100 రూపాయలు కడితే చాలు.. రూ.76 లక్షలు విలువ చేసే రేంజ్ రోవర్ కారు గెలుచుకోవచ్చు..!! ఎక్కడ? ఎలా??

కారు కొనాలంటే కనీసం రూ. 5 లక్షలైనా కావాలి. లగ్జరీ కారును కొనుగోలు చేయాలంటే మినిమిమ్‌ రూ. 50 లక్షలైనా ఖర్చు పెట్టాల్సిందే.. కానీ ఇక్కడ మీరు రూ. 100కే కారు కొనుగోలు చేయొచ్చు...

కారు కొనాలనేది జీవితంలో ప్రతి ఒక్కరి కల.. అందుకే చాలా మంది తమ జీవిత కాల పొదుపులో కొంత సొమ్ముతో కుటుంబ, వ్యక్తిగత అవసరాల కోసం కారు కొనుగోలు చేస్తారు. కానీ లగ్జరీ కారు అనేది ప్రముఖులు, సెలబ్రిటీలు, ధనవంతుల దగ్గర మాత్రమే ఉంటుందని మనకి తెలిసిందే. కానీ మీరు ప్రయత్నిస్తే రూ. 100 కే రూ. 76 లక్షల విలువైన రేంజ్‌ రోవర్‌ కారును సొంతం చేసుకోవచ్చు.

Range-Rover-Car-At-Rs.100

అస్సోంలోని హౌలీలో ప్రతి ఏటా రాస్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈ ఏడాది నిర్వహించే 96వ హౌలీ రాస్ ఫెస్టివల్‌ సందర్భంగా నిర్వాహక కమిటీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. లాటరీ సిస్టమ్‌ ద్వారా ఖరీదైన లగ్జరీ కార్లను బహుమతిగా అందించనుంది. లాటరీ గెలుచుకున్న వారికి రేంజ్‌ రోవర్‌, టయోటా ఫార్చ్యూనర్‌, స్కార్పియో లాంటి ఖరీదైన కార్లను అందిస్తుంది.

మొదటి బహుమతి కింద అందించే రేంజ్‌ రోవర్‌ ఖరీదు రూ. 76 లక్షలు కాగా.. రెండో బహుమతి రూ. 50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్‌ కాగా తర్వాత బహుమతుల కింద స్కార్పియో, స్కోడా కుచక్‌, నెక్సాన్‌ ఉన్నాయి. కాగా ఈ బహుమతులు గెలుచుకునేందుకు ఒక్కో లాటరీ టికెట్‌ ధర రూ. 100 గా నిర్వాహక కమిటీ నిర్ణయించింది.

Range-Rover-Car-At-Rs.100

అస్సోంలోని హోలీలో ఏటా రాస్‌ పండుగను నిర్వహిస్తారు. 95 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో భాగంగా పండుగకు ముందు ఘనంగా లాటరీ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రతి ఏటా నిర్వహించే ఈ లాటరీ ఈవెంట్‌లో గెలుపొందిన విజేతలకు లగ్జరీ కార్లను బహుమతిగా అందిస్తారు. ఈ లాటరీ విషయం తెలియగానే కొనుగోలు చేసేందుకు హౌలీలోని గిఫ్ట్‌ కూపన్‌ కార్యాలయాలకు జనం బారులు తీరుతున్నారు.

కాగా ఈ ఈవెంట్‌లో గెలుపొందిన లాటరీ విజేతలను డిసెంబర్‌ 10న ప్రకటించనున్నారు. ఈ ఈవెంట్‌లో టికెట్ల విక్రయం ద్వారా సేకరించిన మొత్తాన్ని బహుళ ప్రాజెక్టులలో ఉపయోగిస్తారు. శ్రీకృష్ణ, రాధల మధ్య ప్రేమకు ఈ పండుగను అంకితం చేస్తారు. హిందూ క్యాలెండర్‌ ప్రకారం ప్రతీ యేటా పూర్ణిమ తిథిలో జరుపుకొంటారు. ఈ ఏడాది నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 వరకు రాస్‌ పండుగను నిర్వహిస్తారు.

Range-Rover-Car-At-Rs.100

గతేడాది నిర్వహించిన ఈవెంట్‌లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి కింద ఆడి కారును ఇచ్చారు. ఉత్తర గౌహతికి చెందిన అస్సాం పోలీసు అధికారి జనార్దన్ బోరో దీనిని గెలుచుకున్నారు. కాగా 2022లో లాటరీ కమిటీ 3.2 లక్షల టిక్కెట్లను విక్రయించగా.. ఈ ఏడాది 4 లక్షల టిక్కెట్లను విక్రయించనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, October 26, 2023, 10:57 [IST]
English summary
Range rover car worth rs 76 lakh just for rs 100 here you should know how
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+