ధనవంతుడైన రైతుబిడ్డ!.. రవి పిళ్ళై కార్లు చూస్తే కళ్ళు తిరగాల్సిందే..

కలలు అందరూ కంటారు, కానీ కొంతమంది మాత్రమే వాటిని నెరవేర్చుకుంటారు. అలాంటి కోవకు చెందినవారిలో ఒకరు రవి పిళ్ళై. కేరళ రాష్ట్రంలో ఓ చిన్న గ్రామంలోని రైతు కుటుంబంలో జన్మించిన పిళ్ళై.. ఈ రోజు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. RP గ్రూప్ స్థాపించిన ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్న ఈయన 1970 ప్రారంభంలో ఓ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి.. నేడు తిరుగులేని వ్యాపారవేత్తగా ఎదిగారు. ప్రస్తుతం ఈయన గ్యారేజిలో ఖరీదైన అన్యదేశ్య కార్లు, రూ. 100 కోట్ల విలువైన ఎయిర్‌బస్ హెచ్145 హెలికాప్టర్‌ వంటివి ఉన్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఎయిర్‌బస్ హెచ్145

రవి పిళ్ళై గత ఏడాది జూన్ నెలలో సరికొత్త ఎయిర్‌బస్ హెచ్145 హెలికాప్టర్‌ డెలివరీ చేసుకున్నారు. నిజానికి ప్రపంచంలో ఎక్కువ డిమాండ్ ఉన్న హెలికాఫ్టర్లలో ఇది కూడా ఒకటి. ఫోర్ బ్లేడ్స్ కలిగిన ఈ హెలికాఫ్టర్ ధర రూ. వంద కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఈ హెలికాఫ్టర్ ఇద్దరు ఫైలెట్లకు, ఏడుగురు ప్రయాణికులకు వసతి కల్పిస్తుంది. ఇది హెచ్ఈ ఏరియల్ 2సీ2 టర్బోషాఫ్ట్ ఇంజన్‌ పొందుతుంది.

Ravi Pillai Helicopter

ఎయిర్‌బస్ హెచ్145 హెలికాఫ్టర్లోని ఇంజిన్ 785 కిలోవాట్ పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 246కిమీ/గం వేగంతో 20000 అడుగుల ఎత్తులో వెళ్లగలదు. ఎయిర్‌బస్ కంపెనీ మొత్తం గ్లోబల్ మార్కెట్ కోసం 1500 యూనిట్ల హెచ్145 హెలికాఫ్టర్లను మాత్రమే తయారు చేసింది. ఈ కారణంగానే దీనికి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది, ధర కూడా ఎక్కువ. లులు గ్రూప్ యజమాని ఎంఏ యూసఫ్ అలీ కూడా ఈ హెలికాఫ్టర్ కలిగి ఉన్నారు.

రోల్స్ రాయిస్ ఘోస్ట్

ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసి విక్రయించే రోల్స్ రాయిస్ కంపెనీ యొక్క ఘోస్ట్ కారును కూడా పిళ్ళై కలిగి ఉన్నారు. ఈ సెడాన్‌ను 2011లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కారును రవి పిళ్ళై రోజువారీ ఉపయోగానికి ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఇది 6.5 లీటర్ వీ12 ఇంజిన్ పొందుతుంది. ఇది 570 Bhp పవర్ మరియు 780 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Ravi Pillai Mercedes

మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్600

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన మేబ్యాచ్ ఎస్600 కూడా రవి పిళ్ళై గ్యారేజిలో ఉంది . తెలుపు రంగులో చూడచక్కగా ఉన్న ఈ కారు అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఈ సెడాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, సీట్ మసాజర్‌లు, ఇంటిగ్రేటెడ్ పెర్ఫ్యూమ్ సిస్టమ్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్స్ పొందుతుంది.

మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్500

మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన మరో కారు మేబ్యాచ్ ఎస్500 కూడా పిళ్ళై గ్యారేజిలో ఉంది. ఇది నలుపు రంగులో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది 4.4 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 453 బిహెచ్‌పి పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఎక్కువమంది సెలబ్రిటీలకు కూడా ఇష్టమైన వాహనం.

Ravi Pillai Cars

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ

ఎక్కువ మంది సెలబ్రిటీలకు ఇష్టమైన SUVగా ప్రసిద్ధి చెందిన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కూడా రవి పిళ్ళై గ్యారేజిలో ఉంది. ఇది గోల్డెన్ షేడ్‌లో ఉంది. ఇప్పటికే చాలామంది ప్రముఖులు ఈ కారును తమ గ్యారేజిలో చేర్చారు. ఇది డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉండటమే కాకుండా పనితీరు పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

బీఎండబ్ల్యూ 5 సిరీస్

బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 5 సిరీస్ మోడల్ రవి పిళ్ళై గ్యారేజిలో ఉంది. ఇది 520డీ వేరియంట్ అని తెలుస్తోంది. భారతదేశంలో బీఎండబ్ల్యూ కంపెనీ విక్రయించిన అత్యంత విజయవంతమైన సెడాన్‌లలో ఇది కూడా ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 190 బిహెచ్‌పి పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఆడి ఏ6 మ్యాట్రిక్

బెంజ్, బీఎండబ్ల్యూ కంపెనీలకు చెందిన కార్లు మాత్రమే కాకుండా రవి పిళ్ళై ఆడి కంపెనీ కార్లను కలిగి ఉన్నారు. పిళ్ళై గ్యారేజిలోని ఆడి కారు ఏ6 మ్యాట్రిక్స్. బీఎండబ్ల్యూ 5 సిరీస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఈ కారు దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతోంది. ఇది 190 Bhp పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ అందించే ఇంజిన్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, June 10, 2024, 14:47 [IST]
English summary
Ravi pillai expensive car collection and rs 100 crore airbus
Read more on: #off beat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+