మహీంద్రా థార్ కొనాలకుంటున్నా, అంటూ.. ట్వీట్ చేసిన నటి 'రవీనా టాండన్': దానికి ఇలా రిప్లే ఇచ్చిన ఆనంద్ మహింద్రా

మహీంద్రా కంపెనీ థార్ SUV భారతీయ మార్కెట్లో విడుదలైనప్పటినుంచి మంచి డిమాండ్ పొందుతూ ఉంది, నిజానికి మార్కెట్లో ఈ ఆఫ్ రోడర్ విడుదల కాకముందు నుంచే ఎంతోమంది కస్టమర్లు దీనికోసం ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే మార్కెట్లో విడుదలై ఇప్పటికి చాలా రోజులైనప్పటికి కూడా దీనికున్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

Recommended Video

Yezdi Motorcycles Review In Telugu | Roadster, Adventure & Scrambler

సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకు అందరిని ఆకర్శించిన ఈ SUV ప్రతి నెల 4,500 యూనిట్లను విక్రయిస్తూనే ఉంది. ఇప్పటికి కూడా దాదాపు 26,000 యూనిట్లు డెలివరీ చేయాల్సి ఉంది. కాగా ఇటీవల బాలీవుడ్ నటి 'రవీనా టాండన్' ఈ ఆధునిక ఆఫ్ రోడర్ కొనుగోలు చేయాలనే తన ఆసక్తిని వెల్లడించింది.

'మహీంద్రా థార్' కొనాలకుంటున్నా, అంటూ.. ట్వీట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ 'రవీనా టాండన్': దానికి ఇలా రీప్లే ఇచ్చిన ఆనంద్ మహింద్రా

రవీనా టాండన్ కేవలం బాలీవుడ్ చిత్ర సీమలో మాత్రమే కాకుండా.. తెలుగు సినీరంగంలో కూడా బాగా పాపులర్ సెలబ్రెటీ. ఈమె బాలకృష్ణ సరసన 'బంగారు బుల్లోడు', 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమాలో మంచి మోహన్ బాబు భార్యగా మాత్రమే కాకుండా కెజిఎఫ్-2 లో కూడా నటించింది.

'మహీంద్రా థార్' కొనాలకుంటున్నా, అంటూ.. ట్వీట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ 'రవీనా టాండన్': దానికి ఇలా రీప్లే ఇచ్చిన ఆనంద్ మహింద్రా

రవీనా టాండన్ కి మహీంద్రా థార్ పట్ల ఉన్న ఆసక్తిని మరియు త్వరలో ఆ ఆఫ్ రోడర్ ని కొనుగోలు చేయాలని తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. అంతే కాకుండా 'ఆనంద్ మహీంద్రా' ను ఉద్దేశించి.. సర్, నేను నా కాలేజీ రోజుల్లో మహీంద్రా జీప్ డ్రైవింగ్ నేర్చుకున్నాను, త్వరలోనే థార్ SUV కూడా కొనాలనుకుంటున్నాను అని ట్విట్టర్ ద్వారా పేర్కొంది.

'మహీంద్రా థార్' కొనాలకుంటున్నా, అంటూ.. ట్వీట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ 'రవీనా టాండన్': దానికి ఇలా రీప్లే ఇచ్చిన ఆనంద్ మహింద్రా

రవీనా టాండన్ ట్వీట్ కి ఆనంద్ మహింద్ర రీప్లే ఇస్తూ.. "థార్‌ని క్లబ్ మహీంద్రా రిసార్ట్‌కి తీసుకెళ్లడం కంటే మంచిది ఏది లేదు! ఇది మహీంద్రారైజ్‌కు రెట్టింపు ప్రయోజనం.. అని రాసాడు. దీన్ని బట్టి మొత్తానికి నటి త్వరలోనే థార్ SUV కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

'మహీంద్రా థార్' కొనాలకుంటున్నా, అంటూ.. ట్వీట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ 'రవీనా టాండన్': దానికి ఇలా రీప్లే ఇచ్చిన ఆనంద్ మహింద్రా

మహీంద్రా కంపెనీ యొక్క థార్ SUV విషయానికి వస్తే, ఈ ఆఫ్‌రోడర్ SUV యొక్క రెండవ తరం మోడల్‌ ప్రస్తుతం విక్రయించబడుతున్నాయి. ప్రస్తుతం, మహీంద్రా థార్ 3 డోర్ వేరియంట్‌లలో అందించబడుతోంది. అయితే కంపెనీ తన 5 డోర్ వేరియంట్‌ను త్వరలో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.

