నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు కలిసొచ్చిన లక్.. తన టయోటా వెల్ ఫైర్ చూశారా.. ఎంత లగ్జరీగా ఉందో ?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) అంటే చాలు దేశవ్యాప్తంగా యువత హృదయాల్లో ఓ వైబ్రేషన్. తన అందంతో దేశం మొత్తం తన మాయలో పడేసుకుంది. రష్మిక, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని నిత్యం పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటోను విజయ్ దేవరకొండ తీసిందే అని ప్రచారం జరుగుతుంది. ఈ పుకార్ల మధ్య రష్మిక ఎయిర్ పోర్టుకు వచ్చిన ఒక లగ్జరీ MPV కారుపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. మరి ఆ కారు విశేషాలు ఏంటో వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

Rashmika Mandanna Arrives in a Toyota Vellfire

వరుసగా మూడు రూ.1000కోట్ల సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రష్మిక మందన (Rashmika Mandanna) గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేసిన తర్వాత అది విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తీసినది అనే పుకార్లు జోరందుకున్నాయి. ఈ పుకార్ల మధ్య, రష్మిక ఓ ఎయిర్ పోర్టుకు ఒక కొత్త లగ్జరీ MPV కారులో రావడం అందరి దృష్టిని ఆకర్షించింది.

రష్మికను గతంలో తరచుగా S-క్లాస్ బెంజ్ కారులో చూసేవారు. జర్మన్ బ్రాండ్ విడుదల చేసిన ఈ లగ్జరీ సెడాన్‌ను ఆమె తన కోసం కొనుగోలు చేసుకుందని కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. బహుశా సినిమా యూనిట్ ఆమె ప్రయాణ సౌకర్యం కోసం ఏర్పాటు చేసి ఉండవచ్చని కొందరు అంటున్నారు. రష్మికకు కారు నడపడం వచ్చినా ఆమె బెంజ్ వెనుక సీటులో కూర్చుని వచ్చినట్లు ఫోటోల ద్వారా స్పష్టమైంది.

Rashmika Mandanna

ఇక టయోటా వెల్‌ఫైర్(Toyota Vellfire) విషయానికి వస్తే ఇది సెలబ్రిటీకి చాలా ఇష్టమైన MPVమోడల్. లగ్జరీ, సౌకర్యం, ఆధునిక ఫీచర్లతో నిండిన వాహనం కాబట్టి, సంపన్నులు బాగా ఈ కారును ఇష్ట పడుతుంటారు. ప్రస్తుతం భారతదేశంలో టయోటా వెల్‌ఫైర్ ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర రూ.1.22కోట్లు(ఎక్స్-షోరూమ్). ఈ కారు టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 1.32 కోట్లు(ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఆన్-రోడ్ ధరలు వరుసగా రూ.1.52కోట్లు, రూ.1.64కోట్లుగా ఉంటాయి.

ఈ కారుకు 2.5 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ శక్తినిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 193 PS పవర్, 240 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ e-CVT గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది చాలా ఖరీదైన కారు కాబట్టి లేటెస్ట్ ఫీచర్లకు కొదవ లేదు.

Toyota Vellfire

14-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14-రంగుల ఆంబియంట్ లైటింగ్, 15-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, సన్‌రూఫ్, వైర్‌లెస్ సెల్ ఫోన్ ఛార్జర్ వంటి అనేక అధునాతన ఫీచర్లను జపనీస్ బ్రాండ్ ఈ కారులో అమర్చింది. అందుకే, సెట్ నుంచి సెట్‌కు నిరంతరం ప్రయాణించే సినీ ప్రముఖులు ఈ కారునే సెలక్ట్ చేసుకుంటారు.

భారత మార్కెట్‌లో విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన కార్లలో టయోటా వెల్‌ఫైర్ ఒకటి. లగ్జరీ ఇంటీరియర్‌తో కూడిన ఈ కారు సుదూర ప్రయాణాలకు ఉత్తమం. అందుకే సినీ తారలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు దీన్ని పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. వెల్‌ఫైర్ కజిన్ మోడల్ అయిన లెక్సస్ LM 350h (Lexus LM 350h) అనే ప్రీమియం MPVకి కూడా ఇండియాలో భారీ డిమాండ్ ఏర్పడింది.

Toyota Vellfire

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ మధ్య సంబంధం గురించి పుకార్లు ఉన్నప్పటికీ.. రష్మిక ట్రావెల్, ఆమె సెలక్ట్ చేసుకున్న లగ్జరీ వెహికల్(టయోటా వెల్‌ఫైర్) ఆమెకు ఉన్న స్టార్‌డమ్‌ను, సౌకర్యం పట్ల ఆమెకున్న ప్రాధాన్యతను చాటి చెబుతోంది. ఈ లగ్జరీ MPV సినీ ప్రముఖులకు ఎందుకు ఇంత ఇష్టమో ఈ ఫీచర్లను బట్టి అర్థమవుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, May 30, 2025, 17:58 [IST]
English summary
Rashmika mandanna arrives in a toyota vellfire a new luxury ride for the national crush
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+