టాటా సఫారీని కొనుగోలు చేసిన శంతను నాయుడు.. కారు ఫీచర్లు చూసి రతన్ టాటా ఫుల్ ఖుషీ, ఫొటోలు వైరల్.!!
భారత మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీ కంపెనీగా స్వదేశీ టాటా మోటార్స్ ప్రసిద్ధి చెందింది. బిల్ట్ క్వాలిటీ విషయంలోనూ రాజీ పడని టాటా మోటార్స్.. కస్టమర్ల ఫేవరెట్‌గా నిలిచాయి. కాగా ఇటీవలే టాటా మోటార్స్ నుంచి సఫారీ, హారియర్ ఫేస్‌లిఫ్ట్‌లు దేశీయ మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. ఈ క్రమంలో టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా మేనేజర్ శంతను నాయుడు కొత్త టాటా సఫారీని కొనుగోలు చేశారు.
శంతను నాయుడు(Shantanu Naidu).. ఈ పేరును తరచూ మీరు సోషల్ మీడియాలో, వార్తల్లో చూసే ఉంటారు. రతన్ టాటా, శంతను నాయుడు కలిసి ఉన్న సందర్భాలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. రతన్ టాటా(Ratan Tata)కు శంతను మేనేజర్ మాత్రమే కాదు.. కేర్ టేకర్ కూడా. గతేడాది వీరిద్దరూ కలిసి 'GoodFellows' కంపెనీని స్థాపించారు.

కాగా తాజాగా, శంతను నాయుడు సరికొత్త టాటా సఫారీ(Tata Safari Facelift)ని కొనుగోలు చేశారు. దీనిని రతన్ టాటా చూస్తూ ఆశ్చర్యపోతున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. శంతను.. సఫారీ అకాంప్లిష్డ్ ప్లస్ టాప్-ఎండ్ వేరియంట్‌ను కొనుగోలు చేశారు. ఈ వేరియంట్ ఎస్‌యూవీని కలిగి ఉన్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో శంతనుడు ఒకడు.
శంతను నాయుడు కొనుగోలు చేసిన సఫారీ తెలుపు రంగులో ఉంది. కాగా ఇది ఇప్పటికే 1,000 కిలోమీటర్లకు పైగా నడిచింది. ఈ కారుకు శంతను ముద్దుగా 'యుకీ' అని పేరు పెట్టుకున్నాడు. అయితే శంతను మొదట్లో టాటా నానో కారును ఉపయోగించేవాడు. కొత్త సఫారీ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ తనను బాగా ఆకర్షించిందని.. శంతను వీడియోలో పేర్కొన్నాడు.

కాగా ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న అప్‌డేటెడ్ టాటా సఫారి SUV విషయానికొస్తే ఈ కారు బేస్ వేరియంట్ ధర రూ.16.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. స్మార్ట్ (O), ప్యూర్ (O), అడ్వెంచర్, అడ్వెంచర్ ప్లస్, అడ్వెంచర్ ప్లస్ డార్క్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ డార్క్ సహా 10 వేరియంట్లలో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు.
కొత్త టాటా సఫారీ ఫీచర్లను పరిశీలిస్తే.. ఇందులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్, ఆపిల్ కార్‌ప్లే, యాంబియంట్ లైటింగ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్)ల వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది..

టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్ విషయానికొస్తే.. 2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 170 PS పవర్, 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాగా మైలేజ్ విషయానికొస్తే ఇది 16.30 kmpl మైలేజ్‌ను ఇస్తుంది.
కాగా మార్కెట్లో టాటా సఫారీ విడుదలైన కొద్ది రోజులకే భారీ డిమాండ్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా ఈ నవంబర్‌లో టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్‌కు వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంది. బుక్ చేసిన 4,5 వారాలకు ఈ కారు డెలివరీ మీకు అందుతుంది. మీరు ఈరోజు ఈ కారును బుక్ చేసినా, 4 నుండి 6 వారాలలోపు డెలివరీ చేయబడుతుంది. అయితే స్టాక్ లభ్యత ప్రకారం రాష్ట్రానికి రాష్ట్రానికి డిమాండ్ మారుతుందని గుర్తించాలి. రానున్న రోజుల్లో డిమాండ్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications








