రేంజ్ రోవర్ ఎవోక్ లగ్జరీ కారుకు ఏ మాత్రం తీసిపోని మోడిఫైడ్ మారుతి బ్రిజా

మారుతి బ్రిజా ఎస్‌యూవీని ఎంతో చక్కగా రేంజ్ రోవర్ ఎవోక్ రూపంలోకి మార్చేశారు. డ్యూయల్-టోన్ బాడీ పెయింట్ మరియు పలు స్ట్రైట్ లైన్స్ ద్వారా అచ్చం రేంజ్ రోవర్ ఎవోక్ తరహాలో ఉంటుంది.

By Anil Kumar

గత రెండు దశాబ్దాలలో ప్యాసింజర్ కార్ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ మధ్య కాలంలో లగ్జరీ కార్ల సేల్స్ కూడా బాగానే పెరిగిపోయాయి. అయితే, లగ్జరీ కార్లను కొనుగోలు చేసే స్థోమత లేని కస్టమర్లు తమ దగ్గర ఉన్న సాధారణ కార్లకు పలు మోడిఫికేషన్స్ నిర్వహించి, కంపెనీలు సైతం బోల్తా కొట్టేలా ఖరీదైన కార్ల రూపంలోకి మార్చేస్తున్నారు.

ఇందుకొక సరైన ఉదాహరణ రేంజ్ రోవర్ ఎవోక్ రూపంలోకి మారిపోయిన మారుతి సుజుకి వితారా బ్రిజా. నమ్మశక్యంగా లేదు కదూ... అయితే, ఈ స్టోరీ ఖచ్చితంగా చదవాల్సిందే...!!

రేంజ్ రోవర్‌నే బోల్తా కొట్టించిన మోడిఫైడ్ మారుతి బ్రిజా

ఏ మాత్రం అనుమానం రాకుండా ఎంతో చక్కగా రేంజ్ రోవర్ ఎవోక్ రూపంలోకి మార్చేశారు. డ్యూయల్-టోన్ బాడీ పెయింట్ మరియు పలు స్ట్రైట్ లైన్స్ ద్వారా అచ్చం రేంజ్ రోవర్ ఎవోక్ తరహాలో ఉంటుంది. కానీ, ఎవోక్ కార్లను ఎక్కువగా చూసిన కళ్లయితే వెంటనే కనిపెట్టేస్తాయి.

రేంజ్ రోవర్‌నే బోల్తా కొట్టించిన మోడిఫైడ్ మారుతి బ్రిజా

రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీలో ఉన్న ఫ్రంట్ గ్రిల్‌తో పాటు ఎవోక్ రూపాన్ని పోలి ఉండేందుకు డిజైన్ పరంగా ఎక్ట్సీరియర్‌లో ఎన్నో కస్టమైజేషన్ పనులు జరిగాయి. ఎవోక్ తలపించేందుకు ఫ్రంట్ డిజైన్‌లో జోడించిన ఫ్రంట్ గ్రిల్, హెడ్ ల్యాంప్స్ మరియు ఫ్రంట్ అసలైన మారుతి వితారా బ్రిజా రూపాన్ని పూర్తిగా మార్చేశాయి.

రేంజ్ రోవర్‌నే బోల్తా కొట్టించిన మోడిఫైడ్ మారుతి బ్రిజా

ఫ్రంట్ బానెట్‌ను కూడా ఎలాంటి అనుమానం రాకుండా మార్చేశారు. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, వితారా బ్రిజా అసలైన రూపాన్ని ఏమార్చి స్పోర్టివ్ మరియు లగ్జరీ ఫీల్ కలిగించే మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ కళ్లను కనువిందు చేస్తాయి. మరింతగా ఆకర్షించేందుకు ఫ్రంట్ వీల్స్ లోపలి వైపున చాటుగా కనిపించే బ్రేక్ కాలిపర్లు ఎరుపు రంగును పులుముకున్నాయి.

రేంజ్ రోవర్‌నే బోల్తా కొట్టించిన మోడిఫైడ్ మారుతి బ్రిజా

మారుతి వితారా బ్రిజా ఎస్‌యూవీ ఎక్ట్సీరియర్‌లో ఓవరాల్‌గా తెలుపు మరియు నలుపు రంగుల మేళవింపుతో డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ అందించారు. బాడీ మరియు రూఫ్‌ను వేరు చేసే పిల్లర్లను అదే విధంగా రూఫ్ టాప్‌ను బ్లాక్ కలర్‌లో మరియు బాడీ మొత్తాన్ని వైట్ పెయింట్‌ ఫినిషింగ్ చేశారు.

రేంజ్ రోవర్‌నే బోల్తా కొట్టించిన మోడిఫైడ్ మారుతి బ్రిజా

ఎవోక్ లగ్జరీ ఎస్‌యూవీ రియర్ డిజైన్‌ను తలపించేలా మారుతి బ్రిజా ఎస్‌యూవీ రియర్ డిజైన్‌లో ఉన్న ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ మరియు టెయిల్ గేట్‌ను జోడించారు. పూర్తి స్థాయిలో ఎవోక్ మోడల్‌ను పోలి ఉండేందుకు బ్రిజా రియర్ బంపర్ తొలగించి అసలైన ఎవోక్ బంపర్‌ను అందివ్వడం జరిగింది.

రేంజ్ రోవర్‌నే బోల్తా కొట్టించిన మోడిఫైడ్ మారుతి బ్రిజా

ఎక్ట్సీరియర్ పరంగా రేంజ్ రోవర్ ఎవోక్ కారుతో పోటీ పడేలా మారుతి బ్రిజా ఎస్‌యూవీని మోడిఫై చేశారు. కానీ, ఇంటీరియర్ పరంగా జరిపిన కంప్లీట మోడిఫికేషన్ వివరాలు తెలియరాలేదు. అయితే, దీనికి సంభందించిన వీడియోలో క్యాబిన్ అప్‌హోల్‌స్ట్రే మరియు డ్యాష్‌బోర్డులో రెడ్ కలర్ ఫినిషింగ్ గమనించవచ్చు.

రేంజ్ రోవర్‌నే బోల్తా కొట్టించిన మోడిఫైడ్ మారుతి బ్రిజా

మారుతి సుజుకి వితారా బ్రిజా ఎస్‌యూవీలో డిజైన్ పరంగా భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకున్నప్పటకీ సాంకేతికంగా ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు. మోడిఫైడ్ వితారా బ్రిజా ఎస్‌‌యూవీలో 1.3-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల టుర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ ఉంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 9బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఒక సాధారణ మారుతి వితారా బ్రిజా ఎస్‌యూవీని 50 లక్షలు పైబడి ధర కలిగిన రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీగా మార్చేందుకు కస్టమైజేషన్ బృందం తీవ్రంగానే శ్రమించింది. మోడిఫైడ్ వితారా బ్రిజాను వీడియో ద్వారా వీక్షించగలరు.

Source: MODIFIED CARS

Most Read Articles

English summary
Read In Telugu: Range Rover Evoque that’s actually a Maruti Brezza
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X