పవర్ చిత్రంలో హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై కనిపించనున్న రవితేజ
మాస్ మహరాజా రవితేజ నటించిన 'పవర్' చిత్రం మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీనే విడుదల కావల్సి ఉన్నప్పటికీ, కొన్ని అనుకోని కారణాల వలన ఈ చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. సినీ పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, పవర్ సినిమా ఈనెస 12వ తేదీన విడుదల కావచ్చని తెలుస్తోంది.
సరే ఆ విషయం అటుంచింతే, ఈ చిత్రంలో మన మాస్ మహారాజా తన స్టయిల్‌కి తగినట్లుగానే అమెరికన్ లగ్జరీ మోటార్‌సైకిల్ హ్యార్లీ డేవిడ్‌సన్ అందిస్తున్న 'నాట్ రాడ్ స్పెషల్' (Night Rod Special) బైక్‌పై రవితేజ కనిపించనున్నాడు. గతంలో అల్లు అర్జున్ నటించిన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో కూడా మన బన్నీ ఇలాంటి ఓ మోటార్‌సైకిల్‌ను నడుపుతూ కనిపిస్తాడు. స్టయిలిష్ లుక్, ప్రీమియం రైడ్ క్వాలిటీ, ఎగ్జాస్ట్ బీటింగ్, అల్టిమేట్ హ్యాండ్లింగ్‌లు ఈ బైక్ ప్రత్యేకత.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'పవర్'. హీరోయిన్ హన్సిక. ఈ చిత్రం ద్వారా కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబి) దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్.

తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోని ఇటీవలే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. పక్కా మాస్ మసాలా చిత్రంగా ఈ చిత్రం రూపొందించినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ 'పవర్ ఫుల్ పోలీస్ కథ ఇది. పేరుకు తగ్గట్టుగానే ప్రతీ సన్నివేశం శక్తిమంతంగా ఉంటుంది. రవితేజ సినిమా నుంచి ఎలాంటి అంశాలు ఆశిస్తారో.. అవన్నీ మేళవించి ఓ రంగుల హరివిల్లులా తీర్చిదిద్దాం' అన్నారు.

ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ముఖేష్ రిషి, సంపత్ రాజ్, అజయ్, సురేఖావాణి, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజీ, జీవా, సుబ్బరాజు, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, జయలక్ష్మి, వినయ్ ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. తమన్, సినిమాటోగ్రఫీ: జయనన్ విన్సెంట్, మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతం రాజు, స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి, మోహన్ కృష్ణ, ఆర్ట్: బ్రహ్మకడలి, మాటలు: కోన వెంకట్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జె.బి.కృష్ణ, చీఫ్ కోడైరెక్టర్: ఎస్.సురేష్ కుమార్, నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర(బాబీ).

హ్యార్లీ డేవిడ్‌సన్ నైట్ రాడ్ స్పెషల్ బైక్‌లో 1247సీసీ, లిక్విడ్ కూల్డ్, వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. దీనికి ఐదు గేర్లు ఉంటాయి.

ఈ బైక్‌లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) మరియు స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్ మొదలైన విశిష్ట ఫీచర్లుంటాయి.

ఇది లీటరుకు సుమారు 15-16 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

భారత మార్కెట్లో ఈ హ్యార్లీ డేవిడ్‌సన్ నైట్ రాడ్ స్పెషల్ బైక్ ధర రూ.21.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

పవర్ చిత్రంలో రవితేజ ఓ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ క్రోమ్ మోటార్‌సైకిల్‌పై కూడా కనిపిస్తాడు.

గతంలో అల్లు అర్జున్ నటించిన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో కూడా మన బన్నీ ఇలాంటి ఓ మోటార్‌సైకిల్‌ను నడుపుతూ కనిపించాడు.

హ్యార్లీ డేవిడ్‌సన్ నైట్ రాడ్ స్పెషల్ రెడ్ కలర్

హ్యార్లీ డేవిడ్‌సన్ నైట్ రాడ్ స్పెషల్ యల్లో కలర్.

హ్యార్లీ డేవిడ్‌సన్ నైట్ రాడ్ స్పెషల్ మ్యాట్ బ్లాక్ కలర్.

హ్యార్లీ డేవిడ్‌సన్ నైట్ రాడ్ స్పెషల్

హ్యార్లీ డేవిడ్‌సన్ నైట్ రాడ్ స్పెషల్

హ్యార్లీ డేవిడ్‌సన్ నైట్ రాడ్ స్పెషల్


Click it and Unblock the Notifications








