హైదరాబాద్‌లో ర్యాపిడో బైక్‌ డ్రైవర్‌ కష్టాలు.. పెట్రోల్‌ అయిపోయినా స్కూటీ దిగని కస్టమర్‌.. చివరకు ఏం చేశాడంటే!

ర్యాపిడో రైడ్‌ బుకింగ్‌(Rapido Bike Taxi).. ఆ బైక్‌ రైడర్‌కు తీవ్ర కష్టాలు తెచ్చిపెట్టింది. చంటిపిల్లను ఎత్తుకుని జాగ్రత్తగా తీసుకెళ్లినట్లుగా.. కస్టమర్‌ను స్కూటీపై కూర్చోబెట్టి బండిని లాగాల్సి వచ్చింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోనే జరిగింది. అదేంటి బైక్‌ను లాగడమేంటి అనుకుంటున్నారా.. పూర్తి స్టోరీ ఇక్కడ చదివేయండి..

జంటనగరాల వాసుల జీవితంలో ఓలా, ర్యాపిడో, ఉబర్‌ అంతర్భాగమయ్యాయి. క్యాబ్‌ బుకింగ్‌తో పాటు, ఆటోలు, బైక్‌ల ద్వారా కస్టమర్లకు సేవలందిస్తున్నాయి. ఈ క్రమంలో సింగిల్‌ ప్యాసింజర్లు, త్వరగా గమ్యస్థానానికి చేరాలి అనుకునేవారు.. ఎక్కువగా బైక్‌ ట్యాక్సీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని ద్వారా చాలా మంది యువతకు కూడా లభిస్తోంది.

Rapido-Bike-Rider-Forced-To-Push-Bike

కొంతమంది బైక్ ట్యాక్సీని పార్ట్‌ టైం జాబ్‌గా(Rapido Bike Rider Viral Video) చేసుకుంటూ నిత్యావసర ఖర్చులు చూసుకుంటున్నారు. తద్వారా ఆర్థికంగా వారికి కొంత ఉపశమనం లభిస్తోంది. బైక్‌ ట్యాక్సీ ఛార్జీలు కూడా తక్కువగా ఉండటంతో నగరాసులు కూడా దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలకు ఈ బైక్‌ ట్యాక్సీ సేవలు విస్తరించాయి.

ఈ క్రమంలో ర్యాపిడో బైక్‌ ట్యాక్సీ సర్వీస్‌ ద్వారా ఉపాధి పొందుతున్న ఓ యువకుడికి.. ఓ రైడ్‌ తీవ్ర తలనొప్పిని తెచ్చిపెట్టింది. అంతేకాకుండా ఎండలో రోడ్డుపై బండిని లాగాల్సి వచ్చింది. ఈ సంఘటనను కొందరు తమ సెల్‌ఫోన్లలో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అవుతోంది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..

Rapido-Bike-Rider-Forced-To-Push-Bike

హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ర్యాపిడో బైక్(Hyderabad Rapido Rider Pushing Bike) బుక్ చేసుకోగా.. సదరు రైడర్‌ అతడిని ఎక్కించుకుని గమ్యస్థానానికి తీసుకెళ్తున్నాడు. కాగా దురదృష్టవశాత్తు మార్గమధ్యలో స్కూటీలో పెట్రోలు అయిపోయింది. దీంతో ప్రయాణికుడిని రైడర్‌ రిక్వస్ట్‌ చేశాడు. బండి దిగి సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ వద్దకు నడుచుకుంటూ రావాలని.. పెట్రోల్‌ ఫిల్‌ చేశాక రైడ్‌ స్టార్ట్‌ చేస్తానని చెప్పాడు.

అయితే ఇందు(Rapido Bike Rider Pushing Bike)కు ప్రయాణికుడు అంగీకరించలేదు. బతిమిలాడినప్పటికీ అతడు ఒప్పుకోకపోవడంతో.. వేరే మార్గం లేక ప్రయాణికుడిని స్కూటీపైనే కూర్చోబెట్టుకుని పెట్రోల్‌ బంక్‌ వద్దకు తోసుకుంటూ వెళ్లాడు. ఈ సంఘటనను అదే మార్గంలో వెళ్తున్న కొందరు రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో క్షణాల్లో వైరల్‌ అయిపోయింది.

Rapido-Bike-Rider-Forced-To-Push-Bike

ఓ వైపు వేసవి మొదలవకపోయినా ఎండలు మండిపోతుండటంతో ఆ ఎండలోనే కస్టమర్ కూర్చున్న స్కూటీని లాక్కెళ్లాడు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కామెంట్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో నెట్టింట్లో ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

స్కూటీలో పెట్రోలు అయిపోయిందని, ప్రయాణికుడిని దిగాలని రైడర్‌ పలుమార్లు అభ్యర్థించినా దిగని వ్యక్తి కొందరు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బైక్‌ ట్యాక్సీకి ఇచ్చే 20 రూపాయలకు ఇంత శిక్ష అవసరమా అని మండిపడ్డారు. సాటి మనిషిపై ఇలా ప్రవర్తించడం న్యాయం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాగా మరికొందరు ప్రయాణికుడికి మద్దతుగా మాట్లాడారు. రైడ్‌కు వెళ్లేముందు బైక్‌లో పెట్రోల్‌ ఉందో లేదో చూసుకోరా అని ప్రశ్నించారు. సరిపడా పెట్రోల్‌ ఉందో లేదో ముందుగానే చూసుకోవాలని.. ఆ బాధ్యత అతనిదే అని కామెంట్‌ చేశారు. దీంతో ఇరు వర్గాల వాదనలతో టాపిక్‌ కాస్తా హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ వైరల్‌ వీడియో మీరూ చూసేయండి..

More from DriveSpark

Article Published On: Wednesday, February 14, 2024, 9:14 [IST]
English summary
Rapido rider forced to push bike onboard with customer in hyderabad viral video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+