'మహీంద్రా థార్' కొనాలకుంటున్నా, అంటూ.. ట్వీట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ 'రవీనా టాండన్': దానికి ఇలా రీప్లే ఇచ్చిన ఆనంద్ మహింద్రా

కొత్త మహీంద్రా థార్ కొత్త ఆధునిక డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. దీనికి 7 స్లాట్ గ్రిల్స్ లభిస్తాయి. ముందు భాగంలో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, వెనుక భాగంలో ఎల్‌ఈడీ టైల్లైట్ ఉన్నాయి. ఇది మునుపటి కంటే పెద్దదిగా మరియు ఆకర్షణీయంగా మారింది.

'మహీంద్రా థార్' కొనాలకుంటున్నా, అంటూ.. ట్వీట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ 'రవీనా టాండన్': దానికి ఇలా రీప్లే ఇచ్చిన ఆనంద్ మహింద్రా

థార్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ విండోస్, క్రూయిస్ కంట్రోల్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, కీలెస్ ఎంట్రీ, ట్రాక్షన్ కంట్రోల్‌తో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ వంటి వాటిని పొందుతుంది.

'మహీంద్రా థార్' కొనాలకుంటున్నా, అంటూ.. ట్వీట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ 'రవీనా టాండన్': దానికి ఇలా రీప్లే ఇచ్చిన ఆనంద్ మహింద్రా

మహీంద్రా థార్‌ రెండు ఇంజిన్ ఆప్సన్లను కలియు ఉంటుంది. ఇందులో ఒకటి 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కాగా, మరొకటి 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

'మహీంద్రా థార్' కొనాలకుంటున్నా, అంటూ.. ట్వీట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ 'రవీనా టాండన్': దానికి ఇలా రీప్లే ఇచ్చిన ఆనంద్ మహింద్రా

2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 130 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్‌లు 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తాయి. రెండు ఇంజిన్లలో కూడా 4x4 ఎంపిక అందుబాటులో ఉంది.

'మహీంద్రా థార్' కొనాలకుంటున్నా, అంటూ.. ట్వీట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ 'రవీనా టాండన్': దానికి ఇలా రీప్లే ఇచ్చిన ఆనంద్ మహింద్రా

ఇక మహీంద్రా కంపెనీ విడుదల చేయనున్న కొత్త మహీంద్రా థార్ యొక్క 5-డోర్ల మోడల్ 2023-2026 మధ్య భారతదేశంలో ప్రారంభించబడే అవకాశం ఉంది. అయితే ఇది థార్ యొక్క ప్రస్తుత మోడల్ కంటే పెద్దది మరియు ఎక్కువ ప్రీమియం ఫీచర్లతో రానుంది.

'మహీంద్రా థార్' కొనాలకుంటున్నా, అంటూ.. ట్వీట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ 'రవీనా టాండన్': దానికి ఇలా రీప్లే ఇచ్చిన ఆనంద్ మహింద్రా

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మహీంద్రా థార్ SUV ని ఇప్పటికే ప్రకాష్ రాజ్, ఇతర సెలబ్రెటీలు కూడా కొనుగోలు చేశారు. ఇక త్వరలో మహీంద్రా థార్ కొనుగోలు చేసిన సెలబ్రెటీల జాబితాలో 'రవీనా టాండన్' కూడా చేరనుంది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతోపాటు, కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Sunday, September 4, 2022, 11:00 [IST]
English summary
Raveena tondon expresses interest in buying mahindra thar anand mahindra replies details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+