నానో కారుని మర్చిపోలేకపోతున్న రతన్ టాటా..! కోట్ల ఆస్తి ఉన్నా ఆ చవక కారులోనే సవారీ..!

టాటా నానో (Tata Nano).. రతన్ టాటా కలల కారు. మధ్య తరగతి ప్రజల కారు కలను నిజం చేయాలనే ఉద్దేశ్యంతో కేవలం లక్ష రూపాయలకే కారును అందించాలని, దాదాపు అంతే ఖరీదు చేసే టూవీలర్లతో పోల్చుకుంటే వాటికి ప్రత్యామ్నాయంగా ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమై మరియు సురక్షితమై ప్రయాణాన్ని అందించాలనే గొప్ప లక్ష్యంతో ప్రారంభించబడిన కారు ఇది. అయితే, టాటా నానో ప్లాంట్ ను ఏర్పాటు చేయడంలో పశ్చిమ బెంగాల్ లో ఏర్పడిన అవాంతరాలు మరియు అనంతర పరిస్థితుల వలన టాటా నానో కారు ప్రజల్లో ఎక్కువ కాలం నిలబడలేకపోయింది.

నానో కారుని మర్చిపోలేకపోతున్న రతన్ టాటా..! కోట్ల ఆస్తి ఉన్నా ఆ చవక కారులోనే సవారీ..!

టాటా నానో క్రమంగా ప్రజలకు, మార్కెట్ కు దూరమైంది. అయితే, టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా మనసు నుండి మాత్రం టాటా నానో ఇంకా దూరం కాలేదు. ఇది ఇప్పటికీ ఆయన కలల కారుగానే ఉంది. కోట్ల రూపాయలు ఆస్తులు ఉండి, విలాసవంతమైన కార్లలో తిరిగే హోదా ఉండి కూడా ఆయన సాదాసీదా జీవనాన్ని గడిపేందుకే ఇష్టపడుతుంటారు. ఇటీవల ముంబైలోని తాజ్ హోటల్ కు ఆయన ఓ టాటా నానో కారులో విచ్చేశారు. పక్కన బాడీగార్డ్స్ లేకుండా, చాలా సింపుల్ గా రతన్ టాటా రావడాన్ని చూసి అక్కడి వారంతా అవాక్కయ్యారు.

నానో కారుని మర్చిపోలేకపోతున్న రతన్ టాటా..! కోట్ల ఆస్తి ఉన్నా ఆ చవక కారులోనే సవారీ..!

రతన్ టాటా నానో కారులో వస్తున్న వీడియో వైరల్ అయ్యింది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ విరల్ భయానీ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రతన్ టాటా ఓ తెలుపు రంగు నానో కారులో రావడాన్ని చూడవచ్చు. పక్కనే డ్రైవర్ సీటులో రతన్ టాటా యువ స్నేహితుడు శాంతను నాయుడు కూడా కనిపిస్తాడు. ఈ కుర్ర వ్యాపారవేత్త స్వంతంగా మూడు స్టార్టప్ కంపెనీలను నిర్వహిస్తూనే రతన్ టాటా కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం, రతన్ టాటాకు ఎవరైనా చాలా దగ్గర ఆప్తులు ఉన్నారంటే, అది శాంతను నాయుడనే చెప్పాలి.

నానో కారుని మర్చిపోలేకపోతున్న రతన్ టాటా..! కోట్ల ఆస్తి ఉన్నా ఆ చవక కారులోనే సవారీ..!

ఈ టాటా నానో వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ (MH12RT4797) ను బట్టి చూస్తే, ఇది 2019 మోడల్ TATA NANO TWIST XTA (BS-IV) వేరియంట్ గా తెలుస్తోంది మరియు ఇది జులై 2019 లో రిజిస్టర్ చేయబడింది. నిజానికి టాటా మోటార్స్ జులై 2018లోనే టాటా నానో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. బహుశా ఇది శాంతను నాయుడు కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వేరియంట్ అయి ఉండొచ్చు లేదా మిగిలిన స్టాక్ మోడళ్లలో ఏదైనా ఒకటి కావచ్చు. దీన్ని బట్టి చూస్తుంటే, శాంతను నాయుడు కూడా రతన్ టాటా మాదిరిగానే సింప్లిసిటీనీ కోరుకునే వ్యక్తి అని తెలుస్తోంది.

