అయ్యో పాపం పేదవాడు.. రేషన్ సరుకులు తీసుకెళ్లడానికి 'బెంజ్' కారు మాత్రమే ఉపయోగిస్తాడు [వీడియో]

సాధారణంగా దేశంలోని పేదలకు, నిరుపేదలకు ప్రయోజనం చేకూర్చడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సంక్షేమ పథకాలు మరియు ఉచిత పథకాలను అందిస్తూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా కేవలం పేద ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే. కానీ అటువంటి పథకాలను అనర్హులు కూడా చాలా మంది సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలాంటివి అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి. అయితే వీటిపైన చర్యలు తీసుకున్నప్పటికీ పూర్తిగా నిలువరించలేకపోతున్నారు.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

ఇలాంటి సంఘటన ఇటీవల కూడా వెలుగులోకి వచ్చింది. ఇందులో ఒక వ్యక్తి 'బెంజ్' కారులో వచ్చి రేషన్ సరుకులు తీసుకుని వెళ్ళాడు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. దీని వెనుక ఉన్న అసలు నిజాలు ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బెంజ్ కారులో రేషన్ సరుకులు తీసుకెళ్లిన పేదవాడు [వీడియో].. అయ్యో, పాపం

నివేదికల ప్రకారం, ఇటీవల పంజాబ్ ప్రభుత్వం విక్రయించిన గోధుమలను కిలో 2 రూపాయలకు కొనుగోలు చేయడానికి ఒక వ్యక్తి తన మెర్సిడెస్ బెంజ్ కారులో వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

బెంజ్ కారులో రేషన్ సరుకులు తీసుకెళ్లిన పేదవాడు [వీడియో].. అయ్యో, పాపం

నిజానికి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి ప్రభుత్వం కేటాయించిన దుకాణాల్లో రేషన్ అందించడం జరుగుంది. ఇది దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతోంది. అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనలో బెంజ్ కారులో వచ్చిన వ్యక్తి రేషన్ సరుకులు తీసుకెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. పేద ప్రజలకోసం అందిస్తున్న సరులు ధనవంతలు తీసుకెళ్లడంపై చాలామంది ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

బెంజ్ కారులో రేషన్ సరుకులు తీసుకెళ్లిన పేదవాడు [వీడియో].. అయ్యో, పాపం

ఈ వీడియో వైరల్ కావడంతో బెంజ్ కారులో వచ్చిన వ్యక్తి దానిపైన వివరణ అందించాడు. వీడియోలో కనిపించిన వ్యక్తి పేరు 'రమేష్ కుమార్ సైనీ'. ఇతడు హోషియార్పూర్ లోని అజోవాల్ రోడ్డుకు చెందిన వ్యక్తి. ఇతడు సంవత్సరానికి ఒకసారి పంజాబ్ కి వచ్చి వారి పొరుగున ఉన్న ఒక ఇంటిలో ఉంటాడని చెప్పాడు. అయితే అతడు ఉపయోగించిన ఆ బెంజ్ కారు తన ఎన్ఆర్ఐ బంధువుదని చెప్పుకొచ్చాడు.

అమెరికాలో నివసిస్తున్న అతని బంధువు ఒకరు తమ మెర్సిడెస్ బెంజ్ కారుని జాగ్రత్తగా ఉపయోగించమని చెప్పడం వల్ల అప్పుడప్పుడు అవసరానికి ఉపయోగిస్తున్నట్లు ఆయన చెప్పాడు. ఎప్పుడూ కాకుండా ప్రతి 10 లేదా 15 రోజులకు ఒక సారి మాత్రమే ఆ కారును అతడు ఉపయోగిస్తాడు. అది కూడా మంచి కండిషన్ లో ఉందా.. లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే.

బెంజ్ కారులో రేషన్ సరుకులు తీసుకెళ్లిన పేదవాడు [వీడియో].. అయ్యో, పాపం

కారుని చాలా రోజులు ఉపయోగించకుండా ఉంటె బ్యాటరీ డిశ్ఛార్జ్ అవుతుంది, కాబట్టి అప్పుడప్పుడు ఉపయోగిస్తున్నట్లు తెలిపాడు. అయితే ఒక రోజు ఈ కారుని ఉపయోగిస్తున్నప్పుడు తమ పిల్లలు రేషన్ షాప్ నుంచి గోధుమలు తీసుకోవడంతో ఇంటికి వెళ్లే క్రమంలోనే ఆ గోధుమలను కారు డిక్కీలో వేసుకుని వెళ్లినట్లు చెప్పాడు.

బెంజ్ కారులో రేషన్ సరుకులు తీసుకెళ్లిన పేదవాడు [వీడియో].. అయ్యో, పాపం

అంతే కాకూండా, రమేష్ కుమార్ సైనీ కుమారుడు అనూప్ సైనీ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి ట్రక్ డ్రైవర్ అని, ఒక ప్రమాదం తరువాత ఉద్యోగం కోల్పోయాడని చెప్పాడు. అయితే అతడు (అనూప్ సైనీ) ఫోటోగ్రాఫర్ అని, అతని భార్య టైలర్ గా పనిచేస్తుందని చెప్పాడు. మెర్సిడెస్ బెంజ్ కారు వంటి విలాసవంతమైన కారుని కొనుగోలు చేయడం మా ఆదాయానికి మించినదని ఆయన చెప్పారు.

బెంజ్ కారులో రేషన్ సరుకులు తీసుకెళ్లిన పేదవాడు [వీడియో].. అయ్యో, పాపం

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని వెనుక ఉన్న నిజా, నిజాలను తెలుసుకోవడానికి విచారణ జరపడానికి సంబంధింత అధికారులను ఆదేశించింది. విచారణ తరువాత అసలు నిజాలు బయటపడతాయి.

ఈ వీడియోలో కనిపించిన మెర్సిడెస్ బెంజ్ కారు విషయానికి వస్తే, ఇది భారతీయ మార్కెట్లో విక్రయించబడుతున్న అత్యంత ఖరీదైన జర్మన్ లగ్జరీ కార్లలో ఒకటి. ఇది సి క్లాస్ సి200 మోడల్ అని తెలుస్తోంది. ఇది కంపెనీ యొక్క ఖరీదైన వెహికల్. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి మంచి పనితీరుని కూడా అందిస్తుంది.

బెంజ్ కారులో రేషన్ సరుకులు తీసుకెళ్లిన పేదవాడు [వీడియో].. అయ్యో, పాపం

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతదేశంలో దాదాపు సంపన్న కుటుంబాలు మాత్రమే బెంజ్ కారు వంటి లగ్జరీ కార్లను కలిగి ఉంటారు. ఇలాంటి వారికి భారతదేశంలో దాదాపు ఏ రాష్ట్రంలోనూ ఉచిత పథకాలు అందవు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటనలో ఆ వ్యక్తి బెంజ్ కారులో సరుకులు తీసుకెళ్లడం స్ఫష్టంగా కనిపిస్తోంది. కావున ఈ కారు ఇతని సొంతమేనా.. లేదా, అతడు చెప్పినట్లు అతని భందువుదా.. అనేది తెలియాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతోపాటు, కొత్త కార్లు మరియు బైకులు గురించి మరింత సమాచారం తెలుసుకోటానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, September 9, 2022, 13:19 [IST]
English summary
Real story behind viral video of poor man came in mercedes benz buys ration in punjab details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+