సిక్స్ కొట్టిన మహిళా క్రికెటర్.. దెబ్బకు కారు అద్దం పగిలిపోయింది! వీడియో
క్రికెట్ ఆడి చిన్నప్పుడు కిటికీల అద్దాలు పగులగొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల ఓ క్రికెట్ మ్యాచ్‌లో మహిళా క్రికెటర్ కొట్టిన ఓ 'సిక్సర్'కు కారు విండో గ్లాస్ పగిలింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
ఇటీవల బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన మహిళా క్రికెటర్ 'ఎల్లీస్ పెర్రీ' (Ellyse Perry) సిక్సర్ కొట్టింది. బాల్ నేరుగా వెళ్లి బౌండరీ పక్కనే ఆపి ఉంచిన 'టాటా పంచ్ ఈవీ' (Tata Punch EV) యొక్క విండో అద్దాన్ని తాకింది. అంతే బంతి వెళ్లిన వేగానికి కారు విండో అద్దం పగిలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

యూపీ వారియర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిజానికి టాటా పంచ్ ఈవీ అక్కడ ఎందుకు నిలిపి ఉంచారని కొందరికి సందేహం కలగొచ్చు, కానీ ఉమెన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌కు టాటా పంచ్ ఈవీ అధికారిక కారు, ఈ కారణంగానే కారును అక్కడ నిలిపి ఉంచారు. కాగా ఎల్లీస్ పెర్రీ కొట్టిన సిక్సర్ షాట్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఎల్లీస్ పెర్రీ 19వ ఓవర్ 5 బంతిని 80 మీటర్ల పొడవైన సిక్సర్ కొట్టింది. తాను కొట్టిన సిక్సర్ వల్ల కారు అద్దం పగిలిపోయింది, దీనికి ఈమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ను కూడా వీడియోలో గమనించవచ్చు. పెర్రీ సిక్స్ కొట్టినప్పుడు స్టేడియం మొత్తం కోలాహలంతో నిండిపోయింది. వారి టీమ్ కూడా చాలా ఉత్సాహాన్ని కనపరచడం కూడా వీడియోలో చూడవచ్చు.

టాటా పంచ్ ఈవీ (Tata Punch EV)
భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టాటా మోటార్స్ యొక్క 'పంచ్' ఎలక్ట్రిక్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇది క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్ కలిగి రీ రిజైన్ చేయబడిన అనేక ఎలిమెంట్స్ పొందుతుంది. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ కూడా రీడిజైన్ చేసి ఉండటం గమనించవచ్చు. చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ చాలా అప్డేట్స్ ఉండటం గమనించవచ్చు.
టాటా పంచ్ ఈవీ 25 కిలోవాట్ మరియు 35 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్స్ పొందుతుంది. చిన్న బ్యాటరీ ప్యాక్ 315కిమీ రేంజ్ అందించగా.. పెద్ద బ్యాటరీ ప్యాక్ 421 కిమీ రేంజ్ అందిస్తుంది. టాటా పంచ్ ఈవీలోని ఎలక్ట్రిక్ మోటార్ 122 పీఎస్ పవర్ మరియు 190 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 3.3 kW మరియు 7.2 kW వాల్ ఛార్జర్ ఆప్షన్స్ పొందుతుంది.
దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న టాటా పంచ్ ఈవీ కారు ధరలు రూ. 10.99 లక్షల నుంచి రూ. 15.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ మౌంట్స్ మొదలైనవి ఉన్నాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








