రతన్‌ టాటా లగ్జరీ కార్ల లిస్ట్‌ చూశారా.. ఆయన ఫేవరెట్‌ కారు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా రెండు రోజుల క్రితం చనిపోయారు. ఆయన భౌతికంగా దూరమైన ఆయన నిర్మించిన సామ్రాజ్యం ఇప్పటికి చెక్కు చెదరలేదు. ముఖ్యంగా ఆయన సమాజానికి ఆయన చేసిన సేవలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. అసాంతం ఆయన జీవితాన్ని కేవలం వ్యాపార అభివృద్ధి, సమాజ సేవకు మాత్రమే ఆయన వెచ్చించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ ఆయన తన లైఫ్‌స్టైల్‌ని ఏమాత్రం మార్చుకోలేదు.

రతన్‌ టాటా మొత్తం టాటా గ్రూప్స్‌ కింద ఉన్న అన్ని విభాగాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. ఆయన వ్యాపార చాతుర్యం, సామాజిక కార్యక్రమాలకు భారత అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మవిభూషణ్, పద్మభూషణ్‌లతో సత్కరించారు. రతన్‌ టాటా జీవితాంతం నిరాడంబర జీవనశైలిని కలిగి ఉన్నప్పటికీ మంచి కార్ల సేకరణను సైతం కలిగి ఉన్నారు. ఆ వివరాలు ఈ కథనంలో..

Ratan Tata Ferrari California

ఫెరారీ కాలిఫోర్నియా: ఆయన కలిగి ఉన్న కార్లలో ఫెరారీ కాలిఫోర్నియా లగ్జరీ కారు ఒకటి. ఈ కారుపై ఆయన తరచుగా కనిపించే కారు. అతని సేకరణలో మరో ముఖ్యమైన కారు క్రిస్లర్ సెబ్రింగ్ )(Chrysler Sebring) ఇది 235 bhpని ఉత్పత్తి చేసే 3.5-లీటర్ ఇంజిన్ కలిగిన లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్ కారు. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో ఆటోమేటిక్‌గా యాక్సిలేటర్‌ని తీసుకుంటుంది.

Cadillac XLR: ఈ కారు రాడార్ ఆధారిత క్రూయిజ్ కంట్రోల్ టెక్నాలజీతో వచ్చే క్యాడిలాక్ XLR అనే రోడ్‌స్టర్‌ స్పోర్ట్స్ కారును కూడా రతన్ టాటా కొనుగోలు చేశాడు. ఈ మోడల్‌కి నార్త్ అమెరికన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. దీంతో పాటు మెర్సిడెస్ బెంజ్ S-క్లాస్, మెర్సిడెస్ బెంజ్ 500 SL రెండూ వాటి విలాసవంతమైన డిజైన్, హై ఫర్ఫామెన్స్‌కి పెట్టింది పేరు.

Ratan Tata Mercides Benz Cars

జాగ్వార్ ల్యాండ్ రోవర్: జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ SUV రతన్ టాటా సేకరణలో మరో ఆణిముత్యం అని చెప్పవచ్చు. టాటా గ్రూప్ కొనుగోలు చేసిన ఈ కారు నాలుగు సిలిండర్ల 2179 సిసి ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 147.51 bhp పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

ఐకానిక్ టాటా నానో: రతన్ టాటాకు అత్యంత ఇష్టమైన కార్లలో టాటా నానో (Tata Nano) ఒకటి. ఇది అతని డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఎన్నో అంచనాల మధ్య లాంచ్ చేసినా ఈ పొట్టి కారు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఏదేమైనా, రతన్ టాటా తరచుగా ఈ కాంపాక్ట్ కారును నడుపుతూ కనిపించేవారు.

Tata Nano EV

జీవితంలో ఏదో ఒక ఆశయం కోసం ఆయన నిరంతరం పనిచేశారు. పైన చెప్పిన కార్ల కలెక్షన్స్ కూడా ఆయన కేవలం చెప్పుకోవడానికి మాత్రమే తప్పా వాటిపై ఆయన రైడింగ్స్‌ చేసిన సందర్భాలు కనిపించలేదు. పొట్టి కారు నానోలో మాత్రం స్వయంగా తానే కారుని నడుపుతూ చాలాసార్లు దర్శనమిచ్చారు. తను సాధించిన అద్భుతమైన విజయాలు భారతదేశం ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలువనున్నాయి.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, October 11, 2024, 10:28 [IST]
English summary
Ratan tata cars collection ferrari california to tata nano
Read more on: #celebrity cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+