ఎలుకల వల్ల లక్షల నష్టం వచ్చిందన్న కార్తీక్ ఆర్యన్.. నా కారులో..

ప్రముఖ నటుడు, బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లో తనదైన రీతిలో నటించి ప్రేక్షకులను అలరిస్తారు. ఈయన నటించిన భూల్ భూలయ్య 2 అతి పెద్ద విజయం సాధించిన తరువాత సుమారు రూ. 4.72 కోట్ల విలువైన 'మెక్‌లారెన్ జీటీ' కారును నిర్మాత నుంచి గిఫ్ట్‌గా పొందారు. ఈ విషయాని గతంలోనే తెలుసుకున్నాం. అయితే ఈ ఖరీదైన కారుకు ఎలుకల వల్ల లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇంతకీ ఇది ఎంతవరకు నిజం, దీనికి గల కారణాలు ఏంటి అనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..

కార్తీక్ ఆర్యన్ వద్ద మెక్‌లారెన్ జీటీ కారులో ఎలుకల చేరి భారీ నష్టాన్ని కలిగించాయని సమాచారం. తన గ్యారేజిలో కారును పార్క్ చేసి ఉంచిన సమయంలో ఎలుకలు కారులోకి ప్రవేశించి మ్యాట్ మరియు కొన్ని వైర్లను కొరికేసినట్లు.. వీటిని మళ్ళీ రీప్లేస్ చేయడానికి లక్షలు ఖర్చు పెట్టినట్లు ది లాలాన్‌టాప్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నిజానికి ఈ కారును తాను ఎక్కవగా డ్రైవ్ చేయలేదని కూడా వివరించారు.

Kartik Aaryan McLaren GT

మెక్‌లారెన్ జిటి కారును టీ సిరీస్ చైర్‌పర్సన్ భూషణ్ కుమార్ ఇచ్చినట్లు సమాచారం. భూల్ భూలయ్య 2 సినిమా బాక్సాపీస్ వద్ద 180 కోట్ల రూపాయలకంటే ఎక్కువ వసూలు చేయడంతో నిర్మాత ఈ కారును హీరో 'కార్తీక్ ఆర్యన్'కు ఇచ్చారు. అప్పట్లోనే ఈ కారును పొందిన కార్తీక్ ఆర్యన్.. తన సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలను పోస్ట్ చేస్తూ.. చైనీస్ నూడుల్స్ తినటానికి ఓ మంచి డబుల్ లంభించిందని అన్నారు.

గిఫ్ట్‌గా పొందిన మెక్‌లారెన్ జిటి ఒక్క చూపుతోనే ఆకర్శించే అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఈ కారును సొంతం చేసుకోవడంలో భారతదేశపు మొట్టమొదటి మెక్‌లారెన్ జిటి ఓనర్ కార్తిక్ ఆర్యన్ అయ్యారు. ఆ తరువాత ఈ కారును డ్రైవ్ చేస్తూ పలు సందర్భాల్లో కనిపించారు. ఆరంజ్ కలర్ ఆప్షన్ పొందిన ఈ కారు బ్లాక్ కలర్ వీల్స్ మరియు రూప్ పొందుతుంది.

Kartik Aaryan McLaren GT

మెక్‌లారెన్ జిటి సూపర్ కారు 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 611 Bhp పవర్ మరియు 630 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది పవర్ ఓపెన్ డిఫరెన్షియల్ ద్వారా పవర్ వెనుక చక్రాలకు పంపుతుంది. తద్వారా మంచి డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.

మెక్‌లారెన్ జిటి సూపర్ కారు కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో ఇది 9 సెకన్లలో గంటకు 200 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 327 కిమీ. దేన్నీ బట్టి చూస్తే భారతదేశంలో అత్యంత వేగవంతమైన కార్ల జాబితాలో మెక్‌లారెన్ జిటి సూపర్ కారు ఒకటని తెలుస్తోంది.

Kartik Aaryan McLaren GT

నటుడు కార్తీక్ ఆర్యన్ గ్యారేజిలో కేవలం మెక్‌లారెన్ జిటి మాత్రమే కాకుండా.. మినీ కూపర్ ఎస్ కన్వర్టిబుల్, బీఎండబ్ల్యూ 5 సిరీస్, పోర్స్చే 718 బాక్స్‌స్టర్ మరియు లంబోర్ఘిని ఉరుస్ క్యాప్సూల్ వంటి ఖరీదైన అన్యదేశ్య కార్లతో పాటు, విలాసవంతమైన బైకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ అద్భుతమైన డిజైన్ మరియు అత్యాధునిక ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, June 14, 2024, 9:31 [IST]
English summary
Rats damage expensive mclaren gt says kartik aaryan
Read more on: #off beat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+