నానో కారుని మర్చిపోలేకపోతున్న రతన్ టాటా..! కోట్ల ఆస్తి ఉన్నా ఆ చవక కారులోనే సవారీ..!

టాటా నానో ట్విస్ట్ ఎక్స్‌టిఏ మోడల్ విషయానికి వస్తే, ఇది నానో లైనప్ లో టాటా మోటార్స్ విక్రయించిన టాప్-ఎండ్ మోడల్. ఇందులో బిఎస్4 కంప్లైంట్ 624సీసీ 2-సిలిండర్ ఎస్ఓహెచ్‌సి ఎమ్‌పిఎఫ్ఐ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 5500 ఆర్‌పిఎమ్ వద్ద 37.48 బిహెచ్‌పి శక్తిని మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 51 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో ఇంజన్ వెనుక భాగంలో అమర్చబడి ఉంటుంది. ముందు హుడ్ క్రింది భాగంలో స్టోరేజ్ స్పేస్ ఉంటుంది, ఇది దాదాపు 94 లీటర్ బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది.

నానో కారుని మర్చిపోలేకపోతున్న రతన్ టాటా..! కోట్ల ఆస్తి ఉన్నా ఆ చవక కారులోనే సవారీ..!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టాటా నానో ట్విస్ట్ ఎక్స్‌టిఏ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో లభించేంది. ఆ సమయంలో ఈ కారు ధర సుమారు రూ.3 లక్షలకు పైగా ఉండేది. ఈ కారులో 24 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది మరియు ఇది లీటరుకు 21.9 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని సర్టిఫై చేయబడింది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు గరిష్టంగా 105 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ కారులో ముందు వైపు మెక్‌ఫెర్సన్ స్ట్రట్స్ సస్పెన్షన్, వెనుక వైపు కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్, పవర్ స్టీరింగ్, ముందు మరియు వెనుక డ్రమ్ బ్రేక్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

టాటా నానో హిస్టరీని ఓసారి తిరగేస్తే..

టాటా మోటార్స్ తొలిసారిగా 2008లో నానో కారును మార్కెట్లోకి తీసుకువచ్చింది. తొలుత కేవలం రూ.1 లక్షకే ఈ కారును అందించాలని కంపెనీ భావించింది. అయితే, ఆ తర్వాత వివిధ కారణాల వలన ఈ కారు ధరను భారీగా పెంచాల్సి వచ్చింది. అయితే, టాటా మోటార్స్ ప్రామిస్ చేసినట్లుగా మొదటి లక్ష మంది కస్టమర్లకు ఈ కారును లక్ష రూపాయలకే విక్రయించింది. అయితే, ఆ సమయంలో సప్లయ్ కు మించి డిమాండ్ ఉండటంతో కంపెనీ లాటరీ పద్దతి ప్రకారం కస్టమర్లను ఎంచుకుంది.

నానో కారుని మర్చిపోలేకపోతున్న రతన్ టాటా..! కోట్ల ఆస్తి ఉన్నా ఆ చవక కారులోనే సవారీ..!

టాటా నానో తొలినాళ్లలో మంచి విజయం సాధించినప్పటికీ, ఆ తర్వాత క్రమంగా ఈ కారుపై విమర్శలు రావడం ప్రారంభించాయి. నాణ్యతా లోపం, పనితీరు సరిగ్గా లేకపోవడం, పెరిగిన ఖర్చులు మరియు మార్కెటింగ్ వైఫల్యం వంటి అనే సమస్యల కారణంగా ఇది మార్కెట్లో నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా ఈ మోడల్ అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి. నానో ఆవిష్కరణలో పొరపాట్లు జరిగాయని రతన్ టాటా ఓ సందర్భంలో తెలిపారు. అయితే, ఈ కారుపై తన అభిమాన్ని మాత్రం ఆయన చంపుకోలేకపోయారు. ఇది భారతీయులందిరికీ అందుబాటులో ఉండే కారు అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు.

Most Read Articles

English summary
Ratan tata still loves his nano car spotted inside tata nano in mumbai
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X