ఫ్లైట్ జర్నీలో కొత్త ట్రెండ్.. టైం పాస్ కోస సెల్‌ఫోన్స్, బుక్స్ అనుమతించరు.. ఇక మీ ఓపిక, మేధస్సుకి పరీక్ష
విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల్లో రా-డాగింగ్ (Raw-Dogging) ప్రక్రియ ఓ ట్రెండ్‌గా మారుతోంది. ప్రస్తుతం విమానాల్లో ప్రయాణించే చాలా మంది ప్రయాణికులు ఈ ధోరణిని అనుసరిస్తున్నారు. ఇలా పాటించడం వల్ల వివిధ ప్రయోజనాలతో పాటు మనసుకు ప్రశాంతత దొరుకుతుందని అంటున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ అంశం ఇంటర్‌నెట్‌లో ట్రెండింగ్ అవుతంది. అసలు ఈ డోగింగ్ అంటే ఏమిటి? విమాన ప్రయాణంలో ఇది మనకు ఎలా సహాయపడుతుంది? దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ కథనంలో..
సాధారణంగా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు చాలా మంది ప్రయాణికులు తమ సెల్ ఫోన్లు చూడటం లేదా సినిమాలు చూడటం, సంగీతం వినడం, కొంమంది ఎయిర్‌పోర్ట్‌లో కొన్న పుస్తకాలు చదవడం వంటివి చేస్తుంటారు. ఇది విమాన ప్రయాణ సమయంలో మరింత ఆహ్లాదకరంగా మరియు మరింత రిఫ్రెష్‌మెంట్‌గా ఉంటుందని వారంతా భావిస్తున్నారు. ఇది గత కొన్నేళ్లుగా ప్రయాణికులు ఫాలో అవుతున్న పద్ధతిగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఓ ట్రెండ్ కొనసాగుతుంది.

లాంగ్ జర్నీలోని విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు జర్నీ మొత్తంలో పైన తెలిపిన టైమ్ పాస్ పనులు ఏమి చేయకుండా విమానంలో ఖాళీగా కూర్చోవడం ట్రెండ్ అవుతుంది. ఈ ట్రెండ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్నే రా-డాగింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల ప్రయాణికులకు వివిధ ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. సాధారణంగా విమానాల్లో ప్రయాణికులు పుస్తకం చదవకుండా, సినిమా చూడకుండా, సంగీతం వినకుండా నిశ్శబ్దంగా కూర్చునే ట్రెండ్ అంటారు.
ఈ విధానంలో లాంగ్ జర్నీలోని ఫ్లైట్‌లలో వీటిని యాక్సెస్ చేసుకోవడానికి అనుమతి ఉండదు. విమానం ప్రయాణించే విధానం దాని మ్యాప్ ను స్క్రీన్‌పై చూడటానికి మాత్రమే ప్రయాణికులకు అనుమతి ఉంటుంది. ఈ విధానాన్ని ఒక్కో ప్రయాణికుడు ఎన్ని గంటల పాటు ఫాలో అవుతున్నారో ట్రెండింగ్‌లో ఉంది. ఇది ఓ విధంగా ప్రయాణికుల ఓపికకు పరీక్ష అని చెప్పాలి.

చాలా మంది ప్రయాణికులు 10 గంటలు, 11 గంటలు కూడా ప్రయాణించాల్సి ఉంటుంది. తమ ప్రయాణ సమయంలో రా-డాగింగ్ చేస్తుంటారు. నేటి ప్రపంచంలో మానవులు ఎదుర్కొంటున్న సమస్యలలో స్క్రీన్ టైమ్ ఒకటి. ల్యాప్‌ట్యాప్స్, సెల్‌ఫోన్స్‌తో సహా ఇతర గ్యాడ్జెట్లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల మానవ సమయాన్ని వృథా చేస్తుందని, మానవ మెదడుకు అవసరం లేని అనేక విషయాలు బలవంతంగా ఎక్కించినట్లు అవుతుందని సైన్స్ చెబుతున్నారు.
దీన్ని తగ్గించాలంటే వైద్యులు సైతం స్క్రీన్ టైమ్ తగ్గించాలని పట్టుబడుతున్నారు. దీంతో కొంత మంది సెల్ ఫోన్‌ని ఎంత సేపు చూస్తున్నారో ట్రాక్ చేస్తున్నారు. విమాన ప్రయాణ సమయంలో ఇలాంటి పనులు చేయడం వల్ల వారి మెదడుకు అనవసరమైన సమస్యలు వస్తాయి కాబట్టి ఈ ధోరణి విస్తృతంగా మారుతోంది.

ఈ ట్రెండ్ ఉన్న యూజర్లు రిజర్వ్డ్ సీట్లో కూర్చొని ఎలాంటి స్క్రీన్ చూడకుండా సెల్ ఫోన్ ఆఫ్ చేసి ఈ సమయంలో తమ విమానం ప్రయాణించే చోట రిలాక్స్ అవ్వాలి. మీరు చేయాల్సిందల్లా మీ విమానం స్క్రీన్ పై ఉన్న మ్యాప్ ను చూడటం మాత్రమే. దీని ద్వారా మానవులు వారి ముఖ్యమైన ఆలోచనల గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయం మెదడు కల్పిస్తుందని సైన్స్ చెబుతోంది.
అలాగే జీవితంలో తాము చేసే తప్పులు, సమస్యల నుంచి ఎలా బయటపడాలో ఆత్మపరిశీలన చేసుకునే అవకాశం ఉంటుందని తెలిసింది. ఈ ఆలోచనా సమయాన్ని సరైన విధంగా వినియోగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. దీని వల్ల తమకు అనేక ప్రయోజనాలు చేకూరాయని పలువురు ఫాలోవర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అదే సమయంలో తమను తామే ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఈ విధానం ఉపకరిస్తుందని అంటున్నారు. ఇలాంటి ప్రయాణాలతో ప్రయోజనం కలుగుతుందని వారి ఎక్స్‌పీరియన్స్‌ని ప్రయాణికులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ అంశం ట్రెండింగ్ అవుతుంది. విమాన ప్రయాణికుల్లో ట్రెండింగ్‌లో ఉన్న రా-డాగింగ్ ప్రస్తుతం మానవులకు ఉపయోగకరమైనది. చాలా మంది వైద్యులు దీనిని స్వాగతిస్తున్నారు.


Click it and Unblock the Notifications








