'108' ఈ నెంబర్ అంబులెన్స్‌కి ఎలా వచ్చిందంటే?

ప్రపంచదేశాల్లో అంబులెన్సులకున్న ప్రత్యేకత ప్రత్యేకంగా చెప్పవలసిన ఆవసరం లేదు. అత్యవసర సమయంలో ఎంతమంది ప్రాణాలను కాపాడటానికి అంబులెన్సులు ఎంతగా పనికొస్తాయో కూడా తెలుసు. కానీ ఆంబులెన్సులకు భారతదేశంలో ఒక ప్రత్యేక సంఖ్య నిర్ణయించడం జరిగింది. ఆ సంఖ్య 108.

భారతదేశంలోని అంబులెన్సులకు 108 అనే నెంబర్ ఎందుకు పెట్టారు, దీని వెనుక ఉన్న కారణం ఏమిటి అనే దానిని గురించి పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

అంబులెన్స్‌లకు 108 నెంబర్ ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి

అంబులెన్సులను ఉపయోగించే 108 నెంబర్ కి ఖగోళ శాస్త్రానికి ఒక అవినాభావ సంబంధం లేకుండా పోలేదు. ఏ విధంగా అంటే, భూమధ్యరేఖ వద్ద భూమి యొక్క వ్యాసం 7,926 మైళ్ళు. కానీ సూర్యుడి వ్యాసం దీని కంటే 108 రెట్లు ఎక్కువ. సూర్యుడి వ్యాసం 8,56,008 మైళ్ళు. అదే సమయంలో భూమికి, సూర్యుడికి మధ్య దూరం సుమారు 9,24,48,864 మైళ్ళు. ఇది సూర్యుని వ్యాసం కంటే 108 రెట్లు పెద్దది.

అంబులెన్స్‌లకు 108 నెంబర్ ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి

చంద్రుడి వ్యాసం 2,180 మైళ్ళు. భూమి మరియు చంద్రుల మధ్య దూరం 2,35,440 మైళ్ళు. ఇది చంద్రుని వ్యాసం కంటే 108 రెట్లు పెద్దది. ఈ లెక్కలన్నీ కలిసి 108 ను ప్రత్యేక సంఖ్యగా చేస్తాయి. కావున ఈ సంఖ్యకు మన ఖగోళ శాస్త్రానికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తాయి. అందువల్లనే ప్రాణాలను రక్షించే అంబులెన్స్‌ల కోసం 108 సంఖ్యను ఎమర్జెన్సీ నెంబర్ గా నిర్దారించారు.

అంబులెన్స్‌లకు 108 నెంబర్ ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి

హిందూ సంప్రదాయం:

భారతదేశంలో ఉన్న హిందూ మత సంప్రదాయానికి మరియు ఈ 108 నెంబర్ కి కూడా ఒక విడదీయలేని సంబంధం ఉంది. ఎలా అంటే హిందూ సంప్రదాయం ప్రకారం మంత్రాలను 108 సార్లు పఠిస్తారు. అంతే కాదు సాధువులు 108 పూసలను కలిగి ఉన్న జపమాలతో 108 సార్లు జపిస్తారు. హిందూ మతంలోని దేవుళ్లకు 108 పేర్లు కూడా ఉన్నాయి. ఇలాంటి కారణాల వల్ల 108 సంఖ్య అంబులెన్స్‌ల కోసం అత్యవసర నంబర్‌గా ఉపయోగించబడిందని తెలుస్తోంది.

అంబులెన్స్‌లకు 108 నెంబర్ ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి

హ్యూమన్ సైకాలజీ :

108 అనేది కష్ట సమయంలో కూడా సులభంగా గుర్తుంచుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. అంతే కాకుండా మనం ఫోన్ యొక్క డయల్ ప్యాడ్‌ను చూసినప్పుడు, మన కళ్ళు ఆటోమాటిక్ గా ఎడమ వైపున ఉన్న మొదటి సంఖ్యకు, అంటే సంఖ్య 1 ని చూస్తాయి. అదేవిధంగా దాని తర్వాత క్రమంగా కింద ఉన్న 0 ని చూస్తారు, తరువాత 8 ని చూస్తారు కావున, హ్యూమన్ సైకాలజీ ప్రకారం 108 ని ఎమర్జెన్సీ నెంబర్ గా నిర్దారించారు.

అంబులెన్స్‌లకు 108 నెంబర్ ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి

భూత, భవిష్యత్ మరియు వర్తమానం:

భావోద్వేగాలు మొత్తం 108 ఉన్నాయని చెబుతారు. ఇందులో 36 భావోద్వేగాలు గతానికి సంబంధించినవి అంటే భూతకాలానికి సంబంధించినది. 36 భావోద్వేగాలు వర్తమానానికి సంబంధించినవి. మరో 36 భావోద్వేగాలు భవిష్యత్తుకు సంబంధించినవిగా చెబుతారు. ఈ అన్ని కాలిస్తే మొత్తం 108 అవుతాయి.

అంబులెన్స్‌లకు 108 నెంబర్ ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి

అంతే కాకుండా లెక్క ప్రకారం మొత్తం 108 ఇంద్రియాలు ఉన్నాయని చెబుతారు. ఈ కారణాలన్నింటిని పరిగణలోకి తీసుకుని అంబులెన్స్ అత్యవసర సమయంలో స్పందించడానికి 108 అని కేటాయించడం జరిగింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
Reason Behind Using 108 As The Emergency Number. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X