Rashmika Mandanna: తడబడిన రష్మిక మందన్నా.. హడావిడిలో వేరే వ్యక్తి కారు ఎక్కిన బ్యూటీ.. కొద్దిసేపటికే!!
పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ స్టేటస్ సాధించుకున్న రష్మిక మందన్నా(Rashmika Mandanna)కు.. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల రణ్‌బీర్ కపూర్‌కు జోడిగా యానిమల్ సినిమాలో నటించి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో బాలీవుడ్‌లోనూ రష్మిక బిజీగా మారిపోయింది. ఈ క్రమంలో రష్మికకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
పాన్ ఇండియా హీరోయిన్‌గా రష్మికకు క్రేజ్ పెరగడంతో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెగ బిజీ అయిపోయింది. ఎప్పుడు బయటకు వెళ్లినా అభిమానులు, మీడియా తనను చుట్టుముట్టేస్తున్నారు. అంతే కాకుండా తను ఏం చేసినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఇటీవల ముంబయి ఎయిర్‌పోర్టు(Mumbai Airport Rashmika)లో రష్మిక అనుకోకుండా పప్పులో కాలేసింది. ఇందుకు సంబంధించిన వీడియో హల్‌చల్ చేస్తోంది.

ఇటీవల ముంబయి విమానాశ్రయంలో కనిపించిన రష్మిక మందన్నా.. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తోంది. అప్పటికే మీడియా, అభిమానులు చుట్టుముట్టేయడంతో రష్మిక హడావుడిగా బయటకు వచ్చేసింది. అయితే బయటకి రాగానే ఈ బ్యూటీ హడావిడిగా ఎదురుగా ఉన్న కారులోకి ఎక్కబోయింది. దీంతో అప్రమత్తమైన రష్మిక టీమ్ వెంటనే 'ఆ కారు కాదు' అని గట్టిగా అరవడంతో తను ఆగిపోయింది. పొరబడ్డాననుకుంటూ రష్మిక నవ్వుతూ తన కారు దగ్గరకు వెళ్లిపోయింది.
ఈ సంఘటన శనివారం(జనవరి 6)న జరిగింది. 'యానిమల్' సినిమా సక్సెస్ మీట్ ముంబయిలో నిర్వహించారు. యానిమల్ సక్సెస్ పార్టీ(Animal Success Meet)కి హాజరయ్యేందుకు రష్మిక ముంబయికి వెళ్లింది. ఇందులో పాల్గొనేందుకు రష్మిక ముంబయికి పయనమైంది. కాగా కార్యక్రమం ఆలస్యమవడంతో రష్మిక హడావుడిగా ఉంది.

కాగా ఈవెంట్‌కు వెళ్లే హడావుడిలో రష్మిక(Rashmika Car Mumbai Airport) ఉన్నప్పటికీ, ఆమె తన అభిమానులకు ఫొటోలు ఇచ్చేందుకు సమయం కేటాయించడం అక్కడున్న వారిని కట్టిపడేసింది. డిసెంబర్ 1న థియేటర్లలో యానిమల్ సినిమా విడుదల కాగా.. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా, త్రిప్తి దిమ్రీ, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో.. బాలీవుడ్‌లో రష్మికకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కాగా ప్రస్తుతం రష్మిక 'పుష్ప 2' సినిమా షూటింగ్‌లో బిజీ అయిపోయింది. మరికొన్ని సినిమాల్లోనూ రష్మిక నటిస్తోంది.

ఇక రష్మిక వద్ద ఖరీదైన కార్ల కలెక్షన్(Rashmika Cars Collection) ఉంది. రేంజ్ రోవర్ స్పోర్ట్‌తో పాటు ఆడి Q3, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా వంటి ఖరీదైన లగ్జరీ కార్లను కలిగి ఉంది. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ నేషనల్ క్రష్... కేవలం సినిమాలతోనే కాకుండా యాడ్స్, బిజినెస్ రంగాల్లోనూ పెద్ద మొత్తంలో ఆర్జిస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications