Seat Belts ఇకపై ఆటోలలో సీటు బెల్ట్స్.. రాపిడో సంచలన నిర్ణయం

ప్రముఖ ఆటో రెంట్ సంస్థ రాపిడో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సరికొత్త నిర్ణయం తీసుకుంది. తమ రెంట్ ఆటోలలో ప్రయాణించే వారి కోసం సీట్ బెల్ట్ లను బిగిస్తున్నట్లు చెప్పింది. ప్రయాణికులకు సురక్షితమైన అనుభవాన్ని కల్పించేందుకు ఈ చర్య దోహద పడుతుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. బెంగళూరులో తొలుత ఈ సౌకర్యాన్ని రాపిడో అమలు చేస్తుంది.

నిత్యం రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఆటో ఆకస్మాత్తుగా ఆగిపోవడం లేదా ఢీకొన్న సందర్భాల్లో ఇవి ఉపయోగపడతాని తెలిపింది. తీవ్రమైన ప్రమాదాలలో మరణాలను, గాయాలను తగ్గించేందుకు ఇది ఉపకరిస్తుందని సంస్థ తెలిపింది. అనుకోని సందర్భాల్లో జరిగే ప్రమాదాల నుంచి ప్రయాణికులను సురక్షితంగా కాపాడటం తమ ముఖ్య లక్ష్యమని సంస్థ పేర్కొంది.

seat belts in autos

వీటితో పాటు ప్రయాణీకుల భద్రత కోసం తన కంపెనీ హైర్ చేసుకున్న డ్రైవర్ కెప్టెన్ల వివరాలను ఫోర్ స్టెప్ వెరిఫికేషన్ ద్వారా ధృవీకరిస్తుంది. దీంతో సులభంగా వారిని ట్రాక్ చేయడంతో పాటు సకాలలంలో స్పందించేలా సిస్టమ్ ని రాపిడో కలిగి ఉంది. దీంతో పాటు ముఖ్యంగా మహిళా రైడర్‌ల కోసం, వారి గోప్యత, గుర్తింపు వంటి సేఫ్టీ మెజర్స్ ని కలిగిన ప్రత్యేక ఇన్ఫర్మేషన్-మాస్కింగ్ ఫీచర్‌ను ఉపయోగిస్తుంది.

యాప్ లోని లైవ్ ట్రాకింగ్ తో డేటాను యాక్సెస్‌ చేయనుంది. షేర్డ్ రైడ్‌ల కోసం రౌండ్-ది-క్లాక్ ఆన్-గ్రౌండ్ సపోర్ట్‌ను కూడా సంస్థ అందిస్తుంది. ఎమర్జెన్సీ ఫీచర్స్ మరెన్నో అధునాతన సౌకర్యాలను యాప్ లో కల్పించింది. దీని ద్వారా రైడర్ నిశ్చింతగా తన ప్రయాణాన్ని సాగిస్తాడని రాపిడో వివరించింది. రైడర్ తాము సేఫ్ జోన్ లో ఉన్నరానే ఫీలింగ్ ని కల్పించేందుకు అన్నీ చర్యలు ఉన్నట్లు పేర్కొంది.

రాపిడో యాప్ సేఫ్టీ ఫీచర్ల ద్వారా ప్రయాణీకులు తమ రైడ్ లో సురక్షిత అనుభూతిని పొందుతారని రాపిడో ఆటో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి తెలిపారు. ప్రయాణీకులు కెప్టెన్‌లకు సురక్షితమైన ప్రయాణాన్ని సులభతరం చేయడానికి Rapido Auto తన యాప్‌లో అనేక ఇతర భద్రతా చర్యలను అమలు చేసిందని ఆయన వివరించారు.

రాపిడో డ్రైవర్లందరికీ లెర్నింగ్ మాడ్యూల్ సిస్టమ్ తో పాటు ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ లెర్నింగ్, కస్టమర్-తగిన ప్రవర్తన, రహదారి భద్రత శిక్షణ వంటి పరీక్షలను పూర్తి చేయడం తప్పనిసరి అని కంపెనీ పేర్కొంది. ఇవి పూర్తి చేసిన తర్వాతే కెప్టన్లకు అనుమతి మంజూరు చేస్తున్నట్లు వివరించింది. దీని వల్ల రైడింగ్ సమయాల్లో వారికి పూర్తి అవగాహన పెరిగి తక్షణ చర్యలకు సహకరిస్తుందని వెల్లడించింది.

రాపిడో గతంలోనూ సిటీ ట్రాఫిక్ పోలీసు విభాగాలతో కలిసి దేశవ్యాప్తంగా భద్రతా అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమాలలో డ్రైవర్లకు CPR ప్రాథమిక లైఫ్ సపోర్టు శిక్షణతో పాటు గుర్గావ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, మదురై వంటి నగరాల్లోని భారీ ట్రాఫిక్ జంక్షన్‌ల వద్ద రోడ్డు భద్రతపై అహగాహన కల్పించే మైమ్ ప్రోగ్రామ్‌లను కూడా నిర్వహించింది.

దేశంలో రహదారి భద్రత ఒక ప్రధాన సవాలుగా కొనసాగుతోందని గుంటుపల్లి అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని రోడ్డు భద్రతా కార్యక్రమాలను నిర్వహించేందుకు పోలీసులు అనుబంధ వాటాదారులతో సహకరించడం కొనసాగిస్తామని రాపిడో తెలిపింది. ప్రమాదాలను నివారించడంతో తమవంతు సహకారంతో పాటు అన్ని విధాలా పోలీసులతో కలిసి పనిచేస్తామని వివరించింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, April 22, 2023, 11:42 [IST]
English summary
Rapido seat belts introduced in bangalore for passengers safety
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+