రష్మిక మందన్న కార్స్ ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి

దక్షిణ భారత సినీరంగంలో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్ లలో ఒకరు రష్మిక మందన్న. రష్మిక మందన్న తెలుగు మరియు కన్నడ భాషా సినీ నటి. ఇటీవల రష్మిక మందన్న తన 25 వ (ఏప్రిల్ 05) పుట్టినరోజుని జరుపుకుంది. ఈ సందర్భంగా ఈ బర్త్ డే బ్యూటీ వద్ద ఉన్న కార్లను గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

రష్మిక మందన్న కార్స్ ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి

రష్మిక మందన్న 2016 లో కన్నడ భాషలో కిరిక్ పార్టి సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి, చలో సినిమాతో తెలుగుసినిమా పరిశ్రమలోకి రంగప్రవేశం చేసింది. తరువాత అతి తక్కువ కాలంలోనే అగ్ర కథానాయకుల సరసన నటించి చాలా వేగంగా పాపులర్ అయ్యింది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి వాటితో గొప్ప విజయాన్ని సాధించిన ఈ అమ్మడు, ఇప్పుడు అల్లుఅర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో కనిపించనుంది. ప్రస్తుతం ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న కథానాయకిలలో ఒకరు మన రష్మిక మందన్న.

రష్మిక మందన్న కార్స్ ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి

ఇదిలా ఉండగా సాధారణంగా సినీతారలకు లగ్జరీ కార్లపై ఉన్న వ్యామోహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పటికే మనం చాలామంది సెలబ్రెటీల కార్స్ గురించి తెలుసుకున్నాం.. ఇప్పుడు రష్మిక మందన్న వద్ద ఉన్న కార్స్ గురించి తెలుసుకుందాం.

MOST READ:వాహన ధరలు పెంచిన హోండా మోటార్‌సైకిల్.. కానీ ఆ వెహికల్ ధర మాత్రం తగ్గింది

రష్మిక మందన్న కార్స్ ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి

రేంజ్ రోవర్ ఎస్‌యూవీ :

చాలామంది ప్రముఖులు ఈ రేంజ్ రోవర్ కారుని కలిగి ఉన్నారు, అయితే రష్మిక మందన్న ఈ సంవత్సరం ప్రారంభంలో సరికొత్త రేంజ్ రోవర్ ఎస్‌యూవీని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో రష్మిక తన బ్లాక్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీత ఉండటం చూడవచ్చు. ఈ కారు ధర సుమారు ఒక కోటి రూపాయలు.

రష్మిక మందన్న కార్స్ ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి

ఆడి క్యూ 3:

రష్మిక మందన్న వద్ద ఉన్న కార్లలో ప్రముఖ ఆడి బ్రాండ్ యొక్క క్యూ3 ఒకటి. దీనిని 2017 లో కొనుగోలు చేసింది. రష్మిక మందన్న నటి అయినా తరువాత కొన్న మొట్టమొదటి ఖరీదైన కారు. ఆడి క్యూ 3 ధర రూ .33.97 లక్షలతో ప్రారంభమై రూ .43.61 లక్షలకు ఉంటుంది. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది, అంతే కాకుండా మంచి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

MOST READ:ఈ టిప్స్ వాడండి, వాహన దొంగతనాలకు చెక్ పెట్టండి

రష్మిక మందన్న కార్స్ ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి

ఆడి క్యూ 3 లో1.4-లీటర్ టిఎఫ్‌ఎస్‌ఐ యూనిట్ ఫ్రంట్ వీల్ డ్రైవ్‌లో లభిస్తుంది. ఇది అదే 150 పిఎస్ గరిష్ట శక్తిని మరియు 250 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుంది. అంతే కాకుండా ఇందులో ఉన్న 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 184 పిఎస్ శక్తిని మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసింది, ఇది 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్ కి జతచేయబడి ఉంటుంది.

రష్మిక మందన్న కార్స్ ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి

మెర్సిడెస్ బెంజ్- సి క్లాస్:

రష్మిక మందన్న మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ అయిన సి క్లాస్ ని కూడా కలిగి ఉంది. తరచుగా రష్మిక ఇందులోనే కనిపిస్తుంది. ఈ కారు ధర సుమారు రూ .50 లక్షలు. ఈ కారు లేటెస్ట్ ఫీచర్స్ మరియు మంచి పర్ఫామెన్స్ అందిస్తాయి. ఇందులో సేఫ్టీ ఫీచర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి.

MOST READ:మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా; థార్ ఎస్‌యూవీ పొందిన మహ్మద్ సిరాజ్

రష్మిక మందన్న కార్స్ ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి

రష్మిక మందన్న వీటితో పాటు, దేశీయ మార్కెట్లో లభించే రూ. 17 లక్షల ధర కలిగిన టయోటా ఇన్నోవా మాత్రమే కాకుండా, హ్యుందాయ్ క్రెటా వంటి వాటిని కూడా కలిగి ఉంది. రష్మిక మందన్న ఇప్పుడు తెలుగు, కన్నడ భాషలలో మాత్రమే కాకుండా హిందీ సినిమాలలో కూడా నటిస్తోంది.

Most Read Articles

English summary
Rashmika Mandanna Car Collection. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X