Ratan Tata అస్తమించిన 'ఆటోమొబైల్‌ దిగ్గజం'.. వాహనాల కోసం ప్రపంచ దేశాలను సైతం భారత్‌ వైపు చూసేలా చేసిన ధీరుడు!

రతన్ టాటా (Ratan Tata Passes Away) కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మరణ వార్తతో యావత్‌ దేశం తీవ్ర శోకసంద్రంలో మునిగి పోయింది. ఓ బిజినెస్‌మ్యాన్‌ గానే కాకుండా దేశ అభివృద్ధి కోసం ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. దేశం కోసం ఆయన చేసిన సేవలు, ఇతర సామాజిక కార్యక్రమాలు ఇందుకు అద్ధం పడతాయి. దేశీయ వ్యాపార రంగంలో ఆయన తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని లిఖించుకున్నారు. ఆయన మరణం యావత్‌ భారతవనికి తీరని లోటనే చెప్పాలి.

ఆయన అడుగుపెట్టిన ప్రతీ మార్కెట్‌లోనూ 100% సక్సెస్ రేట్‌తో దూసుకెళ్లారు. అందులోనూ దేశంలోని ఆటోమొబైల్ రంగంలో పలు విప్లవాత్మక మార్పులతో (Ratan Tata on Automobile) ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూసేలా ఆయన చేశారు. ఓ విధంగా చెప్పాలంటే ఆయన కృషి వల్లే ఆటోమోటివ్‌ రంగంలో భారత్‌ ఇప్పుడు టాప్‌-3లో కొనసాగుతుంది. టాటా మోటార్స్‌లోని (Tata Motors) నేడు దేశంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా ఎదిగింది.

Ratan Tata Died

టాటా బ్రాండ్‌కి ఆ ఫేమ్‌ ఉందంటే అది టాటా చలువే అని చెప్పాలి. అందువల్లే ప్రస్తుతం మార్కెట్‌లో అత్యంత నమ్మదగిన సేఫ్టీ కార్లలో టాటా కార్లు నంబర్‌1 గా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా టాటా తీసుకువచ్చిన ప్రతీ కారు సేఫ్టీలో ఫైవ్ స్టార్ రేటింగ్‌తో వస్తున్నాయి. ఇది కేవలం రతన్ టాటా నిబద్ధతకు అద్ధం పడుతుందని అందరూ భావిస్తున్నారు.

గత కొన్ని దశాబ్దాలుగా ఆయన ఆటోమొబైల్ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చారు. దేశం ఈ రంగంలో ప్రపంచ స్థాయిలో పోటీని ఇచ్చేలా తయారు చేశారు. దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాటా ఇండికా (Tata India) నుంచి టాటా నానో కారు (Tata Nano) వరకు ఆయన తన మార్క్ బిజినెస్ చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఇప్పటికీ ఎంతోమంది ఆటో రంగ నిపుణులకు రతన్ టాటా ఓ రోల్‌ మోడల్‌గా ఉన్నారు.

Tata India Ratan Tata

అయితే ఆటోమొబైల్ రంగంలో పలు మార్పులు తీసుకొచ్చి రతన్ టాటా మరణం (Ratan Tata Death) దేశంలోని ఆటోమొబైల్ రంగానికి ఓ తీరని లోటు అనే చెప్పాలి. ఎందుకంటే దేశంలోనే టాటా మోటార్స్ గత కొన్ని సంవత్సరాలుగా కార్లు, బస్సులు, ట్రక్కులు, ఇతర కమర్షియల్‌ వెహికిల్స్‌తో పాటు, కొన్ని మిలటరీ వాహనాలను సైతం దేశానికి అందిస్తుంది. వాస్తవానికి టాటా 1954లో ఆటోమోటివ్ పరిశ్రమలోకి ప్రవేశించింది.

కానీ దేశంలో ఓ వెలుగు వెలిగేందుకు చాలా ఏళ్లు పట్టింది. ముఖ్యంగా అప్పట్లో అంబాసిడర్ కార్ల (Ambassador cars) పోటీని టాటా మోటార్స్ ఏమాత్రం తట్టుకోలేకపోయింది. దీంతో 1986లో లైట్ కమర్షియల్ వెహికల్ వాహనాల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. అప్పటికే టాటా గ్రూప్‌లో రతన్‌ టాటా కీలకంగా వ్యవహిస్తున్నారు. ఇక ఈ సంస్థ 1988లో ప్యాసింజర్ వెహికిల్స్‌ మార్కెట్లోకి ప్రవేశించింది. దీంతో దేశంలో ఒక్కసారిగా సీన్‌ మొత్తం రివర్స్ అయ్యింది.

Ratan Tata Automotive Industry

అప్పటివరకు ఆధిపత్యం చెలాయించిన విదేశీ కంపెనీల కారులు టాటా దెబ్బకు తోక ముడిచాయి. 1991లో రతన్‌ టాటా (Tata Chairman)గా పుర్తిగా బాధ్యతలు తీసుకున్నారు. దీంతో 1991లో నిటోల్ మోటార్స్ (Nitol Motors) భాగస్వామ్యంతో టాటా సియర్రా (Tata Sierra) కారుని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1993లో పవర్‌ఫుల్‌ డీజిల్ ఇంజిన్స్‌ని కార్లలోనూ టాటా అమర్చడం ప్రారంభించింది.

ఇక టాటా మోటార్స్ 1994లో లాంచ్‌ చేసిన టాటా సుమో మార్కెట్‌లో తిరుగులేని శక్తిగా అవతరించింది. ఇప్పటికీ ఈ కార్లు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ని కలిగి ఉన్నాయి. ఇక 1998లో రతన్ టాటా స్వయంగా మాస్‌ మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ విడుదల చేసిన టాటా ఇండికా (Tata Indica), టాటా సఫారీ (Tata Safari) వంటి కార్లు దేశంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

ఇప్పటికి కూడా లక్షల సంఖ్యలో టాటా ఇండికా కార్లు రోడ్లపై దర్శనమిస్తాయి. ముఖ్యంగా దీని బిల్డ్ క్వాలిటీకి ప్రజలు దాసోహమయ్యారు. అందువల్ల అతి తక్కువ కాలంలోనే టాటా ఇండికా అత్యధికంగా సేల్‌ అయినా కారుగా నిలిచింది. ఇప్పటికీ టాటా కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. టాటా మోటార్స్‌ దేశీయ ఆటోమోటివ్‌ రంగంలో కీలకంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం దీని నెటవర్త్‌ రూ. 93,664 కోట్లుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, October 10, 2024, 1:55 [IST]
English summary
Ratan tata the man behind national automotive industry development
Read more on: #india #tata motors
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+