R Ashwin Cars రవిచంద్రన్‌ అశ్విన్ కార్లు ఇవే.. వాటి విలువ ఎన్ని కోట్లో తెలుసా తెలుసా?

టీమ్‌ ఇండియా ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఆల్‌రౌండర్‌ పేరిట్ భారీ రికార్డు ఉన్నాయి. విభిన్నమైన శైలిలో బౌలింగ్‌ చేస్తూ.. బ్యాట్‌తోనూ అప్పుడప్పుడూ మెరుస్తూ ఉంటాడు. ఈ భారత స్పిన్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. గబ్బా టెస్ట్‌లో భాగంగా మూడో టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడిన అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశాడు. దీంతో అతను మరోసారి వైరల్‌ అయ్యాడు.

గ్రౌండ్‌లోనే కాకుండా ఆఫ్‌టైమ్‌లోనూ అశ్విన్‌ ప్రత్యేక శైలిని కలిగి ఉన్నాడు. తాజాగా జరిగిన ఐపీఎల్‌ వేలంలో అశ్విన్‌ని చైన్నై సూపర్‌ కింగ్స్‌ 9.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పినా కానీ వచ్చే ఏడాది ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తన సేవలను కొనసాగించనున్నాడు. ప్రస్తుతం రవిచంద్రన్‌ అశ్విన్ ఆస్తుల విలువ రూ.132 కోట్లుగా ఉంది.

Ravichandran Ashwin Nissan Xtrail

ఈ టాప్‌ క్రికెట్ర్‌ క్రికెట్‌తో పాటు చాలా కంపెనీలకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. కొవిడ్‌ తర్వాత తన యూట్యూబ్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఛానల్స్‌లో వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఎప్పటికప్పుడూ పలకరిస్తూ ఉన్నాడు. వీటి ద్వారా కూడా అశ్విన్ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. అశ్విన్‌కి కార్లు అంటే కూడా చాలా ఇష్టం. మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం అశ్విన్ వద్ద ప్రస్తుతం రెండు లగ్జరీ కార్లు మాత్రమే ఉన్నాయని తెలిసింది.

రోల్స్ రాయిస్: ప్రస్తుతం అశ్విన్ వద్ద రోల్స్ రాయిస్ కారు ఉందని తెలిసింది. అయితే ఈ ఇది ఏ మోడల్ అనేది మాకు తెలియరాలేదు. అశ్విన్ వద్ద ఉన్న కారు దాదాపు రూ.6 కోట్ల విలువైనదిగా ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో కేవలం మూడు రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే అమ్మకానికి ఉన్నాయి. ఈ మూడు కార్లు స్పెక్టర్ ఈవీ, కల్లినన్, ఫాంటమ్‌గా ఉన్నాయి.

Ravichandran Ashwin Rolls Royce Cars

వీటి ధరలు రూ.6.95 కోట్ల నుంచి ప్రారంభమవుతున్నాయి. కావను అశ్విన్ కల్లినన్ కొనుగోలు చేసిన కారు ధర సుమారు రూ .6 కోట్లుగా ఉంటుందని భావిస్తున్నాము. ఏదైన ఫంక్షన్స్‌ లేదా ఇతర అఫీషియల్‌ కార్యక్రమాలకు అశ్విన్‌ ఈ కార్లలో వెళ్తూ కనిపించేవాడు. ఈ కారుతో పాటు అతడి వద్ద మరోకారు కూడా ఉంది.

ఆడి క్యూ7: అశ్విన్ కలిగి ఉన్న మరో లగ్జరీ కారు ఆడి క్యూ7. ఈ ఆడి క్యూ7కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మాకు లభించచలేదు. అయితే ఈ కారు ప్రీమియం ప్లస్, టెక్నాలజీ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ప్రస్తుతం వీటి ఎక్స్ షోరూమ్ ధరలు రూ.88.66 లక్షల నుంచి రూ.97.81 లక్షల మధ్య ఉన్నాయి.

Ravichandran Ashwin Audi Q7

అశ్విన్ వినియోగిస్తున్న క్యూ7 ఏ వేరియంట్ అనేది తెలియరాలేదు. అయితే ఇది ఖరీదైన టెక్నాలజీ వేరియంట్‌ అయి ఉండవచ్చు. ఈ ఆడి క్యూ7 3.0-లీటర్ వి6 పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. నవంబర్‌లో ఈ కారుని అప్‌డేట్‌ తీసుకువచ్చారు. తాజాగా ఇతను నిస్సాన్‌ ఎక్స్‌ట్రైల్‌ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. వీటితో పాటు అతడి వద్ద టాటా కార్లు కూడా ఉన్నట్లు సమాచారం.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, December 18, 2024, 19:17 [IST]
English summary
Ravichandran ashwins rolls royce and audi q7 luxury cars details
Read more on: #celebrity cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+