లాక్‌డౌన్ ఎఫెక్ట్ : నిత్యావసరాలు డోర్ డెలివరీ చేయనున్న రాపిడో
కరోనా వైరస్ ఎక్కువగా విస్తరిస్తున్న కారణంగా భారతదేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జరీ చేసింది. భారత్ లాక్‌డౌన్ కారణంగా దేశంలో దాదాపు అన్ని వాహన సేవలు నిలిపివేయబడ్డాయి. దేశ వ్యాప్తంగా వాహన సేవలను నిలిపివేయడంతో సాధారణ ప్రజలు నిత్యావసరాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రజల యొక్క నిత్యావసరాలను తీర్చడానికి రాపిడో సంస్థ ఒక అడుగు ముందుకు వేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ మీ కోసం..

బైక్ మరియు టాక్సీ సేవా సంస్థ అయిన రాపిడో కర్ణాటక, ఢిల్లీ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో అవసరమైన వస్తువులను సరఫరా చేస్తుంది. దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్న సమయంలో ఈ సంస్థ అవసరమైన వస్తువులను డోర్ డెలివరీ చేస్తుంది.

రాపిడో తన పంపిణీ భాగస్వాములతో ఒక లింక్ ఏర్పాటు చేసుకుని డెలివరీ చేయడం ప్రారంభించింది. రాపిడో అవసరమైన వస్తువుల సరఫరాలో ఢిల్లీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది. డిసిపిసి నోడ్ కింద వెనుకబడిన ప్రాంతాల్లో పాలు మరియు పుడ్ ప్యాకెట్లను పంపిణీ చేస్తోంది.

రాపిడో 16,000 స్థానిక కిరాణా దుకాణాలు మరియు వైద్య దుకాణాలతో భాగస్వామ్యం ఏర్పరచుకుని అవసరమైన వస్తువులను ఇంటికి సరఫరా చేస్తోంది. హోమ్ డెలివరీని పొందాలనుకునే వినియోగదారులు 080-61914960 కు కాల్ చేయడం ద్వారా లేదా SMS పంపడం ద్వారా నిత్యావసర వస్తువులను బుక్ చేసుకోవచ్చు.

లాక్ డౌన్ సమయంలో అవసరమైన వస్తువులను పంపిణీ చేయడానికి రాపిడో బిగ్ బాస్కెట్, బిగ్ బజార్ మరియు స్పెన్సర్ వంటి సంస్థలతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.

డ్రైవర్ల సహాయంతో రాపిడో పెద్ద దుకాణాల నుండి గృహ వస్తువులను కూడా పంపిణీ చేస్తుంది. రాపిడో దేశంలోని దాదాపు 90 నగరాల్లో ఈ సేవను ప్రారంభిస్తోంది. ఈ సేవను అందించడానికి కంపెనీ డ్రైవర్లలో 70% అందుబాటులో ఉన్నారని రాపిడో ప్రకటించింది.

రాపిడో తన పంపిణీ సేవలను విస్తరించడానికి గ్రోఫర్స్, డన్జో, ఫ్రెష్‌హోమ్‌లతో భాగస్వామ్యం చేసుకునే అవకాశం ఉంది. రాపిడో తన భాగస్వాములకు మరియు వినియోగదారులకు అవసరమైన వస్తువుల డోర్ డెలివరీ చేయడానికి ఎక్స్ట్రా అమౌంట్ వసూలు చేయదని తెలిపింది.

ఇటీవల కాలంలో ఫ్లిప్‌కార్ట్ మరియు ఉబర్ కాబ్ లాక్‌డౌన్ సమయంలో అవసరమైన వస్తువులను పంపిణీ చేయడానికి హోమ్ డెలివరీతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. అంతే కాకుండా వైద్యులకు సహాయంగా ఓలా కూడా దాదాపు 500 క్యాబ్లను వినియోగించడం అందరికి తెలిసిన విషయమే. భారతదేశం మొత్తం లాక్ డౌన్ వున్న సమయంలో ఇలాంటి సంస్థలు సాధారణ ప్రజల నిత్యావసరాలు తీర్చడానికి ముందుకు వచ్చాయి.


Click it and Unblock the Notifications








