కోట్ల ఆస్తి ఉన్నా రామోజీ రావుకి కార్లంటే ఇష్టం లేదు.. చివరి రోజుల్లో ఆయన ప్రయాణించిన కారు ఇదే!!

పద్మ విభూషణ్ రామోజీరావు జూన్ 08వ తేదీన ఉదయం 4:50 గంటలకు తుది శ్వాస విడిచారు. శుక్రవారం (జూన్‌ 7)న రాత్రి ఆయన తీవ్ర అస్వస్థకు గురి కావడంతో హైదరాబాద్‌లోని స్టార్‌ హాస్పిటల్‌లో చేర్చారు. అనంతరం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన కనుమూశారు. దేశవ్యాప్తంగా జర్నలిజం, సినీ, టూరిజం, పర్యాటక రంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆయన మరణ వార్త విని యావత్ తెలుగు జాతి చలించిపోయింది. జర్నలిజం ద్వారా ఎంతో మంది యువతకు ఆయన మార్గదర్శకుడిగా నిలిచారు. అంతే కాకుండా తెలుగు భాష పరిరక్షణ కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలను సైతం చేపట్టారు.

తన చివరి శ్వాస వరకు తెలుగుజాతి కోసం రామోజీ రావు నిర్వీరామంగా పనిచేశారు. భౌతికంగా ఆయన దూరమైన దేశంలోనే తెలుగు జాతి గర్వించదగ్గ విధంగా తనదైన ముద్ర వేశారు. సైకిల్‌పై పేపర్ వేసే స్థాయి నుంచి ఓ మీడియా సంస్థను స్థాపించి అత్యున్నత శిఖరాలకు ఎదిగిన ఆయన జీవితం యువతకు ఎంతో ఆదర్శం. ఎంత ఎదిగినా ఆయన ఎప్పుడు ఒదిగి ఉండేవారు.

Ramoji-Rao-Innova-Crysta

ప్రస్తుత కాలంలో ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు, సినీ తారలు ఎంతోమంది సెలబ్రిటీలు కోట్లలో సంపాదిస్తూ లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడుతున్నారు. కానీ ఆయన కొన్ని కోట్లకు అధిపతి అయినా ఏనాడు లగ్జరీ జీవితాన్ని కోరుకోలేదు. జీవితాంతం వీటన్నింటికీ ఆయన చాలా దూరంగా ఉండేవారు. కేవలం ఫిలింసిటీలోని అత్యంత విలాసవంతమైన భవంతి మాత్రమే ఆయన కలిగి ఉన్నారు. ఆయన జీవితమంతా అక్కడే గడిచింది.

రామోజీ రావుకి కార్లంటే ఆసక్తి ఉండేది కాదు. కేవలం రోజువారి ప్రయాణం కోసం మాత్రమే ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో కారులో ప్రయాణం చేసేవారు. లగ్జరీ కార్లలో ప్రయాణిస్తూ జీవితాన్ని ఆస్వాదించే అవకాశం ఉన్నా కానీ ఆయన చూపు లగ్జరీకారుల వైపు వెళ్లలేదు. తన చివరి రోజుల్లో ఆయన ఎన్నోవా క్రిస్టా కారులో ప్రయాణం చేశారు. ఆయనకు కార్లపై ఎక్కువ మమకారం లేదు.

Ramoji-Rao-Lifestyle

ఆయన ఎక్కువ ఆఫీస్‌ పనులకు మాత్రమే పరిమితం అయ్యేవారు. అందువల్లే ఆఫీస్‌ ప్రయాణాల కోసం తప్పా ఆయన ఎక్కువ కార్లలో కనిపించే వారు కాదు. ముఖ్యంగా రామోజీ ఫిలిం సిటీలోనే కార్యాలయానికి ఇంటికి ఆయన ప్రయాణించేవారు. దీంతో పాటు ఆయన ఇంటి ముందు హెలిప్యాడ్‌ సౌకర్యం కూడా ఉంది. అయితే అది ప్రముఖులు ఫిలిం సిటీకి వచ్చేందుకు నిర్మించినట్లు సమాచారం.

పాత్రికేయ వృత్తి, సంస్థకు చెందిన పలు కంపెనీల పర్యవేక్షణలతో పాటు ఇతర సామాజిక సేవా కార్యకలాపాలపైనే ఆయన ఎక్కువగా ఫోకస్‌ చేసేవారు. ఆయన జీవితాంతం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా గడిపారు. 80 ఏళ్ల వయసులోనూ సంస్థకు చెందిన పలు విభాగాల ఆఫీస్‌లకు వెళ్లి ఆయన రివ్యూ చేసేవారు. దీంతో కార్లపై లాంగ్‌ డ్రైవ్‌ లేదా టూర్‌లకు వెళ్లేందుకు ఆసక్తి చూపేవారు కాదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆయన బయట కనిపించారు.

ఆయన కుటుంబీకులు సైతం ఎటువంటి లగ్జరీ కార్లను కలిగి లేరని తెలిసింది. ఏదైనా సంస్థకు చెందిన కార్యకలాపాల్లో పాల్గొనడం ఇతర సేవా కార్యక్రమాల్లో తప్పా వారు కూడా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా జీవిస్తున్నారు. వీరి కుటుంబం వార్తల్లో కనిపించడం చాలా తక్కువ. శ్రేయాస్‌ మీడియాకు సంబంధించిన ఈవెంట్స్‌లో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. రామోజీ రావుకి ఉన్న ఖ్యాతిని వీరి కుటుంబం పరిరక్షిస్తుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, June 9, 2024, 8:10 [IST]
English summary
Ramoji rao dont like cars he used travel for only office purposes
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+