప్షన్‌తో దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ అందిస్తున్న 'కరిజ్మా జెడ్ఎమ్ఆర్' స్పోర్ట్స్ బైక్‌పై కూడా రామ్ చరణ్ కనిపించనున్నాడు. ఈ చిత్రంలో బహుశా ఓ యాక్షన్ సన్నివేశంలో రామ్ చరణ్ తేజ కెటిఎమ్ డ్యూక్ 350సీసీ ఆఫ్-రోడర్ మోటార్‌సైకిల్ ఉపయోగించినట్లు తెలుస్తోంది.

కెటిఎమ్ డ్యూక్ 350సీసీ బైక్ అత్యంత శక్తివంతమైన రేస్ బైక్. ఆఫ్-రోడ్ రేస్‌లు, అడ్వెంచరస్ రైడ్‌ల కోసం ఈ బైక్‌ను ఉపయోగిస్తారు. మరి ఈ బైక్‌తో రచ్చ సినిమాలో రామ్ చరణ్ ఎలాంటి అడ్వెంచర్‌లు చేశాడో తెలియాలంటే మాత్రం తెరపై వీక్షించాల్సిందే. మొత్తం రచ్చ సినిమాలో మోటార్‌సైకిల్ విన్యాసాలతో రామ్ చరణ్ రచ్చ రచ్చ చేయనున్నాడని మాత్రం తెలుస్తోంది.

ప్రస్తుతం కెటిఎమ్ నుండి ఇండియాలో లభిస్తున్న బైక్ డ్యూక్ 200 మాత్రమే. కెటిఎమ్ ఇండియా మరిన్ని మోడళ్లను దేశీయ మార్కెట్లో విడుదల చేయాలని యోచిస్తోంది. వాటిల్లో కెటిఎమ్ డ్యూక్ 350సీసీ కూడా ఉండే అవకాశం ఉంది. ఇక కెటిఎమ్ డ్యూక్ 200 విషయానికి వస్తే దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.17 లక్షలుగా ఉండగా, హీరో మోటోకార్ప్ అందిస్తున్న కరిజ్మా జెడ్ఎమ్ఆర్ ధర రూ.95,500 గా ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 8, 2012, 13:12 [IST]
English summary
Tollywood hero Ram Charan Teja's latest film 'Rachcha' is getting ready for release soon. Charan, who rides the horse in his blockbuster movie Magadheera is gonna ride powerful sports motorcycles in this upcoming film. Take a look at his new movie stills.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+