నర్‌బర్గ్‌రింగ్ రికార్డ్ బ్రేక్ చేసిన రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్
ఎస్‌యూవీలు స్పోర్ట్స్ కార్ల మాదిరిగా వేగంగా వెళ్లవు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ ఈ వీడియో చూసిన తర్వాత, మీరు ఈ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఎందుకంటే, కార్ మేకర్లు ఇప్పుడు తమ ఎస్‌యూవీలు కూడా రేస్ కార్ల మాదిరిగా పరుగులు తీయగలవని నిరూపిస్తున్నాయి.
ఇది కూడా చూడండి: చేతులు లేకున్నా కాళ్లతోనే కారు నడిపేస్తాడు
బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ ల్యాండ్ రోవర్ తయారు చేసిన రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ మోడల్‌ను ప్రపంచంలో కెల్లా అత్యంత పాపులర్ అయిన నర్‌బర్గ్‌రింగ్‌పై టెస్ట్ చేశారు. నర్‌బర్గ్‌రింగ్‌పై ఫాస్టెస్ట్ ప్రొడక్షన్ ఎస్‌యూవీగా రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ రికార్డు సృష్టించింది. కేవలం 8 నిమిషాల 14 సెకండ్లలో ఈ రికార్డును సాధించింది.
ఈ కారులో పవర్‌ఫుల్ 5.0 లీటర్, వి-8 సూపర్‌చార్జ్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 542 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 13 మైళ్ల దూరం, 70కి పైగా మలుపులు ఉన్న ఈ ట్రాక్‌పై ఓ ఎస్‌యూవీ అతి తక్కువ సమయంలో ఈ రికార్డును బ్రేక్ చేయటం అనేది తమ వాహనాల సామర్థ్యాన్ని రుజువు చేస్తోందని ఛీఫ్ ఇంజనీర్ వెహికల్ ఇంటిగ్రిటీ మైక్ క్రాస్ అన్నారు. మరి ఆ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/xV07UXpfmpY?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








