ట్రక్కులు మరియు లారీల వెనుక "Horn Ok Please" ఎందుకు రాస్తారో తెలుసా ?

Posted By:

మనం నిత్యం లారీల వెనక వైపు హార్న్OK ప్లీజ్ అని పెయింట్ చేయబడిన పదాలను చూస్తూనే ఉంటాం. కానీ ఈ పదాలకు అర్థం ఏంటి? ఈ పదాలు ఎక్కడి నుండి వచ్చాయి,  వీటిని వాడటం వెనుకున్న కారణాల గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు అని చెప్పవచ్చు. ఇవాళ్టి స్టోరీలో ఈ "Horn Ok Please" అంటే ఏంటి మరియు దాని చరిత్ర ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..

హార్న్ OK ప్లీజ్ అంటే ఏమిటి

ఈ హార్న్ ఓకే ప్లీజ్ అనే పదాలు చూసి వాహన చోదకులు అనవసరంగా హారన్ ఉపయోగించి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నారని సెక్షన్ 134 (1) వాహన చట్టం కింద 2015 ఏప్రిల్ 30 న మహారాష్ట్ర ప్రభుత్వం వాహనాలపైన "Horn Ok Please" అనే పాదాలను బ్యాన్ చేసింది. హార్న్ ఓకే ప్లీజ్ అనే పదాలు ఖచ్చితంగాఎక్కడి నుండి వచ్చాయో ఎవరికీ తెలియదు కానీ ఈ పదాలు ఎలా వచ్చాయో అనే దానికి 5 కథలు ప్రాచుర్యం లో ఉన్నాయి. అవేంటో చూద్దాం రండి...

1) సురక్షితంగా ఓవర్టేక్ చేయడానికి వీలుగా...

1) సురక్షితంగా ఓవర్టేక్ చేయడానికి వీలుగా...

గతంలో మన దేశంలో చాల వరకు సింగిల్ రోడ్లే ఉండేవి కనుక ట్రక్కు వెనుకవైపు ఉన్నవారు ట్రక్కును సులభంగా ఓవర్టేక్ చేయడానికి సాద్యమయ్యేది కాదు. ఇలా ఓవర్ టేక్ చేసి యాక్సిడెంట్ల పాలైన వారు చాలా మందే ఉన్నారు. ఈ సమస్యను ఎలాగైనా అధిగమించాలనే ఉదేశ్యం తో లారీ తయారీ కంపెనీలు "OK" అనే పదం పైన ఒక బల్బ్ ను పెట్టేవారు. వెనుక వైపునుండి ఓవర్టేక్ చేయదలిచిన వాహనాలు హార్న్ ఇస్తే ట్రక్కు డ్రైవర్ తన ముందు ఏవైనా వాహనాలు వస్తున్నాయో లేదో చూసి, ఏ వాహనాలు రాకపోతే OK పై ఉన్న లైట్ ఆన్ చేసే వాడు. ఈ సిగ్నల్ చూసుకుని వెనుకవైపు వాహనాలు సురక్షితంగా ట్రక్కును ఓవర్టేక్ చేసేవారు. కాలం గడిచే కొద్దీ ప్రభుత్వాలు తమ రోడ్లను విస్తరించడం వల్ల ఇపుడు మనకు అలాంటి బల్బుల అవసరం తీరిపోయింది.

2) రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో...

2) రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో...

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో దళాలు కిరోసిన్‌ ఇంధనాన్ని ట్రక్కులు ద్వారా తీసుకెళే వారు. కిరోసిన్ ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో ట్రక్కు పేలిపోయే అవకాశం ఉండేది. కనుక ట్రక్కు వెనకాల వస్తున్న వాహనాలను హెచ్చరించడానికి 'OK' అంటే ' ఆన్ కిరోసిన్ ' (On kerosene) అని పెయింట్ చేయించేవారు. యుద్ధం ముగిసిపోయింది కానీ ఈ పదాలు మాత్రం లారీల వెనుక వైపు అలాగే ఉండిపోయాయి.

3) ఒక సబ్బు కథ...

3) ఒక సబ్బు కథ...

టాటా ఆయిల్ మిల్స్ లిమిటెడ్ (టోమ్కో) చేత ప్రారంభించిన డిటర్జెంట్‌ను ప్రోత్సహించడానికి, వారు ఈ ట్రక్కులను మాధ్యమాలుగా ఉపయోగించే వారు అని తెలుస్తోంది. టాటా గ్రూప్ తయారు చేసిన సోప్ పేరు 'OK'. ట్రక్కుల పైన పెయింట్ చేయబడి ఉన్న "OK" సాధారణంగా లోటస్ పుష్పంతో కూడి ఉంటుంది, టాటా సోప్ బ్రాండ్ చిహ్నం కూడా లోటస్ పువ్వు ఆకారంలోనే ఉండడం గమనార్హం. టాటా గ్రూప్ తరువాత సోపు తయారీని నిలిపివేసింది, అయినా కూడా ఇప్పటికి పెయింటర్లు ట్రక్కుకు పెయింట్ చేసే సమయంలో "ఓకే" అని రాయడం పరిపాటిగా మారిపోయింది.

4) కనీస దూరం పాటించడానికి...

4) కనీస దూరం పాటించడానికి...

మీ వాహనంలో నుండి స్పష్టంగా "OK" పదం మీకు కనపడినట్లైతే మీరు సేఫ్ డిస్టెన్స్ లో ఉన్నారని, ఒకవేళ కనపడకపోతే మీరు ట్రక్కుకు మరీ దగ్గరలో ఉన్నారని అర్థం.

5) OTK కాస్త OK గా మారిపోవడం...

5) OTK కాస్త OK గా మారిపోవడం...

కొన్నేళ్ళ క్రితం వరకు ట్రక్కుల వెనుకవైపు "Horn Ok Please" అని కాకుండా "Horn OTK Please" అని ముద్రించే వారు. OTK అనగా Overtake అని అర్థం. అంటేఓవర్‌టేక్ చేసే ముందు దయచేసి హారన్ ఇవ్వండి అని. కానీ చాలా సందర్భాల్లో OTK లోని T ట్రక్కు ప్యానెలింగ్ లో విలీనం అయిపోయి కనపడేది కాదు. కాలక్రమేనా పెయింటర్లు OTK స్థానంలో కేవలం OK అని రాయడం ప్రారంభించి, ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

English summary
Read In Telugu Reasons behind the usage of Horn OK Please on trucks
Story first published: Wednesday, June 14, 2017, 18:39 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark