వామ్మో! కోట్లు ఖర్చు చేసిన కారులో స్టార్ హీరో అదిరిపోయే ఎంట్రీ.. దీని ధర ఎంతో తెలిస్తే షాక్..!
బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రణబీర్ కపూర్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడల్ కారు లాంచ్ అయిందంటే చాలు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుని తనకు నచ్చినట్లయితే వెంటనే గ్యారేజీలోకి తెచ్చుకుంటారు. ప్రముఖ హీరోయిన్ అలియా భట్‌ను వివాహం చేసుకుని ఫ్యామిలి లైఫ్‌ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ దంపతులకు ఒక పాప కూడా ఉంది. ఈ ముగ్గురు ఇటీవల కాలంలో చాలా సార్లు బయట కనిపిస్తూ కెమెరాల కంట పడ్డారు. ఇదిలా ఉంటే రణబీర్ కపూర్ తాజాగా కొత్త లగ్జరీ కారును కొనుగోలు చేశారని సమాచారం. ఇప్పటికే ఆయన వద్ద కోట్లు విలువ చేసే టాప్ బ్రాండ్‌లకు చెందిన కార్లు ఉండగా, ఇప్పుడు ఈ జాబితాలోకి మరో కారు వచ్చి చేరింది.
ఆయన కొనుగోలు చేసిన మోడల్ మెర్సిడెస్ బెంజ్ ఎస్‌ఎల్55 ఏఎమ్‌జీ(Mercedes Benz SL55 AMG). దీని ధర ఇండియాలో దాదాపు రెండున్నర కోట్ల వరకు(ఎక్స్-షోరూమ్) ఉంటుందని తెలుస్తుంది. ఆన్‌రోడ్ అయితే రూ.3 కోట్ల వరకు ఉంది. ఇది 2+2 సీటింగ్ కాన్ఫిగరేషన్‌తో కన్వర్టిబుల్ కార్. తాజాగా ఈ లగ్జరీ కారుతో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కారులో నుంచే ఆయన అభిమానులకు అభివాదం చేశారు.

ఖరీదైన కారులో వచ్చినా తన కోసం రోడ్డు పక్కన నిలబడి ఉన్న వారి కోసం విండో ఓపెన్ చేసి మరి చేతులు ఊపారు. మెర్సిడెస్ బెంజ్ ఎస్‌ఎల్55 ఏఎమ్‌జీ చాలా శక్తివంతమైన ఇంజిన్‌ను కలిగి ఉంది. . ఈ కారులో 4.0 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్ ఉంది. ఇది 476 hp శక్తిని, 700 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఇంజిన్‌కు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సెటప్‌ను జత చేశారు. ఇది ప్రధానంగా 4-స్పీడ్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ లగ్జరీ కారు టాప్ స్పీడ్ 295 కి.మీగా ఉంది. ఇది కేవలం 3.9 సెకన్లలో సున్నా నుండి 100 కి.మీ వేగాన్ని చేరుకుంటుంది. ఇంత భారీ ధరను పెట్టి కొనుగోలు చేయడం అంటే సాధారణ ప్రజలకు సాధ్యం కాదు.

ధనవంతులు,సెలబ్రిటీలు వంటి వారు మాత్రమే ఇన్ని కోట్ల కారును కొనుగోలు చేయగలరు. లగ్జరీ పేరుకు తగ్గట్టుగానే ఈ కారులో అధునాతన టెక్నాలజీతో కూడిన ఫీచర్స్, సదుపాయాలు ఉన్నాయి. లోపల అన్ని స్మార్ట్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి. క్యాబిన్ చాలా అందంగా ఉంటుంది. ప్రయాణికుల భద్రతకు సంబంధించి అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో కూడిన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ప్రమాదాల సమయంలో ప్రయాణికులకు మెరుగైన రక్షణ లభిస్తుంది.
రణబీర్ నికర విలువ ఆస్తి విలువ కొన్ని కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. సినిమాల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తూనే పలు వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టి ఉండవచ్చు, అలాగే వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా భారీగానే ఆర్జిస్తున్నారు. ఇటీవల ముంబైలోని ఖరీదైన ప్రాంతం బాంద్రాలో ఒక ఇంటిని కూడా కట్టుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








