అత్యవసర పరిస్థితుల్లో విమానంలోనే మీ లగేజీని ఎందుకు వదిలేయాలి.??.. అందుకు గల కారణాలివే.!!
అత్యవసర పరిస్థితుల్లో, ప్రయాణికులను విమానం నుంచి(Aircraft Emergency Conditions) తరలించినప్డుడు.. ప్రయాణికుల లగేజీని విమాన సిబ్బంది వారికి అందజేయరు. అయితే ఆ సమయంలో విమానంలోని ప్రయాణికుల వస్తువులు ఏమై ఉంటాయనే సందేహం మీకు రావచ్చు. ఇందుకు కొన్ని కారణాలున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి..
విమాన ప్రయాణ అనుభూతి ఎవరికైనా సరే చాలా అద్భుతమైనది. మీరూ ఫ్లైట్ జర్నీ చేసే ఉంటే.. మీకూ ఎప్పుడో ఒకసారి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. అత్యవసర ల్యాండింగ్ మరియు విమానాల నుంచి ప్రయాణికులను అత్యవసరంగా తరలించడం వంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటివి జరగకుండా విమానయాన సంస్థలు పలు చర్యలు చేపట్టినా.. అక్కడకక్కడా చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ లేదా ప్రయాణికుల ఎమర్జెన్సీ తరలింపు సమయంలో ప్రయాణికులందరినీ 90 సెకన్లలోపు ఖాళీ చేయగలిగేలా విమానాన్ని సంస్థలు రూపొందిస్తాయి. వాటిలో ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లతో సహా అనేక ప్రణాళికలతో విమానాన్ని నిర్మిస్తారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) నిబంధనల ప్రకారం.. విమానాలు అగ్నిప్రమాదం, ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు 90 సెకన్లలోపు ప్రయాణికులను మరియు సిబ్బందిని విమానం నుండి ఖాళీ చేయగలిగేలా సిబ్బంది సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.
అందుకని, అత్యవసర తరలింపు(Flight Emergency Conditions) సమయంలో ప్రయాణీకులు తమ క్యారీ-ఆన్‌లను విమానంలోనే వదిలివెళ్లాలని సూచిస్తుంది. అయితే, వాస్తవానికి, ఇలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు.. ప్రయాణికులు బయటకు వెళ్లేటప్పుడు.. ఓవర్‌హెడ్ బిన్‌ల నుంచి మరియు వారి సీట్ల క్రింద వారి క్యారీ-ఆన్ బ్యాగ్‌లను తీసుకోవడం చేస్తుంటారు.

దీని ద్వారా ప్రయాణికులను తరలించే ప్రక్రియ(Passengers Evacuation In Flights) నెమ్మదిస్తుంది. ఇలాంటి సమయంలో ఇతర ప్రయాణికులకు గాయాలయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ఉండే బెలూన్ ద్వారా ప్రయాణికులు కిందకు జారుకోవాల్సి ఉంటుంది.
ఆ సమయంలో ప్రయాణీకుల చేతిలో ఏదైనా లగేజీ ఉంటే, క్రింద విస్తరించిన బెలూన్ దెబ్బతింటుంది. పంక్చర్ అయ్యే అవకాశం ఉండటంతో.. విమానాల నుంచి దిగేటప్పుడు ప్రయాణీకులకు వారి వస్తువులను తీసుకోవడానికి అనుమతి నిరాకరిస్తారు. అంతేకాకుండా ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు తమ వస్తువులను కాపాడుకోవాలని అనుకోవడం పూర్తిగా స్వార్థం.
అయితే మరి చివరికి సామాగ్రి ప్రయాణికుల చేతికి సురక్షితంగా ఎలా అందుతుంది.. అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఇలా విమానంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగినా, టేకాఫ్ సమయంలో ఏదైనా సమస్య వచ్చినా, ప్రయాణికులను అత్యవసరంగా బయటకు తరలించినా.. వస్తువులు భద్రంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఎయిర్‌పోర్టు సిబ్బంది లోపలికి వెళ్లి సామగ్రిని.. నేరుగా టెర్మినల్‌కు తరలిస్తారు.
టెర్మినల్‌లో సంబంధిత సిబ్బంది వాటిని స్వీకరిస్తారు. దీని కోసం, విమానయాన సంస్థలు తమ విమానాల్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకుల ఫోన్ నంబర్‌ను సంప్రదించి.. ఈ లగేజీలన్నిటినీ ఎక్కడ మరియు ఎవరికి అప్పగించారో సమాచారం అందిస్తాయి. దాని ద్వారా అక్కడకు వెళ్లి ప్రయాణికులు తమ లగేజీని తిరిగి పొందవచ్చు.
కాబట్టి విమాన ప్రయాణంలో అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఇందులోని ప్రయాణికులు.. బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అప్పుడే ఎక్కువ మంది ప్రజలు ఈ ప్రమాదాల నుండి సురక్షితంగా బయటపడతారు. ప్రాణనష్టం వాటిల్లకుండా ఉంటుంది. అందువల్ల, ప్రయాణికులు అత్యవసర తరలింపు సందర్భంలో, మీ వస్తువులను ఫ్లైట్‌లోనే వదిలి, మీ ప్రాణాలను కాపాడుకోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








