'ఎన్‌బిఏ హాల్ ఆఫ్ ఫేమ్'గా మారిన ఓ కార్ సేల్స్‌మెన్ కథ!

భారతదేశానికి చెందిన ఓ కార్ సేల్స్‌మెన్ ఇప్పుడు ప్రతిష్టాత్మక ఎన్‌బిఏ హాల్ ఆఫ్ ఫేమ్‌గా నిలిచారు. కెనడాలో ఉంటున్న నవ్ భాటియా, ఎన్‌బిఏ చరిత్రలోనే ప్రతిష్టాత్మక గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అతను ఎన్‌బిఏలో ఆడటం లేదా కోచింగ్ ఇవ్వడం లేదా జట్టును కలిగి ఉండకుండానే అతని పేరు హాల్ ఆఫ్ ఫేమ్‌కు జోడించబడింది. మరి నవ్ భాటియా యొక్క ప్రేరణాత్మక కథేంటో తెలుసుకుందాం రండి.

'ఎన్‌బిఏ హాల్ ఆఫ్ ఫేమ్'గా మారిన ఓ కార్ సేల్స్‌మెన్ కథ!

నవ్ భాటియా భారతదేశంలోని న్యూ ఢిల్లీలో పుట్టి పెరిగాడు. అతను ఢిల్లీలో మెకానికల్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. 1984 లో సిక్కు వ్యతిరేక అల్లర్ల కారణంగా దేశం విడిచి వెళ్ళి, కెనడాలో స్థిరపడ్డాడు. అప్పట్లో, టర్బన్ (తలాపాగా) మరియు గడ్డంతో వలస వచ్చిన వారిని, కెనడాలో చాలా చులకనగా చూసేవారు. వారి జీవితం చాలా దుర్భరంగా ఉండేది.

'ఎన్‌బిఏ హాల్ ఆఫ్ ఫేమ్'గా మారిన ఓ కార్ సేల్స్‌మెన్ కథ!

నవ్ భాటియా కూడా ఆరంభంలో చాలా చేదు అనుభవాలను ఎదుర్కున్నాడు. అందరిలా అతని జీవితం మంచిగా ప్రారంభం లేదు. మెకానికల్ ఇంజనీర్ అయినప్పటికీ, అతను ఆ దేశంలో ఉద్యోగం పొందలేకపోయాడు. వందలాది ఉద్యోగ దరఖాస్తులు నింపిన తరువాత, చివరకు అతను ఓ కార్ షోరూమ్‌లో సేల్స్‌మెన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు.

ఆ సమయంలో అక్కడి సమాజం నుండి వచ్చిన ద్వేషం, ఎదుర్కున్న సంఘటనలు నవ్ భాటియాను ఏమాత్రం దిగజార్చలేకపోయాయి, పైపెచ్చు మరింత ఎత్తుకు ఎదిగేలా ప్రోత్సహించాయి. ప్రతి విషయంలో హార్డ్ వర్క్ చేస్తూ, విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ ముందుకు వెళ్లసాగాడు భాటియా.

MOST READ:కస్టమైజ్ ఫోర్డ్ పిక్-అప్ ట్రక్కు డ్రైవ్ చేస్తూ కనిపించిన 'సద్గురు జగ్గీ వాసుదేవ్' [వీడియో]

'ఎన్‌బిఏ హాల్ ఆఫ్ ఫేమ్'గా మారిన ఓ కార్ సేల్స్‌మెన్ కథ!

కార్ సేల్స్‌మెన్‌గా ప్రారంభమైన నవ్ తన మార్కెటింగ్ నైపుణ్యాలతో కస్టమర్లను ఇట్టే ఆకర్షించేవాడు. అతను కేవలం 90 రోజుల్లోనే 127 కార్లను విక్రయించి రికార్డు సృష్టించాడు. ఈ రికార్డ్ ఇప్పటికీ అలానే ఉంది. అతని అద్భుతమైన విజయాన్ని గుర్తించిన కార్ షోరూమ్ యజమాని, నవ్ భాటియాను పట్టణంలోని ఓ పెద్ద డీలర్‌షిప్ కోసం జనరల్ మేనేజర్‌గా నియమించారు.

ఆ సమయంలో కార్ షోరూమ్ వ్యాపారం దివాళ స్థాయిలో ఉంది, వెంటనే దానిని పరిష్కరించడం ఎంతో అవసరం. నవ్ భారత్ జాతి కారణంగా, విద్వేశంతో అతని వద్ద పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఉద్యోగం వదలిపెట్టి వెళ్లిపోయాడు. అసలే కష్టాల్లో ఉన్న షోరూమ్ నుండి ఉద్యోగులు నిష్క్రమిస్తుండటంతో భాటియా కుంగిపోకుండా, కొత్త వారికి అవకాశం కల్పించి కంపెనీని లాభాలా బాట పట్టించాడు.

'ఎన్‌బిఏ హాల్ ఆఫ్ ఫేమ్'గా మారిన ఓ కార్ సేల్స్‌మెన్ కథ!

అంకితభావంతో పనిచేసిన నవ్ భాటియా మరియు అతని బృందం నేతృత్వంలో సదరు కార్ డీలర్‌షిప్ కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే దివాలా అంచు నుండి బయటకు రావడమే కాకుండా, కెనడాలోనే అత్యంత విజయవంతమైన మరియు అతిపెద్ద కార్ డీలర్‌షిప్‌గా అవతరించింది. ఆ తర్వాత అతను ఆ డీలర్‌షిప్‌ను యజమాని నుండి కొనుగోలు చేసి, స్వంతంగా వ్యాపారం చేయటం ప్రారంభించాడు. ఇప్పుడు కెనడాలో అనేక కార్ షోరూమ్‌లను ఏర్పాటు చేశాడు.

కార్ల అమ్మకాల పరిశ్రమలో ఆయన సాధించిన విజయాలను హ్యుందాయ్ సీఈఓ కూడా ప్రశంసించారు. ఇది 2018 సంవత్సరంలో ఆర్‌బిసి టాప్ 25 కెనడియన్ ఇమ్మిగ్రెంట్ అవార్డుతో సహా నవ్ భాటియాకు అనేక అవార్డులను కూడా సంపాదించి పెట్టింది. ఇవే కాదు, అతడిన మరిన్ని ఇతర ప్రతిష్టాత్మక అవార్డులు కూడా వరించాయి.

MOST READ:కరోనా ఎఫెక్ట్: 700 మందికి పైగా అరెస్ట్.. ఎక్కడో తెలుసా?

'ఎన్‌బిఏ హాల్ ఆఫ్ ఫేమ్'గా మారిన ఓ కార్ సేల్స్‌మెన్ కథ!

కార్ల అమ్మకాల పరిశ్రమలో తెలివిగా వ్యవహరించడమే కాకుండా, నవ్ భాటియా ఎన్‌బిఏ అంటే కూడా చాలా ఆసక్తి. ఎన్‌బిఏలో రాప్టర్స్ జట్టు అంటే భాటియాకు చాలా ఇష్టం. రాప్టర్స్ ఉనికిలోకి వచ్చిన 1995 సంవత్సరంలో మొదటి రోజు నుండి ఇప్పటి వరకూ నవ్ భాటియా ఏనాడు ఒక్క మ్యాచ్‌ని కూడా మిస్ కాలేదు.

'ఎన్‌బిఏ హాల్ ఆఫ్ ఫేమ్'గా మారిన ఓ కార్ సేల్స్‌మెన్ కథ!

రాప్టర్స్ జట్టు మ్యాచ్ ఓడిపోయినా లేదా గెలిచినా ఫర్వాలేదు, ప్రతి సీజన్‌లో తాను జట్టు పట్ల తమ ప్రేమను, అభిమానాన్ని చాటుకునేవాడు. జట్టు పట్ల అతని విధేయతకు గాను అతనికి 1998 లో రాప్టర్స్ సూపర్ ఫ్యాన్ టైటిల్‌ను ఇచ్చారు. రాప్టర్స్ 2018 లో ఎన్‌బిఏ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నప్పుడు నవ్ భాటియాకు అధికారిక ఛాంపియన్‌షిప్ రింగ్‌ను అందజేశారు.

MOST READ:రైతులకు గుడ్ న్యూస్.. ట్రాక్టర్ కావాలంటే ఫ్రీగా వాడుకోవచ్చు.. ఎక్కడంటే?

'ఎన్‌బిఏ హాల్ ఆఫ్ ఫేమ్'గా మారిన ఓ కార్ సేల్స్‌మెన్ కథ!

అంతేకాదు, ఎన్‌బిఏ చరిత్రలోనే అధికారిక ఛాంపియన్‌షిప్ రింగ్ అందుకున్న మొదటి అభిమాని కూడా నవ్ భాటియానే. ఆ తర్వాత రాప్టర్స్ జట్టు ఛాంపియన్‌షిప్ పరేడ్‌లో కూడా ఆయన పాల్గొన్నాడు. ఈ క్రీడ మరియు జట్టు పట్ల ఆయనకున్న విధేయతకు గాను ఇప్పుడు హాల్ ఆఫ్ ఫేమ్ హోదా లభించింది. ఈ హోదా పొందిన మొదటి అభిమాని కూడా ఈయనే.

'ఎన్‌బిఏ హాల్ ఆఫ్ ఫేమ్'గా మారిన ఓ కార్ సేల్స్‌మెన్ కథ!

ఈ చిరస్మరణీయ సంఘటనను నవ్ భాటియా ప్రస్తావిస్తూ, "నేను చిన్నప్పుడు మా అమ్మతో ఓ ప్రమాణం చేశాను. అదేంటంటే, నేనెప్పుడూ నా తలపాగాను తీసివేయను అని. ఈ రోజు అది హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఉంది. మిమ్మల్నిమీరు విభిన్నంగా తీర్చిదిద్దుకోండి. ఇది మీ సూపర్ పవర్. ఇది నేను ప్రతి రోజు ధరించే కిరీటం. ధన్యవాదాలు, అమ్మ." అని పేర్కొన్నారు.

MOST READ:భారత్‌లో విడుదలైన 2021 జిఎల్‌ఎ & ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35; ధర & వివరాలు

'ఎన్‌బిఏ హాల్ ఆఫ్ ఫేమ్'గా మారిన ఓ కార్ సేల్స్‌మెన్ కథ!

నవ్ భాటియా ప్రతి ఎన్‌బిఏ సీజన్లో 3,00,000 డాలర్లకు పైగా ఖర్చు చేస్తాడు. వివిధ జాతుల పిల్లలను రాప్టర్స్ ఆట చూడటానికి ఆహ్వానిస్తాడు. జాతివివిక్ష లేకుండా, అతను క్రీడ చుట్టూ ఉన్న అన్ని నేపథ్యాల నుండి పిల్లలను ఏకం చేయాలనుకుంటున్నాడు. సమాజం చులకనగా చూసినా, కుంగిపోకుండా ప్రపంచానికి తన సత్తా ఏంటో చూపాడు. ఇది మన నవ్ భాటియా ప్రేరణాత్మక కథ.

Most Read Articles

English summary
Read The Inspiring Story Of A Car Salesman From India, Who Became NBA’s Hall Of Fame. